South Kashmir
-
మ్యాచ్ మధ్యలో ఆసక్తికర సన్నివేశం.. తప్పక చూడాల్సిందే
కశ్మీర్: ప్రపంచంలో తండ్రీ.. కూతురి అనుబంధం ఎప్పుడు ప్రత్యేకమే. అమ్మకు కొడుకు మీద ప్రేమ ఉంటే.. నాన్నకు కూతురు మీద ప్రేమ ఉంటుంది. ఇప్పుడు ఈ ఎందుకు అని మీకు డౌట్ వచ్చి ఉంటుంది. అక్కడికే వస్తున్నాం. క్రికెట్‌కు జెంటిల్మెన్ గేమ్ అని పేరు ఉంది. ఆటలో ఎన్నోసార్లు ఆసక్తికర సన్నివేశాలు చూసుంటాం. ఉదాహరణకు ఆటగాళ్ల మధ్య గొడవలు.. ఫీల్డింగ్ విన్యాసాలు.. క్యాచ్‌లు.. రనౌట్లు.. భారీ సిక్స్‌లు ఇలా చెప్పుకుంటే పోతే చాలానే ఉన్నాయి. తాజాగా అలాంటి ఘటనే మ్యాచ్ మధ్యలో చోటుచేసుకుంది. దక్షిణ కశ్మీర్లో జరుగుతున్న క్లబ్ క్రికెట్లో మ్యాచ్‌లో ఫీల్డర్‌కు దాహం వేసింది. సాధారణంగా డ్రింక్స్ అందించడానికి బాయ్స్ ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం తన తండ్రికి దాహం వేయడంతో అతని కూతురు స్వయంగా గ్రౌండ్లోకి వచ్చి వాటర్ అందించింది. దీనిలో ప్రత్యేకంగా చెప్పడానికి ఏమీ లేకపోయినప్పటికి ఫోటో మాత్రం వైరల్ అయింది. వీలైతే మీరు ఒక లుక్కేయండి. కాగా సదరు తండ్రి మట్టన్ స్పోర్ట్స్‌క్లబ్‌కు ఆడుతున్నట్లు అతను వేసుకున్న జెర్సీ ఆధారంగా తెలిసింది. ఇటీవలే కశ్మీర్ ప్రీమియర్ లీగ్‌పై వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ హర్షలే గిబ్స్కు బీసీసీఐ నుంచి బెదిరింపులు వచ్చినట్లు వార్తలు వచ్చాయి. అయితే బీసీసీఐ మాత్రం దీనిని ఖండించింది. అయితే పాక్ మాజీ క్రికెటర్లు మాత్రం బీసీసీఐ అనవసర రాద్దాంతం చేస్తుందని విషం కక్కారు. This picture is ❤️. Daughter carrying drinks for her father during drinks break at #Tikbagh KP Road Mattan In ongoing #MPL2 league. Daughter are gifted ❤️@imVkohli @ICC @BCCI @ImParveezRasool @evarayees @dr_piyushsingla @hussain_imtiyaz @ABdeVilliers17 @bhatray @Kashmir_Monitor pic.twitter.com/MYrjqxCQHB — Aabid Bhat (@ubiiibhat87) August 8, 2021 -
ముగ్గురు పోలీసులను హత్యచేసిన ముష్కరులు
-
ముగ్గురు పోలీసుల కిడ్నాప్.. ఆపై హత్య
జమ్మూ: జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. దక్షిణ కశ్మీర్లో షోపియాన్ జిల్లాలో గురువారం రాత్రి కిడ్నాప్ చేసిన ముగ్గురు పోలీసులను హత్యచేశారు. శుక్రవారం ఉదయం పోలీసులు వారి మృతదేహాలను గుర్తించారు. వివరాల్లోకి వెళ్తే.. నిన్న అర్ధరాత్రి జిల్లాలోని రెండు గ్రామాల్లోకి చోరబడ్డ ఉగ్రవాదులు ముగ్గురు ప్రత్యేక బలగాలకు(ఎస్పీవో) చెందిన పోలీసులతో పాటు మరో పోలీసును అపహరించుకుపోయారు. కిడ్నాప్ అయిన వారిలో పోలీసు మాత్రం గ్రామస్తుల సహాయంతో బయటపడగలిగారు. మిగత వారిని ఉగ్రవాదులు అత్యంత పాశవికంగా హత్యచేశారు. కిడ్నాప్ చేసిన పోలీసులపై తమ ఉద్యోగాలకు రాజీనామా చేయాల్సిందిగా ఒత్తిడి చేశారని హోం మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. కొద్ది రోజుల ముందు హిజ్బుల్ ముజాహిద్దీన్‌కు చెందిన ఉగ్రవాదులు ఓ వీడియోను పంపారు. ఆ వీడియోలో పోలీసు అధికారులు ఉద్యోగాలకు రాజీనామా చేసి ఆ పత్రాన్ని అన్లైన్లో ఉంచాలి లేకపోతే తమ చేతుల్లో చనిపోవడానికి సిద్ధంగా ఉండాలని తెలిపారు. -
