మీడియాపై మోదీ అసహనం
Published Wed, Jul 13 2016 11:14 AM | Last Updated on Tue, Oct 9 2018 6:34 PM
న్యూఢిల్లీ: హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాది బుర్మాన్ వనీ మృతి పట్ల మీడియా ఎక్కువ కవరేజీ ఇవ్వడంపై ప్రధాని నరేంద్రమోదీ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఒక ఉగ్రవాదిని ప్రసార మాధ్యమాలు హీరోగా చేయడాన్ని మోదీ తప్పుబట్టారు. బుర్మాన్ వనీ ఎన్ కౌంటర్, అనంతరం నెలకొన్న పరిస్థితులపై నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో మోదీ ఈ వ్యాఖ్యలు చేసినట్టు సమాచారం. దేశాన్ని విచ్చిన్నం చేయడానికి ప్రయత్నించే ఇటువంటి వారిని ఉపేక్షించే పరిస్థితి లేదని అన్నారు. అతని అనుచరులూ తగిన మూల్యం చెల్లించక తప్పదని మోదీ స్పష్టం చేశారు.
Advertisement
Advertisement