![In Jammu Kashmir Constable Nisar Ahmad Mother Plesed Terrorist To Release Her Son - Sakshi](/styles/webp/s3/article_images/2018/09/22/nisar-ahmad-family-video-kashmir.jpg.webp?itok=m-KCIYUb)
తమ కుమారున్ని విడిచిపెట్టాల్సిందిగా ఉగ్రవాదులను కోరుతున్ననిసార్ అహ్మద్ తల్లి సైదా బేగం
శ్రీనగర్ : ‘మా కుమారుడు ఈ ఉద్యోగానికి రాజీనామా చేస్తాడు. తనను వదిలిపెట్టండి. తనే మా కుటుంబానికి ఆధారం. ఇద్దరు ముసలి వాల్లం, ఇద్దరు చిన్నారులు తన మీదే ఆధారపడ్డారు. దయచేసి తనను వదిలి పెట్టండి. ఈ ఉద్యోగం మానేస్తాడు’ అంటూ 70 ఏళ్ల సైదా బేగం కన్నీరు మున్నిరుగా విలపించిన ఆ పాశాన హృదయాలు కరగలేదు. అతి కిరాతకంగా నిసార్ అహ్మద్(44)ని హత్య చేశారు. ఈ హృదయవిదారకరమైన ఘటన కశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలో చోటుచేసుకుంది. ఉగ్రవాదులు ముగ్గురు స్పెషల్ పోలీసు అధికారులను(ఎస్పీవో) శుక్రవారం వారి ఇళ్ల నుంచి అపహరించి దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. అలా ఉగ్రవాదుల చేతిలో హతమైన వారిలో నిసార్ అహ్మద్ ఒకరు.
పోలీసులను కిడ్నాప్ చేసిన అనంతరం హిజ్బుల్ ముజాహిదీన్ గ్రూప్ నాయకుడు ఓ వీడియోను విడుదల చేసినట్లు సమాచారం. ఈ వీడియోలో అతడు సదరు పోలీసులను తమ ఉద్యోగాలకు రాజీనామా చేయలని.. లేకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కొవాల్సి వస్తుంది అని తెలిపారు. దాంతో నిసార్ తల్లి, సైదా తమ కుమారుడు తన ఉద్యోగానికి రాజీనామా చేస్తాడని.. అతన్ని విడుదల చేయాల్సిందిగా కోరింది. తన కుటుంబానికి అతనోక్కడే ఆధారం అని తెలిపింది. సైదా అభ్యర్ధనను అంగీకరించిన ఉగ్రవాదుల అతన్ని విడుదల చేస్తామని తెలిపారు. కానీ మాట తప్పి నిసార్‌ని హత్య చేసి అతని కుటుంబానికి తీవ్రం అన్యాయం చేశారు. ఈ ముసలి వయసులో మాకు దిక్కెవరంటూ ఏడుస్తున్న సైదాని సముదాయించడం ఎవరి తరం కాలేదు.
Comments
Please login to add a commentAdd a comment