ఆర్మీ క్యాంపుపై ఉగ్ర దాడి
శ్రీనగర్: దక్షిణ కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో ఆర్మీ క్యాంప్‌పై ఉగ్రవాదులు చేసిన దాడిలో ఓ జవాను, మరో పౌరుడు మరణించారు. ఆదివారం రాత్రి కాకపోరాలోని 50వ రాష్ట్రీయ రైఫిల్స్ క్యాంప్‌పై మిలిటెంట్లు దాడి చేశారని, ఓ జవాను తీవ్రంగా గాయపడ్డాడని పోలీసులు తెలిపారు. జవాన్లు, మిలిటెంట్లకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో మిలాల్ అహ్మద్ అనే మరో పౌరుడు గాయపడ్డాడు. ఇద్దరినీ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ వారు మరణించినట్లు వెల్లడించారు. మరోవైపు, కశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలో మిలిటెంట్లు జరిపిన ఐఈడీ (ఇంప్రొవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజ్) దాడిలో ముగ్గురు జవాన్లు గాయపడ్డారు. -
కశ్మీర్లో హై అలర్ట్ !
♦ ఇస్మాయిల్ కోసం ముమ్మర గాలింపు ♦ దక్షిణ కశ్మీర్లో ఉండొచ్చని అంచనా ♦ కొనసాగుతున్న అమర్నాథ్ యాత్ర శ్రీనగర్: అమర్నాథ్ యాత్రీకులపై ఉగ్రదాడిలో ఏడుగురు మరణించిన దుర్ఘటనను కేంద్ర హోం శాఖ తీవ్రంగా పరిగణిస్తోంది. దాడి నేపథ్యంలో జమ్మూకశ్మీర్ అంతటా బుధవారం హైఅలర్ట్ ప్రకటించింది. భద్రతా బలగాలన్నీ అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. కొందరు కేంద్రమంత్రులు కశ్మీర్లో మకాం వేసి పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. కశ్మీర్ గవర్నర్, సీఎం, పారా మిలిటరీ దళా ల ఉన్నతాధికారులతో చర్చలు జరుపుతున్నారు. ఘటన సూత్రధారిగా భావిస్తున్న లష్కరే తోయిబా ఉగ్రవాది అబూ ఇస్మాయిల్‌ను పట్టుకునేందుకు భద్రతాదళాలు తీవ్రంగా గాలిస్తున్నాయి. ఇతడు దక్షిణ కశ్మీర్లో ఉండొచ్చనే అనుమానంతో ఆ ప్రాం తమంతా తనిఖీలు చేపట్టారు. చాలా ఏళ్ల క్రితమే ఇస్మాయిల్ కశ్మీర్‌కు వచ్చినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. గతేడాది దక్షిణ కశ్మీర్‌కు మకాం మార్చినట్లు తెలుస్తోంది. అనంత్‌నాగ్ జిల్లాలో సోమవారం రాత్రి అమర్నాథ్ యాత్రికులపై దాడి చేయడంతో ఏడుగురు మరణించడం తెలిసిందే. ఇస్మాయిల్‌తోపాటు మరో ముగ్గురు దాడిలో పాల్గొన్నారని పోలీసులు తెలిపారు. ఇటీవల లష్కరే తోయిబాకు చెందిన కొందరు ఉగ్రవాదులను భద్రతాసిబ్బంది మట్టుబెట్టారు. ఈ నేపథ్యంలో ప్రతీకా ర చర్యతోనే ఉగ్రవాదులు దాడి చేసినట్లు అధికారులు చెబుతున్నారు. పరిస్థితిని సమీక్షించిన కేబినెట్ కమిటీ న్యూఢిల్లీ: అమర్నాథ్ యాత్రీకులపై దాడితోపాటు చైనాతో ఏర్పడ్డ విభేదాలపై భద్రతా వ్యవహారాలపై ఏర్పాటైన కేబినెట్ కమిటీ ఢిల్లీలో బుధవారం చర్చించింది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వం వహించిన ఈ సమావేశానికి హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్, రక్షణమంత్రి అరుణ్‌జైట్లీ, విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్, పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. కేబినెట్ సమావేశానికి ముందు ఈ భేటీ జరిగింది. ఉగ్రవాదుల కథ ముగిసినట్టే: కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ ఉగ్రవాదుల దాడి జరిగినప్పటికీ అమర్నాథ్ యాత్ర మరింత భద్రతతో యథావిధిగా కొనసాగుతుందని ప్రధానమంత్రి కార్యాలయ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ ప్రకటించారు. కశ్మీర్ ఉగ్రవాదం చివరిదశలో ఉందని, గత రెండు మూడు వారాలుగా భారత సైన్యం ఎంతో ప్రగతి సాధించిందని ప్రకటించారు. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి హంస్రాజ్ అహిర్తోపాటు ఆయన శ్రీనగర్‌లో బుధవారం విలేకరులతో మాట్లాడుతూ ప్రధాని మోదీ ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తున్నారని వెల్లడించారు. జాతి మొత్తం కశ్మీర్‌కు బాసటగా నిలుస్తుందని మంత్రి అన్నారు. గో రక్షకులను యుద్ధానికి పంపండి అమర్నాథ్ ఘటనపై ఉద్ధవ్ ఠాక్రే ముంబై: గోసంరక్షణ పేరుతో హత్యలు చేస్తున్న గోరక్షకులను ఉగ్రవాదులతో యుద్ధం చేయడానికి పంపించాలని శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. అమర్నాథ్ యాత్రికులపై జరిగిన ఉగ్రదాడి గురించి స్పందిస్తూ ఆయన పైవిధంగా అన్నారు. ‘రాజకీయాల్లో క్రీడలు, సాంస్కృతిక విషయాల గురించి చర్చించవద్దని బీజేపీ చెబుతుంది. ఇప్పుడు మతం, రాజకీయాలు కలిసి ఉగ్రదాడి రూపంలో వచ్చాయి. ఉగ్రవాదుల వద్ద ఆయుధాలు కాకుండా గోమాంసం ఉండుంటే వారు ఈపాటికే గో రక్షకుల చేతిలో చచ్చేవారా? ఈ మధ్యకాలంలో గోరక్షకుల అంశం తీవ్రంగా మారుతోంది. అలాంటప్పుడు ఉగ్రవాదులతో పోరాడమని గోరక్షకులనే ఎందుకు పంపకూడదు? ’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు ఠాక్రే. ముగ్గురు ఉగ్రవాదుల హతం జమ్ము కశ్మీర్లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. బుద్గామ్ జిల్లాలోని రాద్ గ్రామంలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య హోరాహోరీగా కాల్పులు జరిగాయి. సైనికులు ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చారు. వారి నుంచి ఆయుధాలు, పేలుడుపదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. మిగతా ఉగ్రవాదుల కోసం భద్రతాబలగాలు గాలింపుచర్యలు ముమ్మరం చేశాయి. మంగళవారం సాయంత్రం ఇరు వర్గాల మధ్య కాల్పులు మొదలవగా, బుధవారం కూడా కొనసాగాయి. తనిఖీల్లో భాగంగా భద్రతాదళాలు ఒక ఇంటిలో సోదాలు జరపగా, అందులో ఉన్న ఉగ్రవాదులు సైనికులు కాల్పులు జరిపారు. వెంటనే అప్రమత్తమైన సీఆర్పీఎఫ్ జవాన్లు దాడిని తిప్పి ముష్కరులను హతమార్చారు. మృతులను జావిద్ షేక్, దావూద్, అఖిల్‌గా గుర్తించారు. జావిద్ హిజ్బుల్ జిల్లా కమాండర్‌గా పనిచేస్తున్నాడు. ఇద్దరు సైనికులూ బలి పాకిస్థాన్ సైన్యం మరోసారి దుస్సాహసం చేసింది. బుధవారం నియంత్రణ రేఖ వెంబడి ముందస్తు హెచ్చరికలేవీ లేకుండా కాల్పులు జరిపింది. నేరుగా భారత జవాన్లపై గురి చూసి కాల్పులు జరిపినట్లు సమాచారం. ఈ కాల్పుల్లో ఇద్దరు భారత జవాన్లు అమరులయ్యారు. కేరన్ సెక్టర్లో కుప్వారా వద్ద ఈ దుర్ఘటన జరిగింది. హిజ్బుల్ ఉగ్రవాదులను భారత్ దళాలు మట్టుబెట్టినందుకు ప్రతీకారంగా ఈ దాడి చేసినట్టు తెలుస్తోంది. -
దక్షిణ కశ్మీర్లో సైన్యం కార్డన్ సెర్చ్
-
దక్షిణ కశ్మీర్లో సైన్యం కార్డన్ సెర్చ్
శ్రీనగర్: దక్షిణ కశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలో భద్రతా దళాలు కూంబింగ్ చేస్తుండగా మిలిటెంట్లు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఒక పౌరుడు మృతి చెందగా, ముగ్గురు సైనికులు గాయాలపాలయ్యారు. ఉగ్రవాదులు ఇళ్లలో నక్కి భద్రతా దళాలపై దాడులు చేస్తున్న నేపథ్యంలో ఆర్మీ, సీఆర్పీఎఫ్లతో కూడిన దళాలు షోపియాన్‌లోని 20కి పైగా గ్రామాల్లో గురువారం కార్డన్ సెర్చ్ ప్రారంభించాయి. హెలికాప్టర్లు, డ్రోన్లతో గగనతలం నుంచి గాలిస్తుండగా.. 4 వేల మందికి పైగా సైనికులు ప్రతి ఇంటినీ జల్లెడ పడుతున్నారు. ఈ నేపథ్యంలో షోపియాన్‌లోని చౌదరి గుండ్, కెల్లార్ ప్రాంతాల్లో రివర్స్ స్వీప్ (కూంబింగ్ అనంతరం మరోమారు అకస్మాత్తుగా సోదాలు చేపట్టడం) చేస్తుండగా.. నక్కి ఉన్న మిలిటెంట్లు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. దీంతో ముగ్గురు జవాన్లు, ఓ పౌరుడికి గాయాలయ్యాయి. వెంటనే తేరుకున్న దళాలు చుట్టుపక్కల ఉన్న బృందాలకు సమాచారమిచ్చి.. ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. గాయాలపాలైన పౌరుడు కొద్ది సేపటి తర్వాత మృతిచెందాడు. -
ఎందుకు దక్షిణ కశ్మీరం రగిలిపోతోంది?
శ్రీనగర్: కొన్నేళ్ల నుంచి ప్రశాంత పరిస్థితులతో కొనసాగుతున్న దక్షిణ కశ్మీరం ఇప్పుడు కల్లోలంగా మారింది. పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీకి ఆయువు పట్టుగా ఉన్న ప్రాంతాల్లో ఇప్పుడు మిలెటెన్సీ పురివిప్పింది. యువకులు వీధుల్లోకి వచ్చి రాళ్లు రువ్వటం, మిలిటెంట్లు, భద్రతా బలగాల మధ్య ఎన్కౌంటర్లు నిత్యకృత్యం అయ్యాయి. సోషల్ మీడియా ద్వారా విశేష ప్రాచుర్యం సంపాదించుకన్న హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ 21 ఏళ్ల బుర్హాన్ వనిని శుక్రవారం సైనిక బలగాలు ఎన్కౌంటర్ చేయడంతో తాజా హింసాకాండ ప్రజ్వరిల్లింది. ఈ తాజా హింసాకాండలో ఇప్పటికే 21 మంది మరణించారు. ఈ ఏడాది కాశ్మీర్ మొత్తంలో 89 మంది స్థానిక మిలిటెంట్లు క్రియాశీలక పాత్ర నిర్వహిస్తుండగా, వారిలో 60 మంది దక్షిణ కాశ్మీర్‌కు చెందిన వారే. పోలీసుల లెక్క ప్రకారం మొత్తం కశ్మీర్లో 70 మంది విదేశీ మిలిటెంట్లు పనిచేస్తుండగా, వారిలో దాదాపు 25 మంది దక్షిణ కశ్మీర్లో పనిచేస్తున్నారు. దక్షిణ కశ్మీర్‌లోని పుల్వామా, అనంత్‌నాగ్, సోఫియాన, కుల్గామ్ ప్రాంతాలు మిలిటెన్సీతో రగిలిపోతున్నాయి. ఎందుకు ఇలా జరుగుతోంది? దక్షిణ కశ్మీర్ మిలిటెన్సీకి ఎందుకు హాటబెడ్గా మారిపోయింది? 2014 చివరలో జరిగిన కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల నాటి నుంచే దక్షిణ కశ్మీర్లో మిలిటెన్సీ పెరుగుతూ వచ్చింది. నాటి ఎన్నికల్లో జమాతి ఇస్లామి పార్టీకి చెందిన మెజారిటీ వర్గం ముఫ్తీ కుటుంబం నాయకత్వంలోని పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీలో చేరిపోయింది.‘ఆజాది’ నినాదంతో ముందుకొచ్చిన జమాతి ఇస్లామి పార్టీ హిజ్బుల్ ముజాహిదీన్లకు బహిరంగంగానే మద్దదిస్తున్న విషయం తెల్సిందే. ఎన్నికల అనంతరం పీడీపీ పార్టీ భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోవడం అటు పీడీపీలోని జమాతీ ఇస్లామీలోని మాజీలకు, ఇటు జమాతీ ఇస్లామీ పార్టీ క్యాడర్‌కు మింగుడు పడలేదు. దక్షిణ కశ్మీర్‌లోనే ఎక్కువ పట్టు కలిగిన ఈ వర్గం మిలెటెన్సీ వైపు మళ్లీ మొగ్గుచూపింది. భద్రతా బలగాలు మానవ హక్కులను హరించివేయడం కూడా వారి మిలిటెన్సీకి ఆజ్యం పోసింది. ప్రస్తుతం దక్షిణ కశ్మీర్‌లోని క్రియాశీలకంగా పనిచేస్తున్న మిలెటెంట్లలో ఎక్కువ మంది జమాతీ కుటుంబాల నుంచి వచ్చిన వారే ఉన్నారు. 1941లో లాహోర్‌లో ప్రాణం పోసుకున్న జమాతీ ఇస్లామీ 1953లో జమ్మూ కశ్వీర్‌లో తన యూనిట్‌ను ఏర్పాటు చేసుకుంది. ఇది క్రమంగా విస్తరిస్తుండడంతో 1975లో ఎమర్జెన్సీ సందర్భంగా అప్పటి ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ ఈ సంస్థను నిషేదించింది. మళ్లీ అది 1989లో మరోసారి విజృంభించింది. హిజ్బుల్ ముజాహిదీన్లకు అప్పుడు బహిరంగంగా మద్దతు ప్రకటించింది. 1990లో భారత ప్రభుత్వం మరోసారి దీన్ని నిషేధించింది. అప్పటి నుంచి సంస్థ నాయకులపై అణచివేత పెరుగుతూ వచ్చింది. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా జమాతీ ఇస్లామీ మద్దతుదారులు ముఫ్తీ కుటుంబం నాయకత్వంలోని పీడీపీకి మద్దతు ఇచ్చారు. ఆ పార్టీ ఎన్నికల అనంతరం బీజీపీతో పొత్తుపెట్టుకోవడం వారికి కోపం తెప్పించింది. వారంతా మళ్లీ దక్షిణ కశ్మీర్లో ఆయుధాలు పట్టుకున్నారు. -
దక్షిణ కాశ్మీరం...
అడవి తల్లి సిగలో విరిసిన పువ్వు.... అందాల ఆదిలాబాద్ జిల్లా అడవుల సోయగం పచ్చదనం పరుచుకుంది.. గిరిజనుల స్వచ్ఛతాగుణం మెచ్చుకుంది..! ఆధ్యాత్మికత అనువణువునా నింపుకున్న ఆలయం.. ఆదిలాబాద్ జిల్లా గోపురం ఆలయాల ఖిల్లా ఇది.. అడవి తల్లీ దైవమే.. అనువుణువునా భక్తిభావమే..!! బ్రహ్మ చెక్కిన అందాలే దిగదుడుపు.. నిర్మల్ కొయ్య బొమ్మల అందాల ముందు.. చారిత్రక కట్టడాలు.. గతమెంతో ఘనవైభవం అనుభవించిన చరిత్ర సాక్ష్యాలు..!!! నాలుగు లైన్ల జాతీయ రహదారి.. ఒంపుసొంపుల కెరమెరి ఘాట్ రోడ్ల అందం.. ఎత్తై కుంటాల జలపాతం.. భీమ్ పురిటి గడ్డ జోడేఘాట్ పరిసరాల తన్మయత్వం. ఇలా.. చెప్పుకుంటూ పోతే... జిల్లాలో అనువణువునా అద్భుతాలే. ప్రకృతి రమణీయ అందాల ఆదిలాబాద్ జిల్లా ఉత్తర భారతదేశవాసులు దక్షిణానికి వచ్చేటప్పుడు ముఖద్వారంలా స్వాగతం పలుకుతోంది. దేశానికి ఉత్తర పైభాగంలో అందం కాశ్మీర్ అయితే.. దక్షిణాన తెలంగాణకు పైభాగంలో ఆదిలాబాద్ జిల్లాయే. ఈ జిల్లాను దక్షిణ కాశ్మీరం అని స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల పేర్కొనడం