ఎందుకు దక్షిణ కశ్మీరం రగిలిపోతోంది? | why south Kashmir is burning | Sakshi
Sakshi News home page

ఎందుకు దక్షిణ కశ్మీరం రగిలిపోతోంది?

Published Mon, Jul 11 2016 3:01 PM | Last Updated on Mon, Sep 4 2017 4:37 AM

ఎందుకు దక్షిణ కశ్మీరం రగిలిపోతోంది?

ఎందుకు దక్షిణ కశ్మీరం రగిలిపోతోంది?

శ్రీనగర్: కొన్నేళ్ల నుంచి ప్రశాంత పరిస్థితులతో కొనసాగుతున్న దక్షిణ కశ్మీరం ఇప్పుడు కల్లోలంగా మారింది. పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీకి ఆయువు పట్టుగా ఉన్న ప్రాంతాల్లో ఇప్పుడు మిలెటెన్సీ పురివిప్పింది. యువకులు వీధుల్లోకి వచ్చి రాళ్లు రువ్వటం, మిలిటెంట్లు, భద్రతా బలగాల మధ్య ఎన్‌కౌంటర్లు నిత్యకృత్యం అయ్యాయి. సోషల్ మీడియా ద్వారా విశేష ప్రాచుర్యం సంపాదించుకన్న హిజ్‌బుల్ ముజాహిదీన్ కమాండర్ 21 ఏళ్ల బుర్హాన్ వనిని శుక్రవారం సైనిక బలగాలు ఎన్‌కౌంటర్ చేయడంతో తాజా హింసాకాండ ప్రజ్వరిల్లింది. ఈ తాజా హింసాకాండలో ఇప్పటికే 21 మంది మరణించారు.

ఈ ఏడాది కాశ్మీర్ మొత్తంలో 89 మంది స్థానిక మిలిటెంట్లు క్రియాశీలక పాత్ర నిర్వహిస్తుండగా, వారిలో 60 మంది దక్షిణ కాశ్మీర్‌కు చెందిన వారే. పోలీసుల లెక్క ప్రకారం మొత్తం కశ్మీర్‌లో 70 మంది విదేశీ మిలిటెంట్లు పనిచేస్తుండగా, వారిలో దాదాపు 25 మంది దక్షిణ కశ్మీర్‌లో పనిచేస్తున్నారు. దక్షిణ కశ్మీర్‌లోని పుల్వామా, అనంత్‌నాగ్, సోఫియాన, కుల్గామ్ ప్రాంతాలు మిలిటెన్సీతో రగిలిపోతున్నాయి. ఎందుకు ఇలా జరుగుతోంది? దక్షిణ కశ్మీర్ మిలిటెన్సీకి ఎందుకు హాటబెడ్‌గా మారిపోయింది?

2014 చివరలో జరిగిన కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల నాటి నుంచే దక్షిణ కశ్మీర్‌లో మిలిటెన్సీ పెరుగుతూ వచ్చింది. నాటి ఎన్నికల్లో జమాతి ఇస్లామి పార్టీకి చెందిన మెజారిటీ వర్గం  ముఫ్తీ కుటుంబం నాయకత్వంలోని పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీలో చేరిపోయింది.‘ఆజాది’ నినాదంతో ముందుకొచ్చిన జమాతి ఇస్లామి పార్టీ హిజ్‌బుల్ ముజాహిదీన్‌లకు బహిరంగంగానే మద్దదిస్తున్న విషయం తెల్సిందే. ఎన్నికల అనంతరం పీడీపీ పార్టీ భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోవడం అటు పీడీపీలోని జమాతీ ఇస్లామీలోని మాజీలకు, ఇటు జమాతీ ఇస్లామీ పార్టీ క్యాడర్‌కు మింగుడు పడలేదు. దక్షిణ కశ్మీర్‌లోనే ఎక్కువ పట్టు కలిగిన ఈ వర్గం మిలెటెన్సీ వైపు మళ్లీ మొగ్గుచూపింది. భద్రతా బలగాలు మానవ హక్కులను హరించివేయడం కూడా వారి మిలిటెన్సీకి ఆజ్యం పోసింది. ప్రస్తుతం దక్షిణ కశ్మీర్‌లోని క్రియాశీలకంగా పనిచేస్తున్న మిలెటెంట్లలో ఎక్కువ మంది జమాతీ కుటుంబాల నుంచి వచ్చిన వారే ఉన్నారు.

1941లో లాహోర్‌లో ప్రాణం పోసుకున్న జమాతీ ఇస్లామీ 1953లో జమ్మూ కశ్వీర్‌లో తన యూనిట్‌ను ఏర్పాటు చేసుకుంది. ఇది క్రమంగా విస్తరిస్తుండడంతో 1975లో ఎమర్జెన్సీ సందర్భంగా అప్పటి ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ ఈ సంస్థను నిషేదించింది. మళ్లీ  అది 1989లో మరోసారి విజృంభించింది. హిజ్‌బుల్ ముజాహిదీన్లకు అప్పుడు బహిరంగంగా మద్దతు ప్రకటించింది. 1990లో భారత ప్రభుత్వం మరోసారి దీన్ని నిషేధించింది. అప్పటి నుంచి సంస్థ నాయకులపై అణచివేత పెరుగుతూ వచ్చింది. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా జమాతీ ఇస్లామీ మద్దతుదారులు ముఫ్తీ కుటుంబం నాయకత్వంలోని పీడీపీకి మద్దతు ఇచ్చారు. ఆ పార్టీ ఎన్నికల అనంతరం బీజీపీతో పొత్తుపెట్టుకోవడం వారికి కోపం తెప్పించింది. వారంతా మళ్లీ దక్షిణ కశ్మీర్‌లో ఆయుధాలు పట్టుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement