burhan wani
-
‘ఉగ్రవాద కమాండర్ వర్ధంతిని జరపడం సిగ్గుచేటు’
లండన్ : హిజ్బుల్ ముజాహిద్దీన్ కమాండర్ బర్హాన్ వనీ మరణించి నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా ఆయన వర్ధంతి రోజున యూకేకు చెందిన పాకిస్తాన్ వేర్పాటువాద సంస్థలు లండన్‌లోని భారత హైకమిషన్ ఎదుట నిరసనలు చేపట్టారు. గ్లోబల్ కశ్మీర్, పాకిస్తాన్ కౌన్సిల్ చైర్మన్ రాజా సికందర్ ఖాన్ మాట్లాడుతూ.. భారత సంకేళ్ల నుంచి తన మాతృభూమి విముక్తి కోసం తన జీవితానికి త్యాగం చేసిన షాహీద్ బుర్హాన్ వనీ అమరుడై నాలుగేళ్ల జ్ఞాపకార్థం తాము సంఘీభావం తెలుపుతున్నామని తెలిపారు. ఈ నిరసనకు ఓవర్సీస్ పాకిస్తాన్ వెల్ఫేర్ కౌన్సిల్,గ్లోబల్ పాకిస్తాన్, కాశ్మీర్ సుప్రీం సహా బృందాలు మద్దతిచ్చాయి. కాగా కశ్మీర్లో హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థకు బుర్హాన్ వనీ నేతృత్వం వహించిన విషయం తెలిసిందే. 2016 జూలైలో జరిగిన ఎన్కౌంటర్లో బర్హాన్ వనీని భారత ఆర్మీ సైన్యం మట్టుబెట్టింది. (నేపాల్‌లో భారత న్యూస్ చానళ్ల నిలిపివేత) మెట్రోపాలిటన్ పోలీసులు, యూకే విదేశీ, కామన్వెల్త్ కార్యాలయం,హోమ్ ఆఫీస్ అందించిన భద్రతా సహకారాన్ని లండన్‌లోని భారత హైకమిషన్ స్వాగతించింది. 2016లో బర్హాన్ మరణించక ముందు తన బృందంతో కశ్మీర్లో ఎన్నో అల్లర్లు, దాడులు జరిపాడని ఈ దాడుల్లో ఎంతో మంది జవాన్లు, పౌరులు మరణించినట్లు భారత మిషన్ కమ్యూనికేషన్ పేర్కొంది. అంతర్జాతీయంగా ఉగ్రవాద సంస్థ అయిన హిజ్బుల్ ముజాహిదీన్‌కు జమ్మూ కాశ్మీర్లో హింసాత్మక ఘటనలు సృష్టించిన చరిత్ర ఉందని అధికారులు స్పష్టం చేశారు. (భారత్-చైనా సరిహద్దులో మెరుగవుతున్న పరిస్థితులు) -
కశ్మీర్లో ముగ్గురు ఉగ్రవాదుల ఎన్కౌంటర్
శ్రీనగర్: ఉగ్రవాదుల ఏరివేతలో జమ్మూకశ్మీర్ పోలీసులు కీలక పురోగతి సాధించారు. శుక్రవారం జరిపిన ఎన్కౌంటర్లో హిజ్బుల్ కమాండర్ బుర్హాన్ వనీ సన్నిహితుడైన లతీఫ్ దార్ అలియాస్ లతీఫ్ టైగర్‌తో పాటు ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టారు. ఈ ఘటన షోఫియాన్ జిల్లా ఇమాన్ సాహిబ్ ప్రాంతంలో చోటు చేసుకుంది. ‘భద్రతా దళాలు సాధారణ తనిఖీలు నిర్వహిస్తుండంగా అకస్మాత్తుగా కాల్పులు జరిగాయి. దీంతో అక్కడ ఉగ్రవాదులున్నారన్న అనుమానం బలపడింది. వారు తప్పించుకోకుండా కాల్పులు జరిపాం’ అని పోలీస్ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. మృతి చెందిన లతీఫ్ టైగర్ 2014లో ఉగ్రవాద సంస్థలో చేరగా, అతన్ని అరెస్టు చేశారని ప్రస్తుతం బెయిల్ మీద ఉన్నట్లు తెలిపారు. లతీఫ్ టైగర్ బెయిల్ గడువు పూర్తయిన తర్వాత జిల్లా జడ్జి ముందు హాజరు కావాల్సి ఉన్నప్పటికీ వెళ్లకుండా హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదుల్లో చేరాడని చెప్పారు. అలాగే లతీఫ్ పలు నేరాల్లో నిందితుడిగా ఉన్నాడని, దక్షిణ కశ్మీర్‌లోని సర్పంచులను చంపిన కేసుల్లోనూ అతని హస్తముందని అన్నారు. ‘చివరగా మిగిలి ఉన్న ఉగ్రవాదుల్లో లతీఫ్ ఒకడు. లతీఫ్ మృతితో రియాజ్ నైకూ, జకీర్ మూసా వంటి ఉగ్రవాదులు మాత్రమే మిగిలి ఉన్నారు’ అని చెప్పారు. లతీఫ్ బుర్హాన్ వనీతో కలిసి ఉగ్రవాద గ్రూపు హిజ్బుల్ ముజాహిదీన్ పోస్టర్ బాయ్‌గా పనిచేశాడు. 2016 జూలైలో బుర్హాన్ మృతితో లతీఫ్ రియాజ్ నైకూ సహాయకుడిగా ఉన్నాడు. -
చర్చలకు తలుపులు మూసిన ‘తపాలా బిళ్ల’
అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ వారంలో భారత్-పాకిస్తాన్ విదేశాంగ మంత్రుల సమావేశం జరిగేది. భారత్ పాక్‌ల మధ్య చర్చలు జరగాలన్న పాక్ నూతన ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రతిపాదనకు భారత్ అంగీకరించింది. అయితే, ఆ తర్వాత 24 గంటల్లోనే పాక్‌తో చర్చలు జరిపేది లేదని భారత్ స్పష్టం చేసింది. కశ్మీర్లో ‘భారత ప్రభుత్వ దురాగతాల’పై వెలువడిన తపాలా బిళ్లలే చర్చల రద్దు నిర్ణయానికి ప్రధాన కారణంగా భారత విదేశాంగ శాఖ చెబుతోంది. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు భారత సరిహద్దు భద్రతా దళం సైనికుడిని గొంతుకోసి దారుణంగా చంపడం, ముగ్గురు కశ్మీరీ పోలీసులను కిడ్నాప్ చేసి చంపేయడం కూడా మరో కారణమని అంటోంది. బుర్హాన్ వనీ ఫోటోతో స్టాంపు 8 రూపాయల విలువైన 20 తపాలా బిళ్లలను పాకిస్తాన్ విడుల చేసింది. ‘భారత్ ఆక్రమిత కశ్మీర్లో అత్యాచారాలు’ పేరుతో విడుదలయిన ఈ తపాలా బిళ్లపై కశ్మీర్లో వివిధ సందర్భాల్లో జరిగిన ఘటనల బాధితుల ఫోటోలు ఉన్నాయి. 2016లో జరిగిన ఎన్కౌంటర్లో చనిపోయిన కశ్మీర్ తీవ్రవాది బుర్హాన్ వనీ ఫోటోతో ఒక స్టాంపు ఉంది. బుర్హాన్‌ను స్వతంత్రయోధుడిగా ఆ తపాల బిళ్లపై పేర్కొన్నారు. అలాగే, భద్రతా దళాల వాహనం బానెట్‌పై ఫరూఖ్ అహ్మద్ దార్ అనే నిరసనకారుడిని కట్టేసి తీసుకెళుతున్న ఫోటోను ‘హ్యూమన్ షీల్డ్’ పేరుతో మరో తపాలా బిళ్లపై ముద్రించారు. రసాయన ఆయుధాలు, పెల్లెట్ల బాధితులుగా చెపుతున్న వారి ఫోటోలు, కశ్మీర్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన ప్రదర్శనలు మొదలైన ఫోటోలు ఇతర స్టాంపులపై ఉన్నాయి. ఈ తపాలా బిళ్లల రూపకల్పనను బట్టి తీవ్రవాదం విషయంలో పాక్ కొత్త ప్రభుత్వం కూడా పాత దారిని మార్చుకోలేదని, కొత్త ప్రధాని అసలు స్వరూపం బయటపడిందని భారత విదేశాంగ శాఖ వ్యాఖ్యానించింది. ఎవరి పని ఇది భారత్‌కు వ్యతిరేకంగా ఈ తపాలా బిళ్లలను ఎవరు తెచ్చారన్నది స్పష్టం కాలేదు. దేశంలో ఎవరైనా ఇలాంటి స్మారక తపాలా బిళ్లల ప్రతిపాదన చేయవచ్చని పాక్ తపాలా శాఖ ఉన్నతాధికారి ఒకరు అన్నారు. ‘ఇలాంటి ప్రతిపాదనను తపాలా శాఖ ఆమోదిస్తే, కమ్యూనికేషన్ల మంత్రిత్వ, విదేశాంగ శాఖల ఆమోదానికి వెళుతుంది. అది కూడా అయితే తుది ఆమోదం కోసం ప్రధాన మంత్రి కార్యాలయానికి వెళుతుంది. ’అని ఆయన వివరించారు. ఎన్నికలకు ముందున్న తాత్కాలిక ప్రభుత్వానిదే ఈ ఆలోచన అని దాని హయాంలోనే ఈ తపాలా బిళ్లలు బయకొచ్చి ఉంటాయని భావిస్తున్నారు. ఎప్పుడు విడుదలయ్యాయి పాకిస్తాన్లో సార్వత్రిక ఎన్నికలు జరగడానికి ఒక రోజు ముందు జులై 24న వీటిని విడుదల చేయడం జరిగింది. అంటే ఇమ్రాన్ ప్రధాని ప్రమాణ స్వీకారం చేయడానికి 25 రోజుల ముందన్న మాట. ఎలా అమ్మారు ఈ తపాలా బిళ్లలను 20 బిళ్లలు ఒక షీటు చొప్పున మొత్తం 20వేల షీట్లు ముద్రించారు. ఈషీటు విదేశాల్లో ఒక్కొక్కటి 6 డాలర్ల చొప్పున అమ్ముడుపోయాయని పాకిస్తాన్‌లోని తపాలా బిళ్లల సేకరణాభిలాషులు తెలిపారు. అయితే, తాము ఒక్కోషీటు 1.30 డాలర్ల చొప్పున 300 షీట్లు విక్రయించామని పాక్ తపాలా శాఖ అధికారి ఒకరు చెప్పారు. 20వేలలో చాలా షీట్లు అమ్ముడైనట్టు ఆయన చెప్పారు. -
ఆమెకు ఉగ్ర సంస్థలతో సంబంధాలు ఉన్నాయి!
సాక్షి, న్యూఢిల్లీ : లష్కర్-ఎ-తొయిబా చీఫ్ హఫీజ్ సయీద్‌తో సంబంధాలు కలిగి ఉన్న కశ్మీరి వేర్పాటు వాది ఆసియా ఆండ్రాబీని విచారిస్తున్న జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అధికారులు పలు కీలక విషయాలు వెల్లడించారు. ఆసియాకు పలు ఉగ్ర సంస్థలతో సంబంధాలు ఉన్న విషయాన్ని నిరూపించేందుకు తగిన ఆధారాలు సమీకరించినట్లు పేర్కొన్నారు. లండన్ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ ఓ ఆలయాన్ని ప్రారంభించిన సమయంలో.. లష్కర్- ఎ- తొయిబాతో సహా పలు ఉగ్రవాద సంస్థలకు ఆసియా ఆడియో మెసేజ్‌ల ద్వారా సమాచారాన్ని చేరవేసినట్లు తెలిపారు. మోదీ పర్యటనలో ఉన్న సమయంలో భారత్‌పై దాడి చేసేందుకు ప్రపంచం నలుమూలలా ఉన్న ఉగ్రవాదులు ఏవిధంగా ప్రణాళికలు రచించారో తమ విచారణలో వెల్లడైనట్లు పేర్కొన్నారు. ఆసియా ఆండ్రాబీ నేపథ్యం.. కశ్మీర్లో ప్రముఖ వేర్పాటు వాదిగా గుర్తింపు పొందిన 56 ఏళ్ల ఆసియా ఆండ్రాబీ 2016లో ఉగ్రవాది బుర్హాన్ వనీ మరణానికి వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించి వెలుగులోకి వచ్చారు. బుర్హాన్ ఎన్‌కౌంటర్‌ను వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమాల్ని నిర్వహించిన ఆసియా విద్యార్థులను రెచ్చగొట్టి అల్లర్లకు కారణమయ్యారు. దుఖ్తరన్-ఈ-మిలాత్ అనే సంస్థను నెలకొల్పి.. భారత్‌పై ద్వేష భావంతో రగిలిపోయే విద్యార్థినులను తన సంస్థలోకి ఆహ్వానించేవారు. కాగా ఈ సంస్థపై ప్రభుత్వం నిషేధం విధించింది. పాకిస్తాన్ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని పాక్ జెండాలు ఎగరవేసినందుకు ఆసియా పలుమార్లు అరెస్టయ్యారు. ఆమెకు ఇద్దరు కుమారులు ఉన్నారు. వారిలో ఒకరు మెల్బోర్న్లో ఎంటెక్ చేస్తుండగా, మరొకరు మలేషియా ఇస్లామిక్ యూనివర్సిటీలో ఉన్నత విద్యనభ్యసిస్తున్నారు. అయితే వీరికి కూడా ఉగ్ర సంస్థలతో సంబంధాలు ఉన్నాయా అన్న కోణంలో విచారణ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. కాగా లష్కర్-ఎ-తొయిబా చీఫ్ హఫీజ్ సయీద్‌తో సంబంధాలు కలిగి ఉందని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆసియాను శ్రీనగర్ జైలు నుంచి ఢిల్లీకి తరలించిన విషయం తెలిసిందే. పలు సామాజిక మాధ్యమాల ద్వారా ద్వేషపూరిత భావాల్ని రెచ్చగొడుతూ శాంతి భద్రతలకు, సౌభ్రాతృత్వానికి భంగం కలిగిస్తున్న కారణంగా ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. పాక్‌లోని అనేక ఉగ్ర సంస్థలతో సోషల్ మీడియాలో కాంటాక్ట్‌లో ఉన్న ఆసియా.. అఖండ పాకిస్తాన్ స్థాపన కోసం ప్రచారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. -
‘ఆమె ట్విటర్ ఫాలోవర్స్ అంతా ఉగ్రవాదులే’
సాక్షి, న్యూఢిల్లీ : లష్కర్-ఎ-తొయిబా చీఫ్ హఫీజ్ సయీద్‌తో సంబంధాలు కలిగి ఉన్న కశ్మీరి వేర్పాటు వాది ఆసియా ఆండ్రాబీ విచారణ కొనసాగుతున్నట్లు జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) వర్గాలు తెలిపాయి. ఉగ్ర కార్యకలాపాలకు సంబంధించి మరింత సమాచారం రాబట్టేందుకు గత శుక్రవారం ఆమెను శ్రీనగర్ జైలు నుంచి ఢిల్లీకి తరలించారు. పలు సామాజిక మాధ్యమాల ద్వారా ద్వేషపూరిత భావాల్ని రెచ్చగొడుతూ శాంతి భద్రతలకు, సౌభ్రాతృత్వానికి భంగం కలిగిస్తున్న కారణంగా ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. పలువురు మహిళా అధికారులతో ఆమెను విచారిస్తున్నట్లు పేర్కొన్నారు. భారత్ విషయంలో అంత కఠినంగా ప్రవర్తించడానికి దారి తీసిన పరిస్థితుల గురించి ఆమెను ప్రశ్నిస్తున్నట్లు అధికారులు తెలిపారు. సోదరిగా భావిస్తాడు గనుకే.... విచారణ భాగంగా ఆసియా చెప్పిన పలు విషయాలను ఎన్ఐఏ అధికారి వెల్లడించారు. ఎన్నో ఏళ్లుగా హఫీజ్ సయీద్‌తో సంబంధాలు కలిగి ఉన్న ఆసియా.. హఫీజ్ తనను సోదరిగా భావిస్తాడని అందుకే తనతో ఎల్లప్పుడూ ఫోన్లో కాంటాక్ట్‌లో ఉంటాడని చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు. కశ్మీర్ ప్రభుత్వం ఆసియా పట్ల చూసీ చూడనట్టు వ్యవహరించడం వల్లే ఎన్ని సార్లు గృహ నిర్భందం విధించినా ఆమె తన వైఖరిని మార్చుకోలేదన్నారు. అనేక మంది లష్కర్ ఉగ్రవాదులు ఆసియాను ట్విటర్లో ఫాలో అవుతున్నట్లు గుర్తించామన్న ఆయన.. వీరిలో చాలా మంది పాక్ ఆక్రమిత కశ్మీర్లో అల్లర్లు సృష్టిస్తోన్న వారేనని తెలిపారు. భారత దేశాన్ని, జాతీయతను వ్యతిరేకిస్తూ ఉర్దూ భాషలో అనేక ట్వీట్లు చేసిన ఆసియా.. ర్యాలీలు నిర్వహించి మరీ మహిళా విద్యార్థులను రెచ్చగొట్టేవారని పేర్కొన్నారు. పాక్‌లోని అనేక ఉగ్ర సంస్థలతో సోషల్ మీడియాలో కాంటాక్ట్‌లో ఉన్న ఆసియా.. అఖండ పాకిస్తాన్ స్థాపన కోసం ప్రచారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆసియా ఆండ్రాబీ నేపథ్యం.. కశ్మీర్లో ప్రముఖ వేర్పాటు వాదిగా గుర్తింపు పొందిన 56 ఏళ్ల ఆసియా ఆండ్రాబీ 2016లో ఉగ్రవాది బుర్హాన్ వనీ మరణానికి వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించి వెలుగులోకి వచ్చారు. బుర్హాన్ ఎన్‌కౌంటర్‌ను వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమాల్ని నిర్వహించిన ఆసియా విద్యార్థులను రెచ్చగొట్టి అల్లర్లకు కారణమయ్యారు. దుఖ్తరన్-ఈ-మిలాత్ అనే సంస్థను నెలకొల్పి.. భారత్‌పై ద్వేష భావంతో రగిలిపోయే పలువురు విద్యార్థులను తన సంస్థలోకి ఆహ్వానించేవారు. కాగా ఈ సంస్థపై ప్రభుత్వం నిషేధం విధించింది. పాకిస్తాన్ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని పాక్ జెండాలు ఎగరవేసినందుకు పలుమార్లు అరెస్టయ్యారు. ఆసియాకు ఇద్దరు కుమారులు ఉన్నారు. వారిలో ఒకరు మెల్బోర్న్లో ఎంటెక్ చేస్తుండగా, మరొకరు మలేషియా ఇస్లామిక్ యూనివర్సిటీలో ఉన్నత విద్యనభ్యసిస్తున్నారు. అయితే వీరికి కూడా ఉగ్ర సంస్థలతో సంబంధాలు ఉన్నాయా అన్న కోణంలో విచారణ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. -
వైరల్ ఫొటో.. వాళ్ల ఫేట్ రివర్సైంది!
జమ్ము: వేర్పాటువాదం తలకెక్కించుకున్న ఆ యువకులు తుపాకులు చేతబట్టి దిగిన ఆ ఫొటో.. వాళ్ల తలరాతను మార్చేసింది. జమ్ముకశ్మీర్‌లోని షోఫియాన్ జిల్లాలో ఆదివారం జరిగిన ఎన్కౌంటర్లో బుర్హాన్ వనీ గ్యాంగ్ చివరి సభ్యుడు సద్దాం పద్దేర్ కూడా హతమయ్యాడు. రెండేళ్ల కిందటి ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ కావడం.. ఆ ఫొటోలో ఉన్న 10 మందిని వేర్వేరు ఎన్కౌంటర్లలో భద్రతాబలగాలు మట్టుపెట్టాయి. అరెస్టైన ఒక్కడు మాత్రం జైలులో ఉన్నాడు. ఆదివారం నాటి ఎన్కౌంటర్లో వనీ అనుచరుడైన పద్దేర్ సహా హిజ్బుల్ ముజాహిద్దీన్‌కు చెందిన ఐదుగురు ఉగ్రవాదులను భద్రతాబలగాలు కాల్చిచంపాయి. ఎన్కౌంటర్లను నిరసిస్తూ లోయలోని పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున నిరసనలు చెలరేగాయి. ఈ క్రమంలో చోటుచేసుకున్న కాల్పుల్లో మరో ఐదుగురు సామాన్య పౌరులు ప్రాణాలు కోల్పోయారు. లోయలో వరుస ఘటనలపై జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ స్పందించారు. తుపాకులు, రాళ్లను చేతబడుతున్నది పేదలేనని, అలాంటి యువకుల ప్రాణాలు కాపాడుకోవడానికి ఏదో ఒక మధ్యంతర విధానం అవసరం ఉన్నదని ఆమె అన్నారు. ఒక్కరోజు ఉగ్రవాది: షోఫియాన్ ఎన్కౌంటర్లో చనిపోయిన రఫీభట్.. కశ్మీర్ విశ్వవిద్యాలయంలోని సోషియాలజీ విభాగంలో సహాయ అధ్యాపకుడిగా పనిచేసేవాడు. శుక్రవారమే హిజ్బుల్ ముజాహిదీన్‌లో చేరిన అతను.. ఆదివారానికి ప్రాణాలు కోల్పోయాడు. ఆదివారం ఉదయమే భట్ తన తండ్రికి ఫోన్ చేసి, ‘మిమ్మల్ని బాధపెట్టి ఉంటే క్షమించండి. నేను అల్లా వద్దకు వెళ్తున్నందున ఇదే నా చివరి ఫోన్ కాల్’ అని చెప్పాడు. (చదవండి: ఐదుగురు ఉగ్రవాదుల ఎన్కౌంటర్) -
భారత ఉగ్రవాది.. పాక్ అమర వీరుడా?
న్యూఢిల్లీ: ఉగ్రవాది హిజ్బుల్ ముజాహిద్దిన్ కమాండర్ బుర్హాన్ వనీ ని పాక్ కీర్తించడం పట్ల భారత్ తీవ్రంగా మండిపడింది. పాక్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుందనడానికి ఇదే నిదర్శమని ప్రపంచానికి సూచించింది. ఓ టెర్రరిస్టును అమరవీరుడుగా పాక్ కీర్తించడం ఏమిటని ప్రశ్నించింది. భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి గోపాల్ బాగ్లే పాకిస్థాన్ ఆర్మీ, ఉగ్రవాది బుర్హాన్ వనీకి నివాళులు అర్పించడం, పాక్ ఉగ్రవాదులను పోశిస్తుందనడానికి నిదర్శనమని ట్వీట్ చేశారు. ఇక బాగ్లే ట్వీట్ చేసిన ముందు రోజు పాక్ ఆర్మీ, ప్రధాని నవాజ్ షరీఫ్‌లు గతేడాది భారత సైనిక కాల్పుల్లో మరణించిన బుర్హాన్ వనీకి నివాళులు అర్పిస్తూ కశ్మిరి స్వాతంత్ర్య సమరమోదుడుగా కీర్తించారు. దీనిపై భారత్ తీవ్రంగా మండిపడింది. ఇక వనీ కశ్మీర్‌పై జరిపిన దాడుల్లో ప్రధాన నిందితుడు. -
బుర్హాన్ వనీ వారసుడు కూడా..!
-
బుర్హాన్ వనీ వారసుడు కూడా..!
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో అలజడి రేపుతున్న వేర్పాటువాద మిలిటెంట్ సంస్థ హిజ్బుల్ ముజాహిద్దీన్‌కు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. హిబ్బుల్ కమాండర్ బుర్హాన్ వనీ స్థానంలో అతని వారసుడిగా పగ్గాలు చేపట్టిన మరో ఉగ్రవాది సబ్జార్ అహ్మద్ కూడా భద్రతా దళాల ఎన్కౌంటర్లో మృతిచెందాడు. శనివారం జమ్మూకశ్మీర్‌లో జరిగిన రెండు వేర్వేరు ఎన్కౌంటర్లలో ఎనిమిది మంది ఉగ్రవాదులు మరణించారు. ఇందులో సబ్జార్ కూడా ఉన్నాడని భద్రతా దళాలు తెలిపాయి. పుల్వామా జిల్లాలోని ట్రాల్ సెక్టార్లో నక్కిన ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా దళాలు ఏరివేయగా.. బారాముల్లా జిల్లాలోని రాంపూర్ సెక్టార్లో ఎల్వోసీ మీదుగా చొరబాటుకు ప్రయత్నించిన ఆరుగురు టెర్రరిస్టులను ఆర్మీ మట్టుబెట్టింది. ట్రాల్‌లోని ఓ ఇంటిలో అబు జరార్ అలియాస్ సబ్జార్ అహ్మద్, ఓ పాకిస్థానీ ఉగ్రవాదితో కలిసి నక్కి ఉండగా.. భద్రతా దళాలు ఆ ఇంటిని చుట్టుమట్టాయి. ఈ సందర్బంగా జరిగిన ఎదురుకాల్పుల్లో ఈ ఇద్దరూ ప్రాణాలు విడిచాడు. హిజ్బుల్ కమాండర్ బుర్హాన్ వనీ ఎన్కౌంటర్లో మృతిచెందడంతో కశ్మీర్లో ఘర్షణలు చెలరేగిన సంగతి తెలిసిందే. ఇక, ఉడీకి సమీపంలో ఉన్న రాంపూర్‌లో తెల్లవారుజామున ఎల్వోసీ మీదుగా అనుమానాస్పద కదలికలు ఉండటంతో వెంటనే అలర్ట్ అయిన సైన్యం ఈ భారీ ఆపరేషన్‌ను చేపట్టింది. ఈ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకొని చొరబాటు ప్రయత్నాన్ని భగ్నం చేసింది. ఉడీ సెక్టార్లో శుక్రవారం జరిగిన చొరబాటు యత్నాన్ని సైన్యం సమర్థంగా తిప్పికొట్టిన సంగతి తెలిసిందే. పాక్ బార్డర్ యాక్షన్ టీమ్ (బ్యాట్)కు చెందిన ఇద్దరు చొరబాటుదారులు ఉడీ సెక్టార్‌లోకి వచ్చేందుకు ప్రయత్నించగా.. వారిని సైన్యం ఏరిపారేసింది. -
ఉగ్రవాద రిక్రూట్మెంట్ పెరిగింది!
న్యూఢిల్లీ: హిజ్బుల్ ముజాహిద్దీన్ లీడర్ బుర్హాన్ వాని ఎన్కౌంటర్ తరువాత కశ్మీర్లో ఉగ్రవాదం వైపు మళ్లిన యువత సంఖ్య పెరిగింది. 2016 జులై 8న బుర్హాన్ వాని ఎన్కౌంటర్ అనంతరం కశ్మీర్‌లోయలో సెప్టెంబర్ వరకు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో యువత ఉగ్రవాదంవైపు అడుగులేసినట్లు ప్రభుత్వం లోక్‌సభలో వెల్లడించిన వివరాల ఆధారంగా తేటతెల్లమవుతోంది. 2016లో 88 మంది యువత ఉగ్రవాదుల్లో చేరినట్లు మంగళవారం లోక్‌సభలో ప్రభుత్వం వెల్లడించింది. జిహాదీలుగా మారిన యువత సంఖ్య 2010 సంవత్సరం నుంచి ఇదే ఎక్కువ కావడం గమనార్హం. హోం శాఖ సహాయ మంత్రి హన్స్‌రాజ్ గంగారాం అహిర్ వెల్లడించిన వివరాల ప్రకారం జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదం వైపు మళ్లిన యువత సంఖ్య 2015లో 66 ఉండగా, 2014లో 53, 2013లో 16, 2012లో 21, 2011లో 23, 2010లో 54గా ఉంది. యువత ఉగ్రవాదం వైపు వెళ్లకుండా జమ్మూకశ్మీర్ ప్రభుత్వం చర్యలు చేపడుతుందని అహిర్ తెలిపారు. -
ఇద్దరం కలిసి ఇండియా భరతం పడదాం..
-
ఇద్దరం కలిసి ఇండియా భరతం పడదాం..
- సంచలన ఆడియో టేప్ లో బుర్హాన్-హఫీజ్ ఎవరినైతే అమరుడంటూ దాయాది దేశం అంతర్జాతీయ వేదికలపై పొడిగిందో, ఎవరి ఎన్ కౌంటర్ తర్వాత కశ్మీర్ లోయలో, ఆ తర్వాత సరిహద్దు అంతటా పరిస్థితులు పూర్తిగా మారిపోయాయో, ఎవరి చావు మరో 100 మంది చావులకు, 4000 మంది గాయాలకు కారణమైందో ఆ హిజ్బుల్ ముజాహిద్దీన్ కమాండర్ బుర్హాన్ వనీకి సంబంధించిన సంచలన విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. జులై 8న ఎన్ కౌంటర్ కావడానికి కొద్ది గంటల ముందు బుర్హాన్.. లష్కరే తాయిబా చీఫ్ హఫీజ్ సయీద్ తో ఫోన్లో మాట్లాడాడు. 'ఇప్పటికే ఇండియన్ ఆర్మీపై పై చేయి సాధించాం. ఇక ముందు కూడా మన ఆధిపత్యాన్ని కొనసాగించాలి. అందుకోసం మీ ఆశీర్వాదాలు, ఆయుధాలు కావాలి. ఇక్కడున్న మీవాళ్ల సహకారం కూడా కావాలి..' అంటూ వనీ.. హఫీజ్ సయీద్ తో ఫోన్ లో మాట్లాడిన ఆడియో టేప్ ను ఓ జాతీయ వార్త సంస్థ బహిర్గతం చేసింది. ఇండియన్ ఇంటెలిజెన్స్ అధికారుల ఈ టేపులు నిజమైనవేనని ధృవీకరించినట్లుగా ఆ సంస్థ పేర్కొంది. ఆ సంవాదం ఇలా సాగింది.. ఫోన్ చేసిన వ్యక్తి: అస్సలామాలేకుం బుర్హాన్.. పీర్ సాహిబ్(హఫీజ్)తో మాట్లాడండి.. హఫీజ్: సలామ్ వాలెకుం.. బుర్హాన్: సలామ్ వాలెకుం.. ఎలా ఉన్నారు? హఫీజ్: ఆ.. బాగున్నా. ఎవరు? బుర్హానేనా? బుర్హాన్: అవును. నేను బుర్హాన్ నే. మీరు బాగున్నారుకదా! హఫీజ్: అంతా దేవుడి దయ. ఆ కృపామయుడే మనల్ని అన్ని విధాలా ఆశీర్వదిస్తున్నాడు. అతనికే మహిమ. బుర్హాన్: మీతో మాట్లాడాలాని ఆశగా ఎదురు చూస్తున్నా. ఇన్నాళ్టికి మాట్లాడగలుగుతున్నా. మీ ఆరోగ్యం ఎలా ఉంది? హఫీజ్: దేవుడి దయతో అంతా బాగుంది. అక్కడ(ఇండియాలో) మీరు చాలా కఠినమైన పరిస్థితుల్లో పనిచేస్తున్నారు. కానీ కలత వద్దు. మీకు ఎలాంటి సహాయం కావాలో చెప్పండి.. అందించడానికి సిద్ధంగా ఉన్నాం. శత్రువుతో పోరాటంలో మీరు విజయం సాధించాలని భగవంతుణ్ని ప్రార్థిస్తున్నాం. చెప్పండి ఏంకావాలో.. బుర్హాన్: ఇన్షా అల్లాహ్.. మీ లాంటి పెద్దల సహకారం ఉంటే ఏదైనా చెయ్యగలం. దేవుడు నా ప్రార్థనని అంగీకరించి, ఆశీర్వాదాలు కురిపించాడు గనుకే మీతో మాట్లాడగలుగుతున్నా. హఫీజ్: అయ్యయ్యో.. ఎంతమాట! నువ్వు మాకు చాలా కావాల్సినవాడివి. నీకు సంబంధించిన ప్రతి సమాచారం మాకు అందుతూనేఉంది. అక్కడ(కశ్మీర్)లో చాలా గొప్పగా పనిచేస్తున్నావ్.. చాలా సంతోషం. బుర్హాన్: నాదో చిన్న విన్నపం.. కశ్మీర్ లోని మీవాళ్లు(లష్కరే సభ్యులు) స్తబ్ధుగా ఉన్నారు. మీ నుంచి సహకారం అందుకోవడంలో ఇబ్బందులు పడుతున్నారని తెలిసింది. ఇలా ఎందుకు జరుగుతుందో అర్థం కావడంలేదు. ఒకవేళ వాళ్ల నెట్ వర్క్ బలహీనంగా ఉంటే నేను సహకరించగలను. నాకు చాలా సంబంధాలున్నాయి. హఫీజ్: మంచిది. నువ్వు చెప్పినదాని గురించి చర్చిస్తాం. దేవుడు నీకు సహాయం చేయాలని ప్రార్థిస్తాం. బుర్హాన్: ఇంకో విషయం చెప్పాలి.. ఇక్కడి శత్రువు(ఇండియన్ ఆర్మీ) మీద మనం దాదాపు పట్టు సాధించాం. మరిన్ని దాడులు చేసి మన ఆధిపత్యాన్ని కొనసాగించాలి. ఇందుకోసం మీ నుంచి ఆయుధ సహకారం కావాలి. మనం(హిజ్బుల్, లష్కరే) కలిసి పనిచేస్తే బాగుంటుంది. ఇదే విషయాన్ని శ్రీనగర్ లో ఉన్న దుజానా(కశ్మీర్ లో లష్కర్ కమాండర్)తో కూడా మాట్లాడాను. మీరు సహకరిస్తే ఇండియన్ ఆర్మీని ఇక్కడి(కశ్మీర్) నుంచి పూర్తిగా వెళ్లగొట్టగలం.. హఫీజ్: ఇన్షా అల్లాహ్. మన సహోదరీ సహోదరులకు శుభాకాంక్షలు తెలియజేయి. నేను అందరి గురించీ ప్రార్థిస్తున్నానని చెప్పు. బుర్హాన్: కృతజ్ఞతలు. లష్కర్ కు అవసరమైన ఎలాంటి సాయం చేయడానికైనా నేను సిద్ధంగా ఉన్నా. వాళ్లు(లష్కర్లు) నా సహోదరులు. మా లక్ష్యం, శత్రువు కూడా ఒక్కటే. హఫీజ్: మంచింది. ఇన్షాఅల్లాహ్.. బుర్హాన్: ఇక్కడి లష్కర్ వాళ్లు 'హఫీజ్ సాబ్ తో ఎప్పుడూ మాట్లాడలేద'ని చెబుతుంటారు. హఫీజ్: వాళ్లు చెప్పింది నిజమే. నీ మెసేజ్ చూసిన తర్వాత నీతో మాట్లాడాలనుకున్నా. మా వాళ్లతో టచ్ లో ఉండు. నీ గురించి వాళ్లకు ఇప్పటికే చెప్పాం. బుర్హాన్: మీరు చెప్పనట్లే వాళ్లతో టచ్ లో ఉంటా. అవసరమైనమేరకు సాయం చేస్తా. హఫీజ్: సరే, ఉంటామరి. బుర్హాన్: ఉంటామరి. -
సీఎంకు వ్యతిరేకంగా వేరే రాష్ట్ర మంత్రి వీరంగం!