గమనార్హం. టూరిజం సర్క్యూట్ టూర్ ఏర్పాటుకు పర్యాటక శాఖ ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో జిల్లా అందాలపై ప్రత్యేక కథనం. - ఆదిలాబాద్ ఒంపు సొంపుల కెరమెరి ఘాట్ సిర్పూర్ (యు)లోని మిట్టే జలపాతం ఒకే చోట ఏడు జలపాతాలు కలిగి ఉండడం విశేషం. కెరమెరిలో శంకర్‌లొద్ది గుహ ప్రసిద్ధి గాంచింది. శిథిలమైన ఈ గుహలో నుంచి వెలితే మహారాష్ట్రలోని ఔరంగాబాద్, మరో పక్క నిర్మల్ గుహలు, ఇంకో పక్క వరంగల్ కాకతీయ గుహలు తారసపడతాయని అక్కడి వారు చెప్పుకుంటారు. నార్నూర్‌లోని కుండాయి జలపాతం, కెరమెరిలోని బోదర, సిర్పూర్ (యు)లోని సప్తగుండాల వాటర్‌ఫాల్, నేరడిగొండలోని గాయత్రీ జలపాతం, కెరమెరి ఘాట్ రోడ్ల అందాలు చూసేందుకు ప్రజలు చెట్టుపుట్టలను దాటుకుని వెళ్లి ఆహ్లాదం పొందుతారు. ఆదిలాబాద్ పట్టణంలో ఖానాపూర్ చెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా మార్చే ప్రతిపాదనలు ఉన్నాయి. శివ్వారం అభయారణ్యం వేమనపల్లి మండలంలోని శివ్వారం అభయారణ్యానికి ప్రపంచ ప్రఖ్యాతి ఉంది. ఇక్కడ మొదటిసారి డైనోసర్ అస్థికలు(ఫాజిల్స్) లభించాయి. ప్రస్తుతం ఇవి హైదరాబాద్‌లోని బిర్లా ప్లానిటోరియంలో ప్రదర్శనకు ఉంచారు. దట్టమైన అడవి ఉండడంతో పర్యాటకంగా అభివృద్ధికి నోచుకోవడం లేదు. ఆలయాలకు జిల్లా నిలయం జైనథ్ లక్ష్మీనారాయణ స్వామి ఆలయం ప్రత్యేకతను కలిగి ఉంది. కార్తీక మాసంలో సూర్య భగవానుడే సూటిగా దిగి వచ్చి తన కిరణాలతో స్వామి చరణములను తాకుతాడు. భక్తులు ప్రతీ ఏడాది ఈ సమయం కోసం ఎదురు చూస్తుంటారు. 11, 12వ శతాబ్దంలో నిర్మించారని చెప్పుకుంటారు. పల్లవులు, చోళుల కాలంలో ఈ ఆలయం నిర్మితమైంది. జైనులు హస్తగతం చేసుకున్న అనంతరం జైనథ్ అనే పేరు వచ్చింది. కొంతకాలం కాకతీయులు కూడా పాలించారు. పూర్తిగా నల్లరాయితో నిర్మించారు. ఇక్కడ 35 ఎకరాల పరిధిలో కోనేరు ఉంది. దండేపల్లి మండలం గూడెంలో సత్యనారాయణస్వామి ఆలయం, దిలావర్పూర్లో కదిలే పాపహరేశ్వరాలయం, ఇంద్రవెల్లిలో నాగోబా ఆలయం, బెల్లంపల్లి బుగ్గ రాజరాజేశ్వరస్వామి ఆలయం, సారంగాపూర్‌లోని అడెల్లి పోచమ్మ ఆలయం నిత్యం భక్తులతో రద్దీగా ఉంటాయి. కవ్వాల్ అభయారణ్యం... దట్టమైన వనం దేశవ్యాప్తంగా పులుల సంరక్షణ కోసం ఉద్యమం నడుస్తుండగా జిల్లా కూడా పులల సంరక్షణకు కేంద్రంగా ఉండడంతో దేశాన్ని ఆకర్షిస్తుంది. జన్నారంలోని కవ్వాల్ అభయారణ్యం 2012లో టైగర్ జోన్(పులల సంరక్షణ ప్రదేశం)గా గుర్తించారు. 894 చదరపు కిలోమీటర్ల పరిధిలో టైగర్‌జోన్ విస్తరించి ఉంది. దేశంలో 42వది ఈ కవ్వాల్ టైగర్‌జోన్. తెలంగాణ రాష్ట్రంలో టైగర్‌జోన్ ఇది ఒక్కటే కావడం విశేషం. ఆంధ్రప్రదేశ్‌లో శ్రీశైలంలో టైగర్‌జోన్ ఉంది. కాగా మహారాష్ట్రలోని తాడ్వాయి టైగర్‌జోన్ నుంచి మన టైగర్‌జోన్‌కు పులులు వచ్చేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ జోన్ పరిధిలో 12 రిసార్ట్లు, రెస్టారెంట్లు ఏర్పాటు చేశారు. పర్యాటకులను ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ అభయారణ్యంలో