![Terrorists Kidnaped And Killed Three Policemen In South Kashmir - Sakshi](/styles/webp/s3/article_images/2018/09/21/police_1.jpg.webp?itok=_JniCNt-)
జమ్మూ: జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. దక్షిణ కశ్మీర్‌లో షోపియాన్ జిల్లాలో గురువారం రాత్రి కిడ్నాప్ చేసిన ముగ్గురు పోలీసులను హత్యచేశారు. శుక్రవారం ఉదయం పోలీసులు వారి మృతదేహాలను గుర్తించారు. వివరాల్లోకి వెళ్తే.. నిన్న అర్ధరాత్రి జిల్లాలోని రెండు గ్రామాల్లోకి చోరబడ్డ ఉగ్రవాదులు ముగ్గురు ప్రత్యేక బలగాలకు(ఎస్పీవో) చెందిన పోలీసులతో పాటు మరో పోలీసును అపహరించుకుపోయారు. కిడ్నాప్ అయిన వారిలో పోలీసు మాత్రం గ్రామస్తుల సహాయంతో బయటపడగలిగారు. మిగత వారిని ఉగ్రవాదులు అత్యంత పాశవికంగా హత్యచేశారు.
కిడ్నాప్ చేసిన పోలీసులపై తమ ఉద్యోగాలకు రాజీనామా చేయాల్సిందిగా ఒత్తిడి చేశారని హోం మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. కొద్ది రోజుల ముందు హిజ్బుల్ ముజాహిద్దీన్‌కు చెందిన ఉగ్రవాదులు ఓ వీడియోను పంపారు. ఆ వీడియోలో పోలీసు అధికారులు ఉద్యోగాలకు రాజీనామా చేసి ఆ పత్రాన్ని అన్‌లైన్‌లో ఉంచాలి లేకపోతే తమ చేతుల్లో చనిపోవడానికి సిద్ధంగా ఉండాలని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment