Special Police Officers
-
నీ కడుపుకోత తీర్చలేం.. ‘జై హింద్ మాజీ’
సాక్షి, ఇంటర్నెట్: తల్లి ప్రేమ గురించి పూర్తిగా చెప్పడానికి ఈ ప్రపంచంలో సరైన పదాలు లేవు. అమ్మ అన్న పిలుపులో అమృతం ఉంటుంది. అందుకే దేవతలు సైతం.. ఆ ప్రేమను పొందడానికి మనుషులుగా పుడతారని చెప్పుకుంటారు. అంత గొప్పది తల్లి మనసు. తాను ఎలాంటి స్థితిలో ఉన్నా సరే బిడ్డ క్షేమం, సుఖసంతోషాల గురించి అనునిత్యం పరితపిస్తుంది. తన ఆయుషు కూడా పోసుకుని బిడ్డ నిండ నూరేళ్లు.. చల్లగా బతకాలని కోరుకుంటుంది తల్లి. అటువంటిది.. తన కళ్ల ముందే బిడ్డ మరణిస్తే.. ఆ తల్లి కడుపుకోతను తీర్చే శక్తి ఎవరికి లేదు. ఆమె బాధ ప్రతి ఒక్కరిని కదిలిస్తోంది. తాజాగా ఈ కోవకు చెందిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో విపరీతంగా వైరలవుతోంది. అది చూసి ప్రతి ఒక్కరి మనసు బాధతో విలవిల్లాడుతోంది. ఆ వివరాలు.. శత్రువులతో భీకరంగా పోరాడి వీర మరణం పొందిన అమరులకు బుధవారం ఢిల్లీలో అవార్డులు ప్రదానం చేశారు. ఈ క్రమంలో జమ్మూకశ్మీర్‌లో 2019లో జరిగిన ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్‌లో స్పెషల్ పోలీస్ ఆఫీసర్ బిలాల్ అహ్మద్ మాగ్రే వీర మరణం పొందారు. ఈ ఆపరేషన్‌లో మాగ్రే తీవ్రంగా గాయపడినప్పటికి తన ప్రాణాలను పణంగా పెట్టి.. ముష్కరులతో భీకరంగా పోరాడి.. పౌరులను కాపాడాడు. ఈ క్రమంలో ఆయన మృతి చెందారు. మాగ్రే సాహసానికి గాను కేంద్ర ప్రభుత్వం ఆయనకు సైన్యంలో మూడవ అత్యున్నత పురస్కారం అయిన శౌర్య చక్రను ప్రకటించింది. (చదవండి: ఎన్కౌంటర్లతో దద్దరిల్లిన కశ్మీర్.. ఐదుగురు ఉగ్రవాదులు హతం ) అవార్డుల ప్రదానోత్సవంలో భాగంగా కొడుకు తరఫున ఈ పురస్కారాన్ని ఆందుకోవడానికి మాగ్రే తల్లి సారా బేగం ఢిల్లీకి వచ్చారు. ఇక అవార్డు ప్రకటించిన అనంతరం నాటి భద్రతా ఆపరేషన్‌లో మాగ్రే చూపించిన సాహసం.. ప్రాణాలు పణంగా పెట్టి ముష్కరులను ఎదిరించిన తీరు.. పౌరులను కాపాడిన విధానం గురించి వర్ణించారు. కొడుకు పేరు మైక్‌లో వినపడగానే ఆ తల్లి పేగు కదిలింది. బిడ్డ జీవితం అంతా ఆమె కళ్ల ముందు మెదిలింది. ఇక కుమారుడు లేడనే వాస్తవం ఆమెను ఉక్కిరిబిక్కిర చేసింది. లోపల నుంచి దుఖం తన్నకువచ్చింది. కానీ తాను ఏడిస్తే.. కొడుకు చేసిన సాహసం తక్కువవతుందని భావించిన ఆ తల్లి.. తన బాధను దిగమింగుకుంది. భోరున ఏడవాలని అనిపించినా.. అతి కష్టమ్మీద దుఖాన్ని ఆపుకుంది. అనంతరం రాష్ట్రపతి రామ్నాథ్కోవింద్ చేతుల మీదుగా కుమారుడికి లభించిన శౌర్యచక్ర పతకాన్ని ఆందుకుంది. (చదవండి: 'నేను ప్రధానిగా రాలేదు.. మీ కుటుంబ సభ్యుడిగా వచ్చా') ఆ తల్లి మనోవేదనకు సంబంధించిన వీడియో ప్రతి ఒక్కరిని కదిలిస్తోంది. ఆ వీరమాతకు సెల్యూట్ చేస్తున్నారు నెటిజనులు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా అవార్డు అందుకున్న తర్వాత సారా బేగం తన వెనుక కూర్చున్న సీనియర్ మంత్రులను పలకరించారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆ తల్లిని ఓదార్చారు. (చదవండి: ట్యాక్సీల్లో వాళ్లను తప్ప ఇంకెవ్వరని ఎక్కించుకుని తీసుకురావద్దు!) నాడు ఏం జరిగింది అంటే.. బారాముల్లాలోని ఓ ఇంటి వద్ద ఉగ్రవాదులు ఉన్నారని సమాచారం అందడంతో భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయని అవార్డుకు సంబంధించిన ప్రశంసా పత్రంలో పేర్కొన్నారు. "బిలాల్ అహ్మద్ మాగ్రే స్వయంగా రూమ్ ఇంటర్వెన్షన్ ఆపరేషనల్ పార్టీలో పాల్గొనడానికి స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. అనంతరం ఆయన ఉగ్రవాదుల టార్గెట్ హౌస్‌లో చిక్కుకున్న పౌరులను ఖాళీ చేయించడానికి ప్రయత్నించారు. ఆ సమయంలో దాక్కున్న ఉగ్రవాది అనేక హ్యాండ్ గ్రెనేడ్లను కాల్చాడు’’. ‘‘మాగ్రేతో పాటు అతని కార్యనిర్వాహక సహచరులపై విచక్షణారహితంగా దాడి చేశారు. ఫలితంగా మాగ్రే, అతడి పార్టీ కమాండర్ ఎస్సై అమర్ దీప్, సోనూ లాల్ అనే ఒక పౌరుడికి కూడా తీవ్ర గాయాలయ్యాయి," అని ప్రశంసా పత్రంలో ఉంది. అంతేకాక తీవ్రంగా గాయపడినప్పటికీ, మిస్టర్ మాగ్రే "అత్యంత ధైర్యాన్ని ప్రదర్శించి.. గాయపడిన వారిని, ఇతర పౌరులను బయటికి తరలించాడు" అని పేర్కొంది. దాడిలో తీవ్రంగా గాయపడినప్పటికి. స్పృహ కోల్పోయే వరకు కాల్పులు జరుపుతూనే ఉన్నాడని పేర్కొంది. చదవండి: అంత్యక్రియల కోసం దాచిన సొమ్ము లూటీ.. పోలీసాఫీసర్‌పై ప్రశంసలు -
ఎన్కౌంటర్: ముగ్గురు లష్కరే ఉగ్రవాదుల హతం
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లోని షోపియాన్ జిల్లా బుద్గాం ప్రాంతంలో గురువారం అర్దరాత్రి ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్లో లష్కరే తోయిబాకు చెందిన ముగ్గురు ఉగ్రవాదులు హతం అయ్యారు. అలాగే భారత్ జవాన్ మృతి చెందగా, మరో జవాన్‌కు గాయాలయ్యాయి. షోపియాన్ ప్రాంతంలోని బడిగాంలో ఉగ్రవాదులు దాక్కున్నట్లు జమ్మూకశ్మీర్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో జమ్మూకశ్మీర్ పోలీసులు సైనికులు, సీఆర్పీఎఫ్ బలగాలతో కలిసి గురువారం అర్దరాత్రి కార్డన్ సెర్చ్ ప్రారంభించారు. ఒక ఇంట్లో దాక్కున్న ఉగ్రవాదులు వారిని గాలిస్తున్న భద్రతా బలగాలపై కాల్పులకు దిగారు. దీంతో జవాన్లు ఎదురుకాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ముగ్గురు లష్కరే తోయిబా ఉగ్రవాదులు మరణించారని పోలీసులు చెప్పారు. యూరప్, ఇస్లామిక్ దేశాల ప్రతినిధులు, రాయబారుల బృందం జమ్మూకశ్మీర్ లో సందర్శిస్తున్న సమయంలో ఈ ఎదురుకాల్పులు జరిగాయి. ఎన్కౌంటర్ స్థలంలో పోలీసులు ఉగ్రవాదుల కోసం శుక్రవారం ఉదయం కూడా గాలింపు కొనసాగిస్తున్నారు. చదవండి: ఏనుగులు దాడి: యువకుడి మృతి గల్వాన్ ఘటన: తొలిసారి వివరాలు వెల్లడించిన చైనా -