జింకలు, దుప్పులు, నీల్గాయి, చిరుతపులులు, ఎలుగుబంట్లు, అడవిదున్నలు, సాంబారులు, రేసుకుక్కలు, నెమళ్లు, ముళ్లపందులు, అడవిపందులు, అడవిపిల్లులు, అడవి కోళ్లు తదితరాలు ఉన్నాయి. అంతేకాదు రకరకాల పక్షులున్నాయి. దుంగపల్లి, కలపకుంటలో ఎత్తై వాచ్టవర్లను నిర్మించారు. వీటి పైనుంచి అడవి అందాలు తిలకించవచ్చు. దేశంలో రెండో సరస్వతీ క్షేత్రం.. బాసరలో దేశంలో రెండే రెండు సరస్వతీ క్షేత్రాలు ఉన్నాయి. ఒకటి కాశ్మీర్లో ఉండగా.. రెండవది మన జిల్లాలోని బాసరలోనే ఉంది. పౌరాణిక ఆధారాలను అనుసరించి.. వ్యాసమహర్షి దక్షిణ భారతదేశానికి వచ్చినప్పుడు గోదావరి నది ఒడ్డున ఉన్న స్థలాన్ని తన తపస్సుకు అనువైనదిగా ఎంచుకున్నారు. ప్రతీరోజు మూడు పిడికిళ్ల ఇసుకను గోదావరి నుంచి తీసుకువచ్చి లక్ష్మి, పార్వతి, సరస్వతీ మూర్తుల విగ్రహాలను రూపొందించార ు. అక్కడే ఉంటూ నిత్యం పూజలు చేసేవారు. అలా అది ఆధ్యాత్మిక స్థలంగా మారింది. కాలక్రమేణా ధ్వంసమైన ఈ దేవాలయాన్ని తిరిగి ఓ భక్తుడు పునరుద్ధరించారని చె ప్తుంటారు. అనంతర కాలంలో జగద్గురు, శృంగేరి శారదా పీఠాధిపతులు విద్యారణ్యస్వామి ఆలయ పునరుద్ధరణ చేసి సరస్వతీ మాత విగ్రహాన్ని ప్రతిష్టించారు. ప్రస్తుతం బాసరకు అనేక రాష్ట్రాల నుంచి భక్తులు వేల సంఖ్యలో తరలివస్తుంటారు. ఇక్కడ పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తే విద్యాప్రాప్తి కలుగుతుందని భక్తుల విశ్వాసం. వచ్చే సంవత్సరం జరగనున్న పుష్కరాలు స్థానిక గోదావరి ఒడ్డున సందడి చేయనున్నాయి. జాతీయ రహదారి అందాలు దేశంలోనే అతి పెద్ద జాతీయ రహదారి నం.44. ఈ రహదారి జిల్లా గుండానే వెళ్తుంది. ఆదిలాబాద్, నిర్మల్ పట్టణాల మీదుగా నిజామాబాద్ జిల్లాకు వెళ్తుంది. నాలుగు లైన్ల ఈ రహదారి అందాలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. విశాలమైన రోడ్లు ప్రయాణ సౌలభ్యాన్ని పెంచాయి. వంపులు తిరిగిన చోట్ల ఆ అందాలను చూసేందుకు రెండు కళ్లూ చాలవంటే అతిశయోక్తి కాదు. రాష్ట్రంలోనే ఎత్తై జలపాతం కుంటాల రాష్ట్రంలోనే ఎత్తై జలపాతం కుంటాల కావడం గమనార్హం. ఈ జలపాతం కడెం నదీ ప్రవాహంలో ఉంది. నేరడిగొండ నుంచి 12 కిలోమీటర్ల దూరంలో దట్టమైన అడవుల్లో కొండలు, కోనలు దాటి, రాళ్లురప్పలను తాకుతూ కుంటాల ప్రాంతంలో 46 మీటర్ల పై నుంచి నీళ్లు జాలువారుతు చేసే శబ్ధం తన్మయానికి గురి చేస్తుంది. ఈ నది బోథ్ తాలుకాలోని భూతాయి ప్రాంతంలో ప్రారంభమై దారిలో చిన్న వాగులువంకలను తనలో కలుపుకుంటూ కడెం జలశయానికి చేరుకుంటుంది. చివరకు గోదావరిలో కలుస్తుంది. ఈ జలపాతం ప్రాంతంలో గుహలో సోమేశ్వరుడు కొలువై ఉన్నాడు. గతంలో నిజాం నవాబులు ఈ ప్రాంతంలో వేట కోసం వచ్చి విడిది చేసేవారని చెప్పుకుంటారు. బోథ్ మండలంలోని పొచ్చెర జలపాతం సెలయేటి గలగలతో సందడి చేస్తుంది. కడెం జలపాతం వద్ద పర్యాటకంగా కొంత అభివృద్ధి జరిగింది. బోటింగ్, రిసార్ట్, రెస్టారెంట్లు ఏర్పాటు చేయడంతో పర్యాటకుల తాకిడి పెరిగింది. నిర్మల్ కోటలు.. కొయ్యబొమ్మలు నిర్మల్ పట్టణ, పరిసర ప్రాంతంలో నిమ్మనాయుడి పాలన కాలంనాటి శ్యాంఘడ్, బత్తీస్ఘడ్, నిర్మల్కోట, గొలుసుల దర్వాజ, సోన్‌లోని చారిత్రాత్మక వెంకటేశ్వర దక్షిణముఖ హనుమాన్ ఆలయాలు చరిత్రకు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. కోటలను పర్యాటకశాఖ పరంగా అభివృద్ధి చేస్తుండడంతో పురాతన కట్టడాలు భవిష్యత్తరాలకు కూడా కనిపించేలా నిలువనున్నాయి. నిర్మల్ కొయ్య బొమ్మలు జిల్లాకు వన్నెతెస్తున్నాయి. 1955లో కొయ్య బొమ్మల సహకార సంస్థను పాలకొండ గుండాజి, భూసాని నర్సింలు, దన్నూరి పోశెట్టివర్మ ఏర్పాటు చేశారు. నిర్మల్ కొయ్యబొమ్మల సంస్థకు రాష్ట్రపతి అవార్డు పొందింది. భీమ్ జన్మస్థలం.. జోడేఘాట్ జల్ జంగల్ జమీన్ కోసం నైజాంను ఎదురొడ్డి వీరమరణం పొందిన గిరిజనుల ఆరాధ్యదైవం కొమురం భీమ్ జన్మస్థలం జోడేఘాట్‌ను ఆయన పేరు మీద అభివృద్ధి చేస్తామని ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ కొమురం భీమ్ వర్ధంతి సభలో ప్రకటించారు. రూ.25 కోట్లు ఇందుకోసం కేటాయించారు. 200 ఎకరాల్లో స్మృతి వనం ఏర్పాటు చేయనున్నారు. పలు అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. భీమ్ వర్ధంతి రోజు గిరిజనులు ప్రదర్శించే కళా ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకుంటాయి. గుస్సాడీ నృత్యాలతో సందడి చేస్తారు. అయినా అడవి కాచిన వెన్నెలలా.. జిల్లాలో ప్రకృతి అందాలు ఎన్నో కనివిందు చేస్తున్నాయి. సహజసిద్ధ అందాలు ఓవైపు.. మానవ నిర్మిత అద్భుతాలు మరోవైపు అలరిస్తున్నాయి. పర్యాటకులను ఇట్టే ఆకట్టుకునే విశిష్టలతలు జిల్లాలో చాలా ఉన్నాయి. పర్యాటకరంగం కొన్ని దేశాల్లో అమితంగా ఆదాయాన్నిచ్చే వనరు. మన దగ్గరికి వచ్చే సరికి వనరులు ఉన్నా వాటిని ఆదాయ మార్గంగా మలచుకోవడంలో మన పర్యాటక శాఖ విఫలమైందనే చెప్పవచ్చు. అభివృద్ధి జరుగక పర్యాటక అందాలన్నీ అడవికాచిన వెన్నెల్లా మిగిలిపోతున్నాయి. నాలుగు నెలల కిందట తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడం, అధికారంలోకి వచ్చిన ఉద్యమ పార్టీ టీఆర్ఎస్ జిల్లాలో పర్యాటక అభివృద్ధి కోసం మన ఊరు మన ప్రణాళికలో అనేక టూరిజం పనులను గుర్తించారు. ఐదేళ్లలో విడతల వారీగా అభివృద్ధి పనులు చేపట్టాలని యోచించడం శుభపరిణామం. -
షోపియాన్‌లో కొనసాగుతొన్న కర్ఫ్యూ
దక్షిణ కాశ్మీర్‌లోని షోపియాన్ పట్టణంలో విధించిన కర్ప్యూ నేడు కూడా కొనసాగుతోందని జిల్లా కలెక్టర్ బషీర్ అహ్మద్ భట్ట్ గురువారం ఇక్కడ వెల్లడించారు. పట్టణంలో ప్రస్తుతం పరిస్థితులు పూర్తిగా అదుపులో ఉన్నాయని తెలిపారు.ఈ నేపథ్యంలో కర్ఫ్యూను ఈ రోజు మధ్యాహ్నం కొద్ది సేపు సడలించే అవకాశం ఉందని తెలిపారు. అయితే పట్టణంలో విధించిన కర్ప్యూ గురువారం ఎనిమిదో రోజుకు చేరుకుంది. సెప్టెంబర్ 8, 11 తేదీల్లో జరిగిన నేపథ్యంలో షోపియాన్ పట్టణంలో నిరవధిక కర్ఫ్యూని విధించారు. ఆ రెండు ఘటనలపై ఇప్పటికే ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వం విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే.