
భారత ఉగ్రవాది.. పాక్ అమర వీరుడా?
న్యూఢిల్లీ: ఉగ్రవాది హిజ్బుల్ ముజాహిద్దిన్ కమాండర్ బుర్హాన్ వనీ ని పాక్ కీర్తించడం పట్ల భారత్ తీవ్రంగా మండిపడింది. పాక్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుందనడానికి ఇదే నిదర్శమని ప్రపంచానికి సూచించింది. ఓ టెర్రరిస్టును అమరవీరుడుగా పాక్ కీర్తించడం ఏమిటని ప్రశ్నించింది. భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి గోపాల్ బాగ్లే పాకిస్థాన్ ఆర్మీ, ఉగ్రవాది బుర్హాన్ వనీకి నివాళులు అర్పించడం, పాక్ ఉగ్రవాదులను పోశిస్తుందనడానికి నిదర్శనమని ట్వీట్ చేశారు.
ఇక బాగ్లే ట్వీట్ చేసిన ముందు రోజు పాక్ ఆర్మీ, ప్రధాని నవాజ్ షరీఫ్‌లు గతేడాది భారత సైనిక కాల్పుల్లో మరణించిన బుర్హాన్ వనీకి నివాళులు అర్పిస్తూ కశ్మిరి స్వాతంత్ర్య సమరమోదుడుగా కీర్తించారు. దీనిపై భారత్ తీవ్రంగా మండిపడింది. ఇక వనీ కశ్మీర్‌పై జరిపిన దాడుల్లో ప్రధాన నిందితుడు.