ఉగ్ర భయం 40మంది పోలీసుల రాజీనామా
శ్రీనగర్ : కశ్మీర్లో ఉగ్రవాదుల చర్యలకు భయపడి దాదాపు 40 మంది పోలీసులు తమ ఉద్యోగాలకు రాజీనామా చేసినట్లు తెలిసింది. గత శుక్రవారం కశ్మీర్ రాష్ట్రంలోని షోపియాన్ జిల్లాలో ఉగ్రవాదులు ముగ్గురు స్పెషల్ పోలీసు అధికారులను(ఎస్పీవో) వారి ఇళ్ల నుంచి అపహరించి దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. పోలీసులను టార్గెట్ చేసిన ఉగ్రవాదులు ‘ఉద్యోగాలకు రాజీనామా చేస్తారా.. చస్తరా’ అని బెదిరిస్తున్న నేపథ్యంలో 40 మంది ఎస్పీవోలు రాజీనామా చేసినట్లు సమాచారం. పోలీసు అధికారులు రిజైన్ చేయడమే కాక ఇందుకు సంబంధించిన వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ రాజీనామా వీడియోలను హోం శాఖ ఖండిచడమే కాక సదరు వీడియోల్లో ఉన్న వారు అసలు ఎస్పీవోలే కాదని ప్రకటించింది. ఒక వేళ వారు నిజంగా పోలీసు అధికారులైనా.. కేవలం 40 మంది రాజీనామాల వల్ల తమకు ఎలాంటి నష్టం లేదని హోం శాఖ పేర్కొంది. ప్రస్తుతం రాష్ట్రంలో 30 వేల మంది ఎస్పీవోలున్నారని వారితో పోల్చుకుంటే రాజీనామా చేసినవారు చాలా తక్కువ అని పేర్కొన్నారు. ప్రభుత్వం పోలీసుల రాజీనామాలను ఆపేందుకు ఎస్పీవోల జీతాలను పెంచాలని భావిస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం 6 వేల రూపాయలు ఉన్న ఎస్పీవోల జీతం త్వరలోనే రూ.10 వేలు చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. అంతేకాక మరిన్ని రాజీనామా వీడియోలో సోషల్ మీడియాలో అప్లోడ్ చేయాడానికి వీలు లేకుండా ఉండేందుకు ప్రభుత్వం దక్షిణ కశ్మీర్లో ఇంటర్నెట్ సేవలను నిలిపేసింది. -
‘నా కొడుకు ఉద్యోగం మానేస్తాడు.. వదిలిపెట్టండి’
శ్రీనగర్ : ‘మా కుమారుడు ఈ ఉద్యోగానికి రాజీనామా చేస్తాడు. తనను వదిలిపెట్టండి. తనే మా కుటుంబానికి ఆధారం. ఇద్దరు ముసలి వాల్లం, ఇద్దరు చిన్నారులు తన మీదే ఆధారపడ్డారు. దయచేసి తనను వదిలి పెట్టండి. ఈ ఉద్యోగం మానేస్తాడు’ అంటూ 70 ఏళ్ల సైదా బేగం కన్నీరు మున్నిరుగా విలపించిన ఆ పాశాన హృదయాలు కరగలేదు. అతి కిరాతకంగా నిసార్ అహ్మద్(44)ని హత్య చేశారు. ఈ హృదయవిదారకరమైన ఘటన కశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలో చోటుచేసుకుంది. ఉగ్రవాదులు ముగ్గురు స్పెషల్ పోలీసు అధికారులను(ఎస్పీవో) శుక్రవారం వారి ఇళ్ల నుంచి అపహరించి దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. అలా ఉగ్రవాదుల చేతిలో హతమైన వారిలో నిసార్ అహ్మద్ ఒకరు. పోలీసులను కిడ్నాప్ చేసిన అనంతరం హిజ్బుల్ ముజాహిదీన్ గ్రూప్ నాయకుడు ఓ వీడియోను విడుదల చేసినట్లు సమాచారం. ఈ వీడియోలో అతడు సదరు