న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆప్ మంత్రి వీరంగం సృష్టించారు. జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తితో వేదిక పంచుకోవడానికి ఢిల్లీ పర్యాటకశాఖ మంత్రి కపిల్ మిశ్రా నిరాకరించారు. బుర్హాన్ వనీ, ఆఫ్జల్ గురు మీరు ఎలా భావిస్తారు? అంటూ ఆయన ముఫ్తిని ప్రశ్నించారు. దీంతో సీఎం ముఫ్తి వెంట ఉన్న అధికార యంత్రాంగం తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. పర్యాటక రంగంపై నిర్వహించిన సదస్సు గందరగోళంగా మారింది. సదస్సులో మిశ్రా మాట్లాడుతూ హిజ్జుబుల్ ముజాహిద్దీన్ కమాండర్ బుర్హాన్ వనీ ఎన్కౌంటర్ పొరపాటు అని, అలా జరిగి ఉండాల్సింది కాదని ముఫ్తి పేర్కొన్నారని విమర్శించారు. పార్లమెంటుపై దాడి నిందితుడు ఆఫ్జల్ గురు, బుర్హాన్ వనీ ఉగ్రవాదులు ఔనా? కాదా? అన్నది ఆమె తెలుపాలని మిశ్రా డిమాండ్ చేశారు. ముఫ్తితో తాను వేదిక పంచుకోలేనంటూ ఆయన మధ్యలోనే సదస్సు నుంచి వెళ్లిపోయారు. ముఫ్తిని విమర్శిస్తూ ఆయన ప్రసంగిస్తుండగా కొందరు ప్రేక్షకులు, ముఫ్తి వెంట ఉన్న అధికారులు గట్టిగా నిరసన తెలుపుతూ ఆయన ప్రసంగాన్ని అడ్డుకున్నారు. టూరిజం, టెర్రరిజం కలిసి సాగలేవంటూ ఆప్ మంత్రి పేర్కొనగా.. ఆయన వ్యాఖ్యలతో సీఎం ముఫ్తి విస్తుపోయారు. మహిళలపై అత్యాచారాల విషయంలో ఢిల్లీ కన్నా జమ్ముకశ్మీర్ మెరుగ్గా ఉందని ఆప్ మంత్రి ఆరోపణల్ని ఆమె తిప్పికొట్టారు. ఈ సందర్భంగా ఆమె కంటతడి పెట్టారు. -
ఉగ్రవాద సంస్థను వెనకేసుకురావడమేంటి..
న్యూయార్క్: హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాది బుర్హాన్ వాని అమర వీరుడని పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ కొనియాడడాన్ని తప్పుపట్టే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. సెప్టెంబర్ 21న జరిగిన ఐక్యరాజ్యసమితి సాధారణ సభా సమావేశాల్లో బుర్హాన్ వానిని షరీఫ్ కీర్తించడాన్ని అమెరికా చట్టసభ సభ్యులు టెడ్ పోయ్ మండిపడ్డారు. హింసను ప్రేరేపించడమే లక్ష్యంగా చేసుకున్న ఓ ఉగ్రవాద సంస్థను పాక్ ప్రధాని వెనకేసుకురావడానికి ఐక్యరాజ్యసమితిని వేదికగా చేసుకోవడం నిరాశ కలిగించిందని టెడ్ పోయ్ ట్విట్టర్లో పేర్కొన్నారు. మరోవైపు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న దేశంగా పాకిస్థాన్ ను పరిగణించాలా? అంటూ వైట్ హౌస్ అధికారిక వెబ్ సైట్ లో ఉంచిన ఆన్ లైన్ పిటిషన్ కు అనూహ్య స్పందన లభిస్తోంది. నెల రోజుల్లో లక్ష మంది అభిప్రాయాలను సేకరించాలన్న టార్గెట్ తో వైట్ హౌస్ సెప్టెంబర్ 21న సదరు పిటిషన్ ను వెబ్ సైట్ లో పెట్టగా..కేవలం ఏడురోజుల్లోనే (బుదవారం రాత్రి వరకు) 2 లక్షల 65 వేలమందికి పైగా నెటిజన్లు తమ మద్దతును ప్రకటించడంతో వైట్ హౌస్ వెబ్సైట్లో మోస్ట్ పాపులర్ ఆక్టివ్ పిటిషన్‌గా నిలిచింది. ఉరీ ఆర్మీ క్యాంపుపై ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్ ను టెర్రరిస్ట్ దేశంగా ప్రకటించాలని అమెరికా చట్టసభకు చెందిన ఇద్దరు సభ్యులు రిపబ్లికన్ పార్టీకి చెందిన టెడ్ పోయ్, డెమొక్రెటిక్ పార్టీకి చెందిన డానా రోహ్రబచెర్ పాకిస్థాన్ కు వ్యతిరేకంగా స్టేట్ స్పాన్సర్ ఆఫ్ టెర్రరిజం బిల్లును ప్రతినిధుల సభలో ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. ఉగ్రవాదంపై వేసిన కాంగ్రెస్ కమిటీలో వీరిద్దరూ కీలక సభ్యులు. ఈ ప్రజాభిప్రాయ సేకరణలో అమెరికా, భారత్ తో పాటు అనేక దేశాల ప్రజలు కూడా పాల్గొంటున్నారు. అక్టోబర్ 21 వరకూ ఈ ప్రజాభిప్రాయాలను సేకరిస్తారు. గతంలో కూడా అనేక అంశాలపై వైట్ హౌస్ ప్రజాభిప్రాయాలను సేకరించడం సంప్రదాయంగా వస్తోంది. Disappointed to see the Pakistan PM use the @UN to praise a militant group that uses violence to promote its cause. https://t.co/FDsWOY7fhB — Ted Poe (@JudgeTedPoe) September 28, 2016 -
క్రికెటర్ కావాలనుకుని.. ఉగ్రవాదయ్యాడు
తెలివితేటలు ఉన్న కుర్రాడు సమున్నత లక్ష్యాన్ని వదిలి దారితప్పితే ఎలాంటి దుష్పరిణామాలు ఎదురవుతాయో.. ఎన్కౌంటర్లో హతమైన హిజ్బుల్ ముజాహిద్దీన్ కమాండర్ బుర్హన్ వనీ ఉదంతమే నిదర్శనం. రెండుపదుల వయసులోనే కరుడుగట్టిన ఉగ్రవాదిగా మారిన వనీ.. ఇలా మారుతాడని చిన్నతనంలో ఊహించలేదు. 10 ఏళ్ల వయసులో అతను కన్న కలలు వేరు. సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలన్నది వనీ ఆశయమని అతని తండ్రి ముజఫర్ వనీ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. అలాగే కశ్మీర్ క్రికెటర్ పర్వేజ్ రసూల్ మాదిరి క్రికెటర్ కావాలని, దేశానికి ప్రాతినిధ్యం వహించాలని కోరుకునేవాడని తెలిపాడు. ముజఫర్ వనీ ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపల్. పిల్లలు బాగా చదువుకుని కశ్మీర్ అడ్మినిస్ట్రేటీవ్ సర్వీస్, ఐఏఎస్ వంటి ఉన్నతాధికారులు కావాలని ఆయన చెబుతుంటారు. తండ్రి మాటలకు ప్రేరణతో బుర్హన్ కూడా బాగా చదువుకుని ఉన్నతస్థాయికి ఎదగాలని కోరుకున్నాడు. అయితే వక్రదారి పట్టడంతో అతని లక్ష్యం నెరవేరలేదు. ఉగ్రవాద భావజాలంతో అతని జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. కశ్మీర్ కల్లోలానికి కారణమయ్యాడు. భద్రత దళాల ఎన్కౌంటర్లో వనీ మరణించాక జరిగిన అల్లర్లలో దాదాపు 80 మరణించగా, రెండున్నర నెలల పాటు కశ్మీర్లో కర్ఫ్యూ వాతావారణం నెలకొంది. పరిస్థితులు ఇప్పుడిప్పుడే సద్ధుమణుగుతున్నాయి. 2010 అక్టోబర్ 5న బుర్హన్ ఇల్లు వదిలి వెళ్లిపోయాడని ముజఫర్ చెప్పాడు. స్నేహితులను కలిసేందుకు వెళుతున్నానని తన తల్లికి చెప్పి వెళ్లాడని, ఆ తర్వాత తిరిగిరాలేదని తెలిపాడు. ఉగ్రవాదుల్లో చేరాడని ఆ తర్వాత తెలిసిందని చెప్పాడు. ఎన్కౌంటర్లో చనిపోయే రెండు నెలల ముందు అతన్ని మార్చేందుకు ప్రయత్నించానని తెలిపాడు. గత ఐదేళ్లలో తాను బుర్హన్ను రెండు లేదా మూడు సార్లు కలిశానని, అది కూడా రెండు మూడు నిమిషాలకు మించి మాట్లాడలేదని చెప్పాడు. రెండున్నరేళ్ల క్రితం చివరిసారి కలిశానని, బుర్హన్ సొంత పంథాలో సాగాడని, తాను కుటుంబం కోసం ప్రభుత్వం ఉద్యోగం చేస్తున్నానన్నాడు. బుర్హన్కు ముందు తన మరో కుమారుడు ఖలీద్ గతేడాది ఏప్రిల్‌లో భద్రత దళాల కాల్పుల్లో మరణించాడని తెలిపాడు. తన మూడో కొడుకు నవీద్ అన్నల బాటలో నడవకుండా చదువుకోవాలని భావిస్తున్నాడని, తన కూతురు టీచర్ కావాలని కోరుకుంటున్నట్టు చెప్పాడు. బుర్హన్ ఎన్కౌంటర్ తర్వాత కశ్మీర్లో ఈ స్థాయిలో హింస జరుగుతుందని ఊహించలేదని ముజఫర్ చెప్పాడు. రెండు నెలలుగా ఎంతో నష్టపోయామని, మార్పు రావాలని కోరుకుంటున్నామని అన్నాడు. తాను ఇద్దరు కుమారులను కోల్పోయానని, ఎన్నో కుటుంబాలు సొంతవారిని పోగొట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. భారత్, పాకిస్థాన్‌ల మధ్య సమస్యల పరిష్కారానికి చర్చలే ఉత్తమమని అభిప్రాయపడ్డాడు. కశ్మీర్ సమస్యను పరిష్కరించడం తప్పనిసరని, లేకుంటే దాడులు జరగవచ్చని చెప్పాడు. -
'నాకు ఒక్క చాన్స్ ఇవ్వండి.. ప్లీజ్'
'వీధుల్లోకి వచ్చి ఆందోళన చేస్తున్న అందరికీ నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా. మీరు నాపట్ల ఆగ్రహంగా ఉండొచ్చు. మీ పట్ల నాకు కోపం ఉండొచ్చు. కానీ దయచేసి నాకొక అవకాశాన్ని ఇవ్వండి'.. ఇది జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తి ఆందోళనకారులకు చేసిన విజ్ఞప్తి. గత 49 రోజులుగా కశ్మీర్లో అశాంతి కొనసాగుతున్న నేపథ్యంలో ఆమె శనివారం ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిశారు. ప్రధాని నివాసమైన 7రేస్‌కోర్సు రోడ్డు రెసిడెన్సీలో జరిగిన వీరి భేటీలో కశ్మీర్లో సాధారణ పరిస్థితులు పునరుద్ధరించడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించినట్టు తెలిసింది. ప్రధానితో భేటీ అనంతరం సీఎం మెహబూబా మీడియాతో మాట్లాడారు. కశ్మీర్లో హింసకు చరమగీతం పాడాలని ప్రధాని మోదీ కోరుకుంటున్నారని ఆమె తెలిపారు. 'మనందరిలాగే ప్రధాని మోదీ కూడా జమ్ముకశ్మీర్‌లోని పరిస్థితిపై తీవ్ర ఆందోళనతో ఉన్నారు' అని తెలిపారు. లోక్‌సభలో మోదీకి మూడింట రెండొంతుల సంఖ్యాబలం ఉందని, ఆయన వల్ల కశ్మీర్ సమస్యకు పరిష్కారం లభించకుంటే, మరెవరి వల్ల ఈ సమస్యకు పరిష్కారం లభించబోదని దివంగత సీఎం, తన తండ్రి ముఫ్తి మహమ్మద్ సయ్యద్ ఎప్పుడూ చెప్పేవారని ఆమె గుర్తుచేశారు. కశ్మీర్‌లోయలో హింసకు పాకిస్థానే కారణమని ఆమె ధ్వజమెత్తారు. 'కశ్మీర్ యువత పట్ల పాకిస్థాన్‌కు ఏమాత్రం కనికరమున్నా.. సెక్యూరిటీ క్యాంప్స్, పోలీసు స్టేషన్లపై దాడిచేసేలా వారిని రెచ్చగొట్టడం మానుకోవాలి' అని ఆమె సూచించారు. ప్రధాని మోదీ, హోంమంత్రి రాజ్‌నాథ్ ఇప్పటికే పాకిస్థాన్ సందర్శించారని, కానీ పాక్ నేతలు ఎందుకు ప్రతిస్పందించడం లేదని ఆమె నిలదీశారు. కశ్మీర్ వేర్పాటువాద నేతలు కూడా లోయలో శాంతి నెలకొనేందుకు సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. జూలై 8న భద్రతా దళాల ఎన్కౌంటర్లో హిజ్బుల్ ముజాహిద్దీన్ కమాండర్ బుర్హాన్ వనీ చనిపోవడంతో కశ్మీర్లో అల్లర్లు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. -
'అతడు చాలా ప్రమాదకారి'
న్యూఢిల్లీ: ఎన్కౌంటర్ లో హతమైన హిజబుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాద సంస్థ కమాండర్ బుర్హాన్ వాని చాలా ప్రమాదకరమైన వ్యక్తి తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరెక్ ఓబ్రీన్ అన్నారు. బుర్హాన్ వాని మృతి తర్వాత జమ్మూకశ్మీర్ తలెత్తిన హింసాత్మక ఘటనలపై రాజ్యసభలో బుధవారం చర్చించారు. ఈ సందర్భంగా డెరెక్ ఓబ్రీన్ మాట్లాడుతూ... 'బుర్హాన్ వాని వీధుల్లో కంటే ఇంటర్నెట్ లో చాలా ప్రమాదకరం. అతడు బతికివుండగా కంటే చనిపోయాక ఇంకా ఎక్కువ ముప్పుగా మారాడు. కశ్మీర్ లో హింసాత్మక పరిస్థితులు నెలకొన్న ప్రస్తుత సమయంలో ఇప్పుడు ఆచితూచి వ్యవహరించాల'ని అన్నారు. సైన్యాన్ని వినియోగించకుండా కశ్మీర్ ప్రజల హృదయాలు గెలుచుకోవాలని జేడీ(యూ) నాయకుడు శరద్ యాదవ్ సూచించారు. పెల్లెట్ తుపాకులు ప్రయోగించడం తక్షణమే మానుకోవాలని డిమాండ్ చేశారు. -
బుర్హాన్ ఉగ్రవాది కాదు.. దైవభక్తుడు!
శ్రీనగర్: ఎన్ కౌంటర్ లో మరణించిన హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాది బుర్హాన్ వనిని అమరవీరుడంటూ పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ కీర్తించడంపై భారత్ భగ్గుమంది. ఇప్పుడు జమ్ముకశ్మీర్ అధికార పార్టీ ఎమ్మెల్యే కూడా అలాంటి వ్యాఖ్యలే చేశారు . గడిచిన 31 రోజులుగా కశ్మీర్ లో కొనసాగుతున్న ఆందోళనలకు ఆజ్యంపోసేలా.. 'వని ఉగ్రవాది కాదు, గొప్ప దైవభక్తుడు' అని పీడీపీ ఎమ్మెల్యే ముస్తాక్ అహ్మద్ షా అన్నారు. బుర్హాన్ సొంత ఊరు త్రాల్ నుంచి ప్రాతినిథ్యం వహిస్తోన్న అహ్మద్ షా.. వని గురించి తనకు అంతా తెలుసని, కశ్మీర్ లో కొనసాగుతున్న కఠినహింస, వేధింపులకు ఫలితంగా పుట్టిన ఉద్యమశక్తి బుర్హాన్ అని, అందుకే జనం అతణ్ని విపరీతంగా ప్రేమించి, గౌరవించారని పేర్కొన్నారు. 'పాలకులు కశ్మీర్ సమస్యను గాలికొదిలేసిన సందర్భంలో బుర్హాన్ వని తన మరణంతో మళ్లీ దానికి జీవం పోశాడు. దశాబ్ధాల తరబడి పోరాడుతున్న వేర్పాటువాదులకు వని తన మరణంతో కొత్త మార్గం చూపించాడు' అని అహ్మద్ షా వనీని కీర్తించారు. సోమవారం కశ్మీర్ లో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన షా.. జూన్ 8 నుంచి తాను సొంత నియోజకవర్గం త్రాల్ కు వెళ్లలేకపోయానని, ఉద్రిక్త పరిస్థితులు, కర్ఫ్యూనే అందుకు కారణమని చెప్పారు. నేషనల్ కాన్ఫరెన్స్ హయాంలో యువకులను దారుణంగా అణిచివేశారని, దానికి వ్యతిరేకంగా పుట్టుకొచ్చిన ఉప్పెనే వని అని అన్నారు. ఓవైపు కశ్మీర్ లో సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు ముఖ్యమంత్రి మొహబూబా ముఫ్తీ కేంద్రంతో చర్చలు జరుపుతున్న తరుణంలోనే ఆమె పార్టీకే చెందిన ఎమ్మెల్యే షా.. ఉగ్రవాదిని వెనకేసుకు రావడంతో అతనిపై చర్యలు తప్పవని పరిశీలకు భావిస్తున్నారు. బుర్హాన్ వని ఎన్ కౌంటర్ అనంతరం కశ్మీర్ లోయలో చెలరేగిన ఆందోళనల్లో ఇప్పటివరకు 60 మంది చనిపోగా, 3000 మందికి గాయాలయ్యాయి. గడిచిన 31 రోజులుగా అక్కడి 10 జిల్లాల్లో కర్ఫ్యూ కొనసాగుతోంది. దీంతో జనజీవనం స్తంభించిపోయింది. ఉపశమన చర్యలకు ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నప్పటికీ సానుకూల ఫలితాలు రాలేదు. ఇటు పార్లమెంట్ లోనూ కశ్మీర్ అంశం వేడిపుట్టిస్తోంది. 31 రోజుల కర్ఫ్యూ, ఆందోళనలపై చర్చ జరపాలంటూ రాజ్యసభలో విపక్ష కాంగ్రెస్ పార్టీ పట్టుబడుతోంది. అయితే చర్చ జరపాలా? వద్దా? అన్నదానిపై కేంద్రం ఇంకా నిర్ణయానికి రాలేదు. -
కశ్మీర్ అల్లర్లలో 54కి చేరిన మృతుల సంఖ్య
-
కశ్మీర్ అల్లర్లలో 54కి చేరిన మృతుల సంఖ్య
శ్రీనగర్: జమ్ముకశ్మీర్ లోని బుద్గామ్ జిల్లాలో మళ్లీ నిరసన సెగ ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు భద్రతా బలగాలు ఆందోళనకారులపై జరిపిన కాల్పుల్లో ముగ్గురు వ్యక్తులు మృతిచెందగా, వంద మందికి పైగా నిరసనకారులకు గాయాలయ్యాయి. మృతులలో ఛదూర ప్రాంతానికి చెందిన 45 ఏళ్ల మహ్మద్ ఇక్బాల్, ఖాన్ సాహిబ్ ప్రాంతానికి చెందిన జహూర్ అహ్మద్, మరో వ్యక్తి మృతిచెందాడని అధికారులు తెలిపారు. గత నాలుగు వారాలుగా ఆందోళనకారులు చెలరేగిపోతుంటే సెక్యూరిటీ సిబ్బంది జరిపిన కాల్పుల్లో ఇప్పటివరకూ 54 మంది మృతిచెందగా, దాదాపు 3 వేల మంది గాయపడ్డారు. వాటెండ్ టెర్రరిస్టు, హిజ్బుల్ ముజాహిద్దీన్ కమాండర్ బుర్హాన్ వని ఎన్కౌంటర్ నేపథ్యంలో ఇక్కడ అల్లర్లు మొదలవడంతో కర్ఫ్యూ విధించిన విషయం తెలిసిందే. -
ఆ ఎన్కౌంటర్ యాక్సిడెంటలా?
శ్రీనగర్: వాటెండ్ టెర్రరిస్టు, హిజ్బుల్ ముజాహిద్దీన్ కమాండర్ బుర్హాన్ వని ఎన్కౌంటర్ జమ్మూకశ్మీర్‌లోని పీడీపీ-బీజేపీ ప్రభుత్వాన్ని ఇంకా వెంటాడుతూనే ఉంది. బుర్హాన్ వని ఎన్‌కౌంటర్‌పై తాజాగా డిప్యూటీ సీఎం, బీజేపీ సీనియర్ నేత నిర్మల్ సింగ్ కూడా స్పందించారు. ఈ ఎన్కౌంటర్ యాక్సిడెంట్ (యాదృచ్ఛికం) మాత్రమేనని ఆయన పేర్కొన్నారు. ఈ ఘటన గురించి ముందే సమాచారం అంది ఉంటే తాము ముందుజాగ్రత్త చర్యలు తీసుకొని ఉండేవాళ్లమని ఆయన పేర్కొన్నారు. సీఎం మెహబూబా ముఫ్తి గతంలో ఇదే తరహా అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అనంతనాగ్ జిల్లాలోని బాందూరా గ్రామంలో భద్రతా దళాలు ఆపరేషన్ చేపట్టిన ఇంట్లో బుర్హాన్ వని ఉన్నాడని తమకు ముందుగానే తెలిసి ఉంటే, అతనికి భద్రతా దళాలు ఒక అవకాశం (లొంగిపోయేందుకు?) ఇచ్చి ఉండేవని ఆమె పేర్కొన్నారు. ఆమె వ్యాఖ్యలతో గతంలో బీజేపీ విభేదించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం నిర్మల్ సింగ్ వ్యాఖ్యలు వివాదం రేపాయి. దీంతో స్పందించిన ఆయన యూటర్న్ తీసుకున్నారు. తన వ్యాఖ్యలను వక్రీకరించారని పేర్కొన్నారు. బుర్హాన్ వని ఎన్కౌంటర్ తర్వాత కశ్మీర్ లోయలో అల్లర్లు చెలరేగి.. 40మందికిపైగా చనిపోయిన సంగతి తెలిసిందే. -
ప్రజలూ మీ దృష్టిలో మిలిటెంట్లేనా?
న్యూఢిల్లీ: అశాంతితో అట్టుడుకుతున్న కశ్మీర్ అంశం రాజ్యసభను కుదిపేసింది. ఈ అంశంపై రాజ్యసభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ నాయకుడు గులాం నబీ ఆజాద్ మాట్లాడుతూ కశ్మీరీ ప్రజల విశ్వాసాన్ని గెలుచుకోవడంలో పీడీపీ-బీజేపీ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ‘పౌరులనూ మిలిటెంట్ల మాదిరిగా చూస్తారా’ అంటూ ఆయన ప్రశ్నించారు. ‘పౌరులను మిలిటెంట్ల మాదిరిగా చూస్తూ.. వారికి మరో ప్రత్యామ్నాయం లేకుండా చేయకండి. వ్యాలీలోని ప్రజల పట్ల అనుచితమైన బలప్రయోగాన్ని చూపకండి’ అంటూ ఆయన ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. చిన్నారులు, వృద్ధులు, మహిళల పట్ల కూడా జవాన్లు తూటాలు, పెల్లెట్లు ఉపయోగిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జమ్ముకశ్మీర్‌కు చెందిన ఆజాద్ తాను ఎంతో బాధాతప్తుడినై ఈ సభ ముందు ఉన్నానని చెప్పారు. ‘మిలిటెన్సీని అంతం చేయడంలో మేం ప్రభుత్వానికి అండగా ఉంటాం. కానీ పౌరుల పట్ల ఇలా ప్రవర్తించడాన్ని మాత్రం సమర్థించం’ అని ఆయన పేర్కొన్నారు. మిలిటెంట్ బుర్హన్ వనీ ఎన్కౌంటర్ తర్వాత కశ్మీర్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. కశ్మీర్ లో కొనసాగుతున్న ఈ అశాంతిపై రాజ్యసభలో చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించడంతో మొదట ఆజాద్ మాట్లాడారు. -
ద్విజాతి ఛాయలో కశ్మీర్ లోయ
జాతిహితం అవమానభారంతో కుంగిపోతున్నవారి, ఆగ్రహంతో ఉన్న వారి మనసులను సైన్యాలు గెలవలేవు. శత్రువును నిరోధించాలంటే లేదా ఓడించాలంటే సైన్యాన్ని ఉపయోగించాలి. అలా కాకుండా అన్యమనస్కంగా ఉన్న సోదరుడిని తిరిగి దారికి తెచ్చుకోవాలంటే పెద్ద మనసు అవసరం. ఇది పని చేయగలదా? ఒక్క వాక్యంతో వాజ్‌పేయి తీసుకువచ్చిన నాటకీయ మార్పును గురించి ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. రాజ్యాంగ పరిధిలోనే ఎందుకు, నేను మానవత్వం పరిధి నుంచి మీతో మాట్లాడతాను అన్నారాయన. కశ్మీర్ లోయలో జరుగుతున్న తాజా పరిణామాలన్నీ మన లోలోపలి వికృ తాలే. ఇది కశ్మీర్ భూభాగం గురించి కూడా కాదు. లేదా కశ్మీరీల గురించి అయినా కాదు. లేదంటే భారత్, పాకిస్తాన్ల వ్యవహారం కూడా కాదు. ఇప్పుడు ఇది హిందువులు, ముస్లింల గొడవగా తయారయింది. ఎవరికీ లబ్ధి చేకూర్చని ఇలాంటి పరిస్థితి ఎందుకు తలెత్తింది? మిగతా విషయాలు పక్కన పెట్టి ఇలాంటి వాదనలో ఉన్న కనీస తర్క బద్ధ వాస్తవాలనైనా చూద్దాం. మొదట: బుర్హన్ వనిని సాయుధదళాలు కాల్చి చంపడంతో తాజా కల్లోలం ఆరంభమైంది. ఈ పరిణామం సంభవించ కూడ నిదేమీ కాదు. అతడు రాజ్యానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి, సోషల్ మీడియాలో హల్చల్ చేసినప్పుడే చావుకు అత్యంత సమీపంగా వచ్చాడని అర్థమైంది. నిజానికి ఇంతకాలం జీవించి ఉన్నాడంటే అదంతా అతడి చాక చక్యమే. పెద్ద వింత కూడా. సాయుధబలగాల దృష్టిలో పడి, వారు వెతుకు తున్న వారి ‘ఏ’ జాబితాలో పేరు ఎక్కిన ఆరేళ్ల తరువాత కూడా బతికి బట్ట కట్టడం మామూలుగా సాధ్యంకాదు. అతడి పట్ల నేను సానుభూతితో ఉండాలా? సోదర భారతీయుడు ఎవరు మరణించినా నేను దుఃఖిస్తాను. అయితే బుర్హాన్ వని పట్ల కొంత వరకు నేను సానుభూతి చూపాలి. ఇలాంటి ప్రాణాంతకమైన మార్గంలోకి అతడు వెళ్లేటట్టు మిత్రులు, కుటుంబం అతడిని అనుమతించినందుకు, బహుశా అలాంటి దానికి ప్రోత్సహించినందుకు కూడా నేను సానుభూతి చూపవచ్చు. అతడు మరణించిన తీరుకు కూడా సానుభూతితో ఉండవచ్చు. కానీ ఒకసారి ఆయుధం చేపట్టి జనాన్ని చంపడం మొదలుపెట్టిన తరువాత చట్టేతర విధానాలతో చంపుతున్నారంటూ అవతలి వారిని ఆరోపించే కనీస నైతిక అర్హత కోల్పోయినట్టే. అయినా అలాంటి చావును అతడు స్వచ్ఛందంగా కోరుకున్నాడు. ఇది విషాదం. తరువాత డజన్ల కొద్దీ సాధారణ పౌరులు, యూనిఫారాలలో ఉన్నవారు కూడా ప్రాణాలు కోల్పోవలసి వచ్చింది. ఇది మరింత విషాదం. నా వరకు, ఇంకా అశేష భారతీయ జనాభా, ధైర్యం చేసి జేఎన్‌యూ ప్రాంగణంలో నేను చెప్పినట్టు ఎలాంటి సంకోచాలు లేని వాస్తవం- కశ్మీర్, ప్రస్తుతం దేశం అధీనంలో ఉన్న ఇతర భూభాగాలు భారత్ నుంచి అవిభా జ్యాలు. గణతంత్ర భారత్‌లోని అంతర్భాగాలు. అలాగే, కొంతమంది తిట్టినా, పాకిస్తాన్, చైనాల ఆక్రమణలో ఉన్న ఆక్రమిత కశ్మీర్ భూభాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవాలంటూ పార్లమెంటు ఏకగ్రీవ తీర్మానం ఉన్నప్ప టికీ పాకిస్తాన్ చేతిలో ఉన్న భూభాగాలు అక్కడే ఉంటే ఉండనివ్వమనే నేనంటాను. అణ్వాయుధాలు కలిగి ఉన్న మూడు ఇరుగు పొరుగు దేశాలు కూడా యుద్ధం ద్వారా ఇతరుల భూభాగాలను దఖలు పరుచుకోలేవు. ప్రస్తుత పరిస్థితిని బట్టి ఈ మూడు దేశాలలో రెండు దేశాలకు వ్యతి రేకంగా ఎవరు వ్యవహరించినా కశ్మీర్ భూభాగం, కశ్మీర్ ప్రజానీకం ఆ మూడు దేశాల దాయాదుల చిరకాల పోరులో చిక్కుకోవడం తథ్యం. కాబట్టి ఎవరూ తొందరపడరు. ఆఖరికి డజను తాజా యుద్ధాలు చేసుకున్నా, భారత్-పాక్ తమ అణ్వాయుధాలు మొత్తం వినియోగించినా కూడా ఎటు వైపు వారైనా కూడా వారి వైపు ఉన్న కశ్మీరాలను కోల్పోరని నేను పందెం కట్టి మరీ చెబుతాను. భద్రతా మండలి తీర్మానాలు కూడా పాకిస్తాన్ లేదా భారత్ లకే అవకాశం కల్పించాయి. పాకిస్తాన్ చెబుతున్న ఆజాద్ కశ్మీర్, ప్రజా భిప్రాయ సేకరణ, ఆజాదీకి మద్దతు ఇవేమీ ఇక్కడ వర్తించవు. ఇవన్నీ కపట నాటకాలే. ఆజాదీ ఏమీ లేదు. స్కాట్లాండ్ లేదు. క్విబెక్ లేదు. ఆఖరికి బ్రిక్జిట్ కూడా ఇక్కడ లేదు. ఏది ఏమైనా ఐక్యరాజ్య సమితి తీర్మానాలను, సిమ్లా ఒప్పందాన్ని కూడా తుంగలో తొక్కినది పాకిస్తానే తప్ప భారత్ కాదు. ఏడేళ్లకు ముందు సైన్యం సహాయంతో కశ్మీర్‌ను స్వాధీనం చేసుకుందామని ఆ దేశం యత్నించి పూర్తిగా విఫలమైంది. కశ్మీర్‌ను కోల్పోతున్నామని భారతీయులు ఎప్పటికీ విచారించవలసిన అవసరం లేదు. అక్కడ చాలినంత సైన్యం ఉంది. మన భూభాగంలోని ఆ లోయను రక్షించుకోవాలన్న మన ఆశయం వజ్ర సదృశంగా ఉంది. ‘‘మన’’ కశ్మీరీలు అనేది ఇప్పుడు ఒక అంశమే కాదు, అంతకు మించిన వివాదాస్పద అంకంలోకి ప్రవేశిస్తున్నాం. పౌరులనీ, భూభాగాలనీ సైన్యాలు కాపాడగలవు. కానీ ఆగ్రహంతో ఉన్నవారి మనసును సైన్యం మార్చలేదు. ఈ మాటని చాలా మంది సైనికులు, మిత్రులు వెంటనే అంగీకరిం చలేరు. అవమానభారంతో కుంగిపోతున్నవారి, ఆగ్రహంతో ఉన్న వారి మనసులను సైన్యాలు గెలవలేవు. శత్రువును నిరోధించాలంటే లేదా ఓడించా లంటే సైన్యం ఉపయోగించాలి. అలా కాకుండా అన్యమనస్కంగా ఉన్న సోదరుడిని తిరిగి దారికి తెచ్చుకోవాలంటే పెద్ద మనసు అవసరం. ఇది పని చేయగలదా? ఒక్క వాక్యంతో వాజ్‌పేయి తీసుకువచ్చిన నాటకీయ మార్పును గురించి ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. రాజ్యాంగ పరిధిలోనే ఎందుకు, నేను మానవత్వం పరిధి నుంచి మీతో మాట్లాడతాను అన్నారా యన. అదే ఆరేళ్ల పాటు రెండు దేశాల మధ్య శాంతిని నెలకొల్పింది. ఆ బాటలోనే మన్మోహన్సింగ్ ప్రయాణించారు. భారతదేశ సంకీర్ణ ప్రభుత్వాల చరిత్రలోనే అసంభవం అనదగ్గ తీరులో ముఫ్తీ స్థాపించిన పీడీపీతో బీజేపీ జత కట్టిన దృష్ట్యా నరేంద్ర మోదీ కూడా ఇలాగే వ్యవహరించగలరని మనం ఊహించాం. కశ్మీర్లో సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికి పరిస్థితులు ఇంతగా విషమించడానికి కారణం- సంకీర్ణం ఏర్పాటు చేయడంలోని ఉద్దేశం గురించి బీజేపీ తన కార్యకర్తలకు సరిగా ప్రచారం చేయలేదు. మరీ ముఖ్యంగా తన సిద్ధాంతకర్తలకీ, మేధావి వర్గానికీ, అజెండా నిర్ణేతలకీ కూడా ఉద్దేశాన్ని ఎరుక పరచలేదు. సైద్ధాంతికంగా ఎడమొహం పెడ మొహంగా ఉండే రెండు విభిన్నశక్తులు జాతీయతా సూత్రంతో (ముఫ్తీ గురించి ఆయన రాజకీయాల గురించి కూడా నేను ఇదే చెబుతాను) ఒకే తాటిపైకి వచ్చాయి. ఎన్నికలు తెచ్చిన విభజనను అధిగమించి ఐక్యత సాధించే ఉద్దేశంతో అవి ఈ పనిచేశాయి. అందుకే ఈ సంకీర్ణం భేషజంతో కాకుండా, రాజనీతిజ్ఞతతో వచ్చిందని అంటాను. జమ్మూ కశ్మీర్లో ద్విజాతి సిద్ధాంతంతో సమానమైన సిద్ధాంతానికి తెర తీసిన ఎన్నికలవి. ముస్లింలు అధికంగా ఉండే ప్రాంతాలలో ఒక రకంగాను, ముస్లిమేతరులు ఎక్కువగా ఉండే ప్రాంతాలలో మరో తీరు లోను ఓటింగ్ జరిగింది. పీడీపీతో భాగస్వామ్యానికి నరేంద్ర మోదీ చొరవ చూపినప్పటికీ, ఆయన పార్టీ కార్యకర్తల సిద్ధాంతం, మోదీ రాజకీయ వాస్త వాలు ఆయనను వెనక్కు తగ్గేటట్టు చేశాయి. బాధితుల పట్ల చిన్నపాటి సానుభూతి మాట కూడా చెప్పకుండా, వారు దేని గురించి అడుగుతున్నారో కూడా ప్రస్తావించకుండా కశ్మీర్లో భద్రతాదళాల కార్యకలాపాలను సమర్థించ డానికి రోజూ సాయంకాలం మోదీగారి పార్టీ వక్తలు టీవీ స్టూడియోల చుట్టూ ఎలా తిరుగుతున్నారో మనమంతా చూస్తున్నాం. సంకీర్ణ భాగస్వామిని ఆదు కోవడమన్న పేరుతో బీజేపీ చేస్తున్న ఈ పని వికృతమైనదే కాదు, స్వీయ విధ్వంసకమైనది కూడా. కశ్మీర్ మొత్తం మనదే అంటూ నినదించేవారు, గుండెలు బాదుకునే వారు కశ్మీర్ అంటే వారి దృష్టిలో ఒక్క భూభాగమా లేక కశ్మీరీలు కూడానా? అన్న ప్రశ్న వేసుకోవాలి. ఇంకా చెప్పాలంటే తమకు విధేయులుగా (హిందు వులు, బౌద్ధులు) ఉండేవారేనా? అని కూడా ప్రశ్నించుకోవాలి. అలాగే ముస్లింలు కోరుకుంటే వారు పాకిస్తాన్ వెళ్లిపోవాలన్నదే తమ వాంఛితమా? వాస్తవంగా మనసులో ఉన్నది అదే అయితే, విభజన తరువాత అసం పూర్ణంగా మిగిలిన అజెండాయే కశ్మీర్ అంటూ పాకిస్తాన్ ఇప్పటివరకు అడ్డూ అదుపు లేకుండా దేని గురించి మాట్లాడుతున్నదో మీరు కూడా అదే మాట్లా డుతున్నారు. ఆ భూభాగాన్ని, కొంత జనాన్ని (ముస్లింలు) వారు కోరు తున్నారు. మనం కూడా అంతే, ఆ భూభాగం, కొంత జనం కావాలని కోరు తున్నాం. విభజించు పాలించు అన్న సూత్రం మనకి బ్రిటిష్ జాతి నేర్పింది. మనం మాత్రం విభజించు- వదులుకో అన్న సిద్ధాంతాన్ని పాటిస్తున్నాం. నిజానికి 97 శాతం ముస్లింలు భారతదేశంలోని ప్రధాన భూభాగంలోనే నివశిస్తున్నారు. వీరి దేశభక్తిని నిరంతరం శంకించినప్పటికీ వీరు ఏనాడూ కశ్మీరీల నినాదంతో గొంతు కలపలేదు. ఆఖరికి కొత్త సున్నీ రైట్ సిద్ధాంత కర్తలు, అంటే జకీర్ నాయక్ వంటి వారు కూడా కశ్మీర్ అంశం గురించి ఆచి తూచి మాట్లాడుతున్నారు. ఆ సమస్యను లోయకు పరిమితంగా ఉంచడానికి ప్రభుత్వానికి వెసులుబాటు కల్పిస్తున్నది ఇదే. ఈ మార్గం గురించి ఆలోచించండి. పాకిస్తాన్ వెళ్లిపోవాలనుకునే వారు ఎవరైనా ఉంటే సరిహద్దులు తెరిచి ఉన్నాయి అని ముస్లింలతో భారత్ చెప్పవలసి వస్తే ఎలా ఉంటుంది? ఏ ఒక్కరు భారత భూభాగం విడిచి వెళ్లరు. నా అనుమానం ఏమిటంటే, మంచి జీవనం కోసం పాకిస్తాన్, బంగ్లాల నుంచే ఇంకొందరు ముస్లింలు ఇక్కడికే రావచ్చు. రాజకీయ, ఆర్థిక స్థిరత్వాలే మనం ఎక్కడ ఉండాలి అన్న విషయాన్ని నిర్ధారిస్తాయి. కశ్మీర్ సరిహద్దులలో కూడా ఇదే చెబితే? ఆజాదీ కశ్మీర్ గురించి కల్పనలు ఉన్న వారు, జీహాదీల వలలో పడినవారు ఏ కొందరో మినహా ఎవరూ దేశం విడి చిపోరు. కశ్మీర్లో ‘మన జనం’ అంటూ మాట్లాడేవారే ఇంకో ప్రశ్నను కూడా వేసుకోవాలి. ‘మన’ కశ్మీరీలు ‘వారి’ భూభాగంలో ఉండాలా? లేకపోతే భూభాగం ఇక్కడ వదిలి పాకిస్తాన్ వెళ్లిపోవాలా? దీనికి నిజాయితీతో కూడిన సమాధానం రాబట్టుకోవడం నా ఉద్దేశం కాదు. హిందూ-ముస్లిం పరి భాషతో కశ్మీర్ సమస్యను పునర్ వ్యాఖ్యానిస్తే వచ్చే ప్రమాదం ఏమిటో ఆలో చించాలనే నా ఉద్దేశం. అలాగే కనుక ఆలోచిస్తే కశ్మీర్‌ని పోగొట్టుకోకపోవచ్చు. కానీ కశ్మీరీలను పోగొట్టుకుంటాం. - శేఖర్ గుప్తా twitter@shekargupta -
పాకిస్థాన్ 'బ్లాక్‌డే'పై భగ్గుమన్న భారత్!
న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్ విషయంలో పాకిస్థాన్ మరోసారి హద్దుమీరి ప్రవర్తించింది. కశ్మీర్ వాసులకు మద్దతుగా జూలై 19న బ్లాక్ డే పాటించనున్నట్టు పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ప్రకటించడంపై భారత్ భగ్గుమంది. ఈ విషయంలో పాకిస్థాన్ కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని తాము నిర్ద్వంద్వంగా, నిక్కచ్చిగా తిరస్కరిస్తున్నట్టు భారత్ తేల్చిచెప్పింది. 'మా అంతర్గత వ్యవహారాల్లో తల దూర్చేందుకు పాకిస్థాన్ నిరంతరం చేస్తున్న ప్రయత్నాలు మాకు దిగ్భ్రాంతి కలుగజేస్తున్నాయి' అని భారత విదేశాంగ మంత్రిత్వశాఖ ఓ ప్రకటనలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కొన్ని ఉగ్రవాద సంస్థలకు చెందిన ఉగ్రవాదులను కీర్తిస్తూ పాకిస్థాన్ తన పక్షపాత, కపట బుద్ధిని చాటుకుంటున్నదని ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోవైపు శుక్రవారం ఉదయం పాక్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఎం ఆసిఫ్ ట్విట్టర్లో జమ్ముకశ్మీర్‌లో తాజా ఘటనలను, 2002నాటి గుజరాత్ అల్లర్లతో పోలుస్తూ తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గుజరాత్లో మోదీ చేపట్టిన జాతుల నిర్మూలన కశ్మీర్‌లోనూ కొనసాగుతున్నదంటూ ఖవాజా నోరుపారేసుకున్నారు. ఆయన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన భారత్ పొరుగుదేశాల విషయాల్లో జోక్యం చేసుకోవద్దంటూ పాక్‌కు హితవు పలికింది. హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాది బుర్హాన్ వనీ భద్రతా దళాల ఎన్కౌంటర్లో మృతిచెందడంతో తలెత్తిన ఆందోళనల్లో 36మంది చనిపోగా.. 1500 మంది గాయపడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై పాకిస్థాన్ శృతిమించి స్పందిస్తోంది. ఇప్పటికే ఉగ్రవాది బుర్హాన్ వనీని కశ్మీర్ నాయకుడిగా కీర్తిస్తూ.. అతని మృతిపై పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. -
మీడియాపై మోదీ అసహనం
న్యూఢిల్లీ: హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాది బుర్మాన్ వనీ మృతి పట్ల మీడియా ఎక్కువ కవరేజీ ఇవ్వడంపై ప్రధాని నరేంద్రమోదీ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఒక ఉగ్రవాదిని ప్రసార మాధ్యమాలు హీరోగా చేయడాన్ని మోదీ తప్పుబట్టారు. బుర్మాన్ వనీ ఎన్ కౌంటర్, అనంతరం నెలకొన్న పరిస్థితులపై నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో మోదీ ఈ వ్యాఖ్యలు చేసినట్టు సమాచారం. దేశాన్ని విచ్చిన్నం చేయడానికి ప్రయత్నించే ఇటువంటి వారిని ఉపేక్షించే పరిస్థితి లేదని అన్నారు. అతని అనుచరులూ తగిన మూల్యం చెల్లించక తప్పదని మోదీ స్పష్టం చేశారు. -
కశ్మీర్ సమస్యకు పరిష్కారం సాధ్యమేనా ?
-
కశ్మీర్ హింసపై ప్రధాని ఉన్నతస్థాయి సమీక్ష
న్యూఢిల్లీ : జమ్మూ కశ్మీర్లో పరిస్థితులపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ మంగళవారం అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. మోదీ అధికారిక నివాసం 7 రేస్ కోర్స్‌లో జరుగుతున్న ఈ ఉన్నతస్థాయి సమీక్ష సమావేశానికి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తో సహా ఉన్నతాధికారులు హాజరయ్యారు. కాగా హిజ్బుల్ కమాండర్ బుర్హాన్ కాల్చివేతపై తలెత్తిన ఘర్షణల్లో ఇప్పటివరకూ 29మంది మృతి చెందగా, సుమారు 800మంది గాయపడ్డారు. ఈ నేపథ్యంలో తాజా పరిస్థితులపై ఆయన అధికారులతో చర్చిస్తున్నారు. మరోవైపు కశ్మీర్లో బంద్ కొనసాగుతోంది. వేర్పాటువాదులు బంద్‌ను మరో రెండు రోజులు పొడిగించారు. శ్రీనగర్ సహా చాలా ప్రాంతాల్లో కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. -
'ఒక్క బుర్హాన్‌ను కాల్చిచంపితే...'
ఇస్లామాబాద్: హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాద సంస్థ కమాండర్ బుర్హాన్ వని ఎన్ కౌంటర్ అనంతరం కశ్మీర్ లోయలో చెలరేగిన ఆందోళనల్లో ఇప్పటివరకు 21 మంది ప్రాణాలు కోల్పోయారు. గాయపడ్డ 300 మందిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కొన్నేళ్లుగా కనీసం పైకి ప్రశాంతంగా ఉన్న కశ్మీర్ లోయ బుర్హాన్ ఎన్ కౌంటర్ తో ఒక్కసారిగా వేడెక్కడం, బుర్హాన్ సొంత ఊరు త్రాల్ పట్టణంలో జరిగిన అంత్యక్రియలకు జనం లక్షల్లో హాజరుకావడం, ఘటన జరిగి నాలుగు రోజులైనా పరిస్థితి అదుపులోకి రాకపోవడాన్ని దాయాది పాకిస్థాన్ ఎప్పటిలాగే అవకాశంగా తీసుకుంది. భారత్ ను రెచ్చగొట్టేలా ఆ దేశ ప్రధాని నవాజ్ షరీఫ్.. ఉగ్రవాది బుర్హాన్ ను పొగిడారు. మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ హఫీజ్ సయ్యద్, పాకిస్థాన్ లోని ఇతర పార్టీల నోటా ఇప్పుడు బుర్హాన్ మాటే. 'కశ్మీరీ యువ నాయకుడు బుర్హాన్ వని మరణ వార్త ప్రధాని నవాజ్ షరీఫ్ ను తీవ్రంగా కలిచివేసంది. వనీతోపాటు భారత సైన్యం, అర్ధసైన్యం జరిపిన చట్ట వ్యతిరేక కాల్పుల్లో చనిపోయిన ఇతరులకూ ప్రధాని సానుభూతి వ్యక్తం చేశారు. స్వయం పాలన కోరుకుంటోన్న కశ్మీరీల హక్కులపై ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో తీర్మానం చేయాలి' అని పాక్ ప్రధాని కార్యాలయం ఒక అధికారిక ప్రకటనను విడుదల చేసింది. మరోవైపు ముంబై పేలుళ్ల సూత్రధారి, జమాత్ ఉల్ దవా చీఫ్ హఫీజ్ సయ్యద్ సైతం బుర్హాన్ మరణంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆదివారం పాక్ ఆక్రమిత్ కశ్మీర్ (పీవోకే)లోని ముజఫరాబాద్ సమీపంలో జరిగిన సంస్మరణ సభలో హపీజ్ మాట్లాడుతూ.. 'ఆజాద్ కశ్మీర్ కోసం ఒక్క బుర్హాన్ చనిపోతే.. వేల మంది పుట్టుకొస్తారు'అని అన్నారు. నివని ఎన్ కౌంటర్, అనంత పరిణామాలపై నవాజ్ షరీఫ్ మౌనంగా ఉడటాన్ని పాకిస్థాన్ లోని ప్రతిపక్ష పార్టీలు తప్పు పట్టిన నేపథ్యంలోనే ప్రధాని కార్యాలయం నుంచి ప్రకటన వెలువడినట్లు తెలుస్తోంది. 'నరేంద్ర మోదీ- నవాజ్ షరీఫ్ ల స్నేహం కశ్మీర్ ను కోలుకోలేని విధంగా దెబ్బతీస్తున్నాయని పాకిస్థాన్ పీపుల్స్ చీఫ్ బిలావల్ భుట్టో జర్దారి విమర్శించారు. ప్రపంచంలోని ఇతర ముస్లింలు రంజాన్ ను ఆనందోత్సాహల మధ్య జరుపుకోగా, సహోదర కశ్మీరీలు మాత్రం హింసను ఎదుర్కొన్నారని బిలావర్ అన్నారు. -
ఎందుకు దక్షిణ కశ్మీరం రగిలిపోతోంది?
శ్రీనగర్: కొన్నేళ్ల నుంచి ప్రశాంత పరిస్థితులతో కొనసాగుతున్న దక్షిణ కశ్మీరం ఇప్పుడు కల్లోలంగా మారింది. పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీకి ఆయువు పట్టుగా ఉన్న ప్రాంతాల్లో ఇప్పుడు మిలెటెన్సీ పురివిప్పింది. యువకులు వీధుల్లోకి వచ్చి రాళ్లు రువ్వటం, మిలిటెంట్లు, భద్రతా బలగాల మధ్య ఎన్కౌంటర్లు నిత్యకృత్యం అయ్యాయి. సోషల్ మీడియా ద్వారా విశేష ప్రాచుర్యం సంపాదించుకన్న హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ 21 ఏళ్ల బుర్హాన్ వనిని శుక్రవారం సైనిక బలగాలు ఎన్కౌంటర్ చేయడంతో తాజా హింసాకాండ ప్రజ్వరిల్లింది. ఈ తాజా హింసాకాండలో ఇప్పటికే 21 మంది మరణించారు. ఈ ఏడాది కాశ్మీర్ మొత్తంలో 89 మంది స్థానిక మిలిటెంట్లు క్రియాశీలక పాత్ర నిర్వహిస్తుండగా, వారిలో 60 మంది దక్షిణ కాశ్మీర్‌కు చెందిన వారే. పోలీసుల లెక్క ప్రకారం మొత్తం కశ్మీర్లో 70 మంది విదేశీ మిలిటెంట్లు పనిచేస్తుండగా, వారిలో దాదాపు 25 మంది దక్షిణ కశ్మీర్లో పనిచేస్తున్నారు. దక్షిణ కశ్మీర్‌లోని పుల్వామా, అనంత్‌నాగ్, సోఫియాన, కుల్గామ్ ప్రాంతాలు మిలిటెన్సీతో రగిలిపోతున్నాయి. ఎందుకు ఇలా జరుగుతోంది? దక్షిణ కశ్మీర్ మిలిటెన్సీకి ఎందుకు హాటబెడ్గా మారిపోయింది? 2014 చివరలో జరిగిన కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల నాటి నుంచే దక్షిణ కశ్మీర్లో మిలిటెన్సీ పెరుగుతూ వచ్చింది. నాటి ఎన్నికల్లో జమాతి ఇస్లామి పార్టీకి చెందిన మెజారిటీ వర్గం ముఫ్తీ కుటుంబం నాయకత్వంలోని పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీలో చేరిపోయింది.‘ఆజాది’ నినాదంతో ముందుకొచ్చిన జమాతి ఇస్లామి పార్టీ హిజ్బుల్ ముజాహిదీన్లకు బహిరంగంగానే మద్దదిస్తున్న విషయం తెల్సిందే. ఎన్నికల అనంతరం పీడీపీ పార్టీ భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోవడం అటు పీడీపీలోని జమాతీ ఇస్లామీలోని మాజీలకు, ఇటు జమాతీ ఇస్లామీ పార్టీ క్యాడర్‌కు మింగుడు పడలేదు. దక్షిణ కశ్మీర్‌లోనే ఎక్కువ పట్టు కలిగిన ఈ వర్గం మిలెటెన్సీ వైపు మళ్లీ మొగ్గుచూపింది. భద్రతా బలగాలు మానవ హక్కులను హరించివేయడం కూడా వారి మిలిటెన్సీకి ఆజ్యం పోసింది. ప్రస్తుతం దక్షిణ కశ్మీర్‌లోని క్రియాశీలకంగా పనిచేస్తున్న మిలెటెంట్లలో ఎక్కువ మంది జమాతీ కుటుంబాల నుంచి వచ్చిన వారే ఉన్నారు. 1941లో లాహోర్‌లో ప్రాణం పోసుకున్న జమాతీ ఇస్లామీ 1953లో జమ్మూ కశ్వీర్‌లో తన యూనిట్‌ను ఏర్పాటు చేసుకుంది. ఇది క్రమంగా విస్తరిస్తుండడంతో 1975లో ఎమర్జెన్సీ సందర్భంగా అప్పటి ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ ఈ సంస్థను నిషేదించింది. మళ్లీ అది 1989లో మరోసారి విజృంభించింది. హిజ్బుల్ ముజాహిదీన్లకు అప్పుడు బహిరంగంగా మద్దతు ప్రకటించింది. 1990లో భారత ప్రభుత్వం మరోసారి దీన్ని నిషేధించింది. అప్పటి నుంచి సంస్థ నాయకులపై అణచివేత పెరుగుతూ వచ్చింది. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా జమాతీ ఇస్లామీ మద్దతుదారులు ముఫ్తీ కుటుంబం నాయకత్వంలోని పీడీపీకి మద్దతు ఇచ్చారు. ఆ పార్టీ ఎన్నికల అనంతరం బీజీపీతో పొత్తుపెట్టుకోవడం వారికి కోపం తెప్పించింది. వారంతా మళ్లీ దక్షిణ కశ్మీర్లో ఆయుధాలు పట్టుకున్నారు. -
ఆ ఉగ్రవాది లాస్ట్ ట్వీట్...
శ్రీనగర్: అంతర్జాలం ద్వారా జమ్ము కశ్మీర్ యువతను ఉగ్రవాదం పైపు ఆకర్షించడంలో విజయం సాధించిన హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాది బర్హాన్ ముజఫర్ వానీ చివరి ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. జులై 8 న చేసిన ట్వీట్ లో ఇస్లాం మత బోధకుడు జకీర్ నాయక్ కు ప్రజలు మద్దతు తెలుపాల్సిందిగా కోరాడు. లేకుంటే రానున్న రోజుల్లో ఖురాన్ ను చదవడం కూడా నిషేధించే అవకాశం ఉందని పోస్ట్ చేశాడు. Support Zakir Naik or Time Will Come When Qur’an Recitation will be Banned pic.twitter.com/pVfoSLnCEj — Burhan Bhai (@Gazi_Burhan2) 8 July 2016 కాగా మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ జకీర్ నాయక్ పై దర్యాప్తునకు ఆదేశించిన విషయం తెలిసిందే. జులై 1 న ఢాకాలోని రెస్టారెంట్ లో జరిగిన ఉగ్రదాడిలో పాల్గొన్న ఉగ్రవాదులు జాకీర్ నాయక్ బోధనలతో ప్రభావితమయ్యారని నిర్ధారించిన బంగ్లాదేశ్ ప్రభుత్వం ఆయనకు చెందిన పీస్ టీవీ ఛానల్ ను నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. పోలీసులు జరిపిన ఎన్ కౌంటర్లో బర్హన్ వానీ మృతి చెందిన అనంతరం ఆ రాష్ట్రంలో ఘర్షణలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. -
కశ్మీర్ హింసపై సోనియా ఆందోళన
న్యూఢిల్లీ: కశ్మీర్ లో జరిగిన హింస్మాతక ఘటనల్లో అమాయకులు ప్రాణాలు కోల్పోవడం పట్ల కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. దేశభద్రత విషయంలో రాజీ పడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఉగ్రవాదంపై ఉక్కు మోపాలని సూచించారు. రాజకీయ ప్రక్రియతోనే కశ్మీర్ సమస్య పరిష్కారం అవుతుందన్న ఆశాభావాన్ని ఆమె వ్యక్తం చేశారు. రెండు దశాబ్దాల్లో రాజకీయ ప్రక్రియ కారణంగా కశ్మీర్ కు ఎన్నో ప్రయోజనాలు దక్కాయన్నారు. హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ బుర్హాన్ వనీని భద్రతా దళాలు హతమార్చడంతో కశ్మీర్ లో కల్లోలం చెలరేగింది. హింసాత్మక ఘటనల్లో 23 మంది మృతి చెందగా, 200 మందిపైగా గాయపడ్డారు. తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడంతో పలు జిల్లాల్లో కర్ఫ్యూ విధించారు. మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపేశారు. -
తీవ్రవాద పోకడలకు ప్రతిరూపం బుర్హాన్