పోలీసులను తమ ఉద్యోగాలకు రాజీనామా చేయలని.. లేకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కొవాల్సి వస్తుంది అని తెలిపారు. దాంతో నిసార్ తల్లి, సైదా తమ కుమారుడు తన ఉద్యోగానికి రాజీనామా చేస్తాడని.. అతన్ని విడుదల చేయాల్సిందిగా కోరింది. తన కుటుంబానికి అతనోక్కడే ఆధారం అని తెలిపింది. సైదా అభ్యర్ధనను అంగీకరించిన ఉగ్రవాదుల అతన్ని విడుదల చేస్తామని తెలిపారు. కానీ మాట తప్పి నిసార్‌ని హత్య చేసి అతని కుటుంబానికి తీవ్రం అన్యాయం చేశారు. ఈ ముసలి వయసులో మాకు దిక్కెవరంటూ ఏడుస్తున్న సైదాని సముదాయించడం ఎవరి తరం కాలేదు. -
కశ్మీర్లో ఉగ్ర ఘాతుకం
శ్రీనగర్/న్యూఢిల్లీ: కశ్మీర్ రాష్ట్రంలోని షోపియాన్ జిల్లాలో ఉగ్రవాదులు దురాగతానికి ఒడిగట్టారు. ముగ్గురు స్పెషల్ పోలీసు అధికారులను(ఎస్పీవో) శుక్రవారం వారి ఇళ్ల నుంచి అపహరించి దారుణంగా హత్య చేశారు. పోలీసుల్ని ఇంటి నుంచి అపహరించి హత్య చేయడం ఆ రాష్ట్ర ఉగ్రవాద చరిత్రలో ఇదే మొదటిసారి. ఉగ్రవాదుల వెంటపడ్డ గ్రామస్తులు ‘శుక్రవారం ఉదయం షోపియాన్ జిల్లాలోని బాటాగండ్, కప్రన్ గ్రామాల నుంచి ముగ్గురు ఎస్పీవో సిబ్బందిని ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు. బాటాగండ్ గ్రామస్తులు ఉగ్రవాదుల వెంటపడి పోలీసుల్ని కిడ్నాప్ చేయవద్దని వేడుకున్నారు. ఉగ్రవాదులు గాల్లోకి కాల్పులు జరిపి గ్రామస్తుల్ని బెదిరించారు’ అని అధికారులు చెప్పారు. ఉగ్రవాదులు సమీపంలోని నదిని దాటి తీరం వెంట ఉన్న తోటలో పోలీసుల్ని దారుణంగా హత్యచేశారని వారు తెలిపారు. మృతి చెందిన పోలీసుల్ని కానిస్టేబుల్ నిస్సార్ అహ్మద్, ప్రత్యేక పోలీసు అధికారులు ఫిర్దౌస్ అహ్మద్, కుల్వంత్ సింగ్‌లుగా గుర్తించారు. ఈ హత్య తామే చేసినట్లు హిజ్బుల్ ముజాహిదీన్‌కు చెందినదిగా భావిస్తున్న ట్విటర్ ఖాతాలో ఆ ఉగ్రవాద సంస్థ ప్రకటించుకుంది. ఈ పని హిజ్బుల్ ఉగ్రవాదులదేనని భద్రతా విభాగాలు కూడా నిర్ధారణకు వచ్చాయి. దీనిని పిరికిపందల చర్యగా కశ్మీర్ రేంజ్ పోలీసు ఐజీ స్వయంప్రకాశ్ పాణి పేర్కొన్నారు. ‘భద్రతా దళాల ఏరివేతతో ఉగ్రవాదులు తీవ్ర నిస్పృహలో ఉన్నారు. పాశవికమైన ఈ ఉగ్ర దాడిలో ముగ్గురు సహచరులను కోల్పోయాం. ఈ ఘాతుకానికి పాల్పడిన వారిని త్వరలోనే చట్టం ముందు నిలబెడతాం’ అని ఆయన చెప్పారు. ఆందోళనలో ఎస్పీవోలు ఈ హత్యలు పోలీసు విభాగంలోని కింది స్థాయి ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళనకు తెరతీశాయి. ఆరుగురు ఎస్పీవోలు తమ ఉద్యోగానికి రాజీనామా చేసినట్లు వార్తలొచ్చాయి. తాము ఉద్యోగాలను వదులుకుంటున్నామని సామాజిక మాధ్యమాల్లో ఇద్దరు ఉద్యోగుల వర్తమానాలు వాటికి మరింత ఊతమిచ్చాయి. అయితే అవన్నీ అవాస్తవాలేనంటూ కేంద్ర హోం శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ‘కశ్మీర్లో మొత్తం 30 వేలకు మించి ఎస్పీవోలు పనిచేస్తున్నారు. కొన్ని పరిపాలన కారణాల వల్ల వారి సేవల్ని పునరుద్ధరించని సంఘటనల్ని రాజీనామాలుగా చిత్రీకరించేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయి’ అని హోంశాఖ పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తోన్న బలవంతపు అణచివేత చర్యలతో ఫలితం లేదని పోలీసులు, వారి కుటుంబ సభ్యుల కిడ్నాపు ఘటనల్ని రుజువు చేస్తున్నాయని మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ అన్నారు. చర్చలే కశ్మీర్ సమస్యకు పరిష్కారమని ఆమె పేర్కొన్నారు. సుష్మ–ఖురేషి భేటీ రద్దు భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, పాక్ విదేశాంగ మంత్రి ఖురేషి మధ్య న్యూయార్క్‌లో జరగాల్సిన సమావేశాన్ని భారత్ రద్దుచేసుకుంది. అంతకుముందు కశ్మీర్‌లోని షోపియాన్‌లో ఉగ్రవాదులు ముగ్గురు పోలీసులను అపహరించి కిరాతకంగా హత్యచేయడం, ఉగ్రవాది బుర్హాన్ వనీని కీర్తిస్తూ పాకిస్తాన్ స్టాంపులు విడుదల చేయడమే ఇందుకు కారణమని ప్రకటించింది. ఈ సంఘటనలు పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ నిజ స్వరూపాన్ని, చర్చల ప్రతిపాదన వెనక ఉన్న దుష్ట అజెండాను తేటతెల్లం చేస్తున్నాయని పేర్కొంది. భేటీ రద్దును విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్ ధ్రువీకరించారు. పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ విజ్ఞప్తి మేరకు ఇరు దేశాల విదేశాంగ మంత్రుల సమావేశానికి గురువారం అంగీకరించిన భారత్.. కశ్మీర్లో తాజా పరిస్థితుల నేపథ్యంలో నిర్ణయం మార్చుకుంది. -
ముగ్గురు పోలీసులను హత్యచేసిన ముష్కరులు
-
ముగ్గురు పోలీసుల కిడ్నాప్.. ఆపై హత్య
జమ్మూ: జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. దక్షిణ కశ్మీర్లో షోపియాన్ జిల్లాలో గురువారం రాత్రి కిడ్నాప్ చేసిన ముగ్గురు పోలీసులను హత్యచేశారు. శుక్రవారం ఉదయం పోలీసులు వారి మృతదేహాలను గుర్తించారు. వివరాల్లోకి వెళ్తే.. నిన్న అర్ధరాత్రి జిల్లాలోని రెండు గ్రామాల్లోకి చోరబడ్డ ఉగ్రవాదులు ముగ్గురు ప్రత్యేక బలగాలకు(ఎస్పీవో) చెందిన పోలీసులతో పాటు మరో పోలీసును అపహరించుకుపోయారు. కిడ్నాప్ అయిన వారిలో పోలీసు మాత్రం గ్రామస్తుల సహాయంతో బయటపడగలిగారు. మిగత వారిని ఉగ్రవాదులు అత్యంత పాశవికంగా హత్యచేశారు. కిడ్నాప్ చేసిన పోలీసులపై తమ ఉద్యోగాలకు రాజీనామా చేయాల్సిందిగా ఒత్తిడి చేశారని హోం మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. కొద్ది రోజుల ముందు హిజ్బుల్ ముజాహిద్దీన్‌కు చెందిన ఉగ్రవాదులు ఓ వీడియోను పంపారు. ఆ వీడియోలో పోలీసు అధికారులు ఉద్యోగాలకు రాజీనామా చేసి ఆ పత్రాన్ని అన్లైన్లో ఉంచాలి లేకపోతే తమ చేతుల్లో చనిపోవడానికి సిద్ధంగా ఉండాలని తెలిపారు. -
నలుగురు పోలీసులను ఎత్తుకెళ్లిన మావోలు
ఛత్తీస్‌ఘడ్: నలుగురు ప్రత్యేక స్పెషల్ పోలీసు అధికారులపై మావోయిస్టులు పంజా విసిరారు. ప్రత్యేక పోలీసు అధికారులను మావోయిస్టులు ఎత్తుకెళ్లినట్టు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటన ఛత్తీస్‌ఘడ్‌లోని బీజాపూర్‌లో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ప్రభుత్వంపై పోలీసుల తిరుగుబాటు
గువాహటి: అసోంలో సాయుధ బలగాలు తిరుగుబాటు జెండా ఎగరేశాయి. ఉద్యోగాల క్రమబద్ధీకరణ కోసం ఆ రాష్ట్ర స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్ (ఎస్పీవోలు) చేపట్టిన గువాహటి ముట్టడి కార్యక్రమం హింసాయుతంగా మారింది. తిరుగుబాటును అణిచివేసేందుకు పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు ఆందోళనకారులకు తీవ్రమైన బుల్లెట్ గాయాలయ్యాయి. మరో ముగ్గురు పౌరులుకూడా గాయపడినట్లు తెలిసింది. అసోం రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తోన్న 840 మంది సాయుధ ఎస్పీవోలు సర్వీసును రెగ్యులరైజ్ చేయాలంటూ ఉన్నతాధికారులకు పలుమార్లు వినతులు సమర్పించారు. అవన్నీ బుట్టదాఖలు కావడంతో గువహటిలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్‌ను ముట్టడించాలనే నిర్ణయానికి వచ్చారు. ఆ క్రమంలోనే 340 మంది ఎస్పీవోలు శనివారం రాత్రి దిమా హసావో జిల్లా కేంద్రం నుంచి మూడు డంపర్లు, ఒక ట్రక్కులో గువాహటికి బయలుదేరారు. తతిమావారు మార్గం మధ్యలో ర్యాలీలో చేరారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఉన్నతాధికారులు తిరుగుబాటుదారుల్ని గువాహటిలోకి రానీయకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. 'ఆందోళన విరమించాలనే తమ అభ్యర్థనను ఎస్సీవోలు పెడచెవినపెట్టి కాల్పులకు దిగారని, బదులుగా తాము కూడా కాల్పులు జరపవలిసి వచ్చిందని అసోం ఐజీ(లా అండ్ ఆర్డర్) ఎస్ ఎన్ సింగ్ మీడియాకు చెప్పారు. కాల్పుల్లో ఇద్దరు ఎస్పీవోలు సహా ముగ్గురు పౌరులు గాయపడ్డారని చెప్పారు. జాతీయ రహదారుల్లోని ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకోసం అసోం ప్రభుత్వం 2008లో వందలమంది ఎస్పీవోలను అద్దె ప్రాతిపతికన నియమించుకుంది. ఏళ్లుగా తమతో రకరకాల సేవలు చేయించుకుంటున్న ప్రభుత్వం.. జీతభత్యాలు, సర్వీసు క్రమబద్ధీకరణ విషయాల్లో తమకు అన్యాయం చేస్తోన్నదని ఎస్పీవోలు ఆగ్రహంతో ఉన్నారు. గతేడాది సెప్పెంబర్లోనూ ఎస్పీవోలు ఇదే తరహా తిరుబాటుకు ప్రయత్నించడం, పోలీసులు దానిని అణిచివేయడం గమనార్హం. కాగా, తాజా తిరుగుబాటును తీవ్రంగా పరిగణిస్తున్నామని, అందులో పాలుపంచుకున్న ఎస్పీవోలందరినీ చట్టపరంగా శిక్షిస్తామని ఉన్నతాధికారులు తెలిపారు.