kidnap and murder
-
రాజస్తాన్‌లో కిడ్నాప్.. హరియాణాలో హత్య
జైపూర్: హరియాణాలో అత్యంత దారుణమైన ఘటన జరిగింది. గో సంరక్షకులుగా అనుమానిస్తున్న కొందరు రాజస్తాన్‌కు చెందిన ఇద్దరు ముస్లింలను కిడ్నాప్ చేసి తీసుకువెళ్లినట్టు ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత వారిద్దరి కాలిన మృతదేహాలు ఒక కారులో లభించడం కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించిన అరడజను మందికిపైగా బజరంగ్ దళ్ కార్యకర్తల్ని రాజస్తాన్ పోలీసులు అదుపులోనికి తీసుకొని విచారిస్తున్నారు. ఈ హత్యలను రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఖండించారు. ఈ దారుణానికి పాల్పడిన వారిపై కఠినచర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాజస్తాన్‌లోని భరత్పూర్ జిల్లా ఘట్‌మీక గ్రామానికి చెందిన నజీర్ (25), జునైద్ అలియాస్ జునా (35)లను బుధవారం గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. గురువారం వారిద్దరి మృతదేహాలు హరియాణాలోని భివానిలో లోహారు ప్రాంతంలో ఒక దగ్ధమైన కారులో కనిపించాయి. బజరంగ్ దళ్ కార్యకర్తలు ఆ ఇద్దరు ముస్లిం యువకుల్ని కిడ్నాప్ చేశారని వారి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. వారి ఫిర్యాదు మేరకు అరడజనుకుపైగా బజరంగ్దళ్ కార్యకర్తల్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ‘‘వారికి ఈ నేరంలో ప్రమేయం ఉందో లేదో తేలాల్సి ఉంది’’ అని పోలీసు ఇన్స్పెక్టర్ జనరల్ గౌరవ్ శ్రీవాస్తవ చెప్పారు. మృతి చెందిన వారిలో జునైద్‌కి నేరచరిత్ర ఉందని, ఐదుకి పైగా కేసుల్లో అతను నిందితుడని చెప్పారు. రింకూ సైనీ అనే నిందితుడిని అరెస్టు చేశామన్నారు. -
ఆ మానవ మృగాన్ని బయటకు వదలొద్దు!
ఎనిమిది నెలల పసికందు అనే కనికరం లేకుండా.. పాత గొడవలు పట్టుకుని ఎన్నారై కుటుంబాన్ని పొట్టనబెట్టన బెట్టుకున్న మానవ మృగంపై నేరారోపణలు నమోదు అయ్యాయి. నిందితుడు మాన్యుయెల్ సల్గాడో(48)పై నాలుగు అభియోగాలు, అదనంగా మరో రెండు నమోదు అయినట్లు అధికారులు వెల్లడించారు. ఇక సోమవారం వీడియో విచారణ సందర్భంగా.. కేసు తీవ్రత దృష్ట్యా నిందితుడికి తన తరపున వాదనలు వినిపించేందుకు న్యాయవాది నియామకానికి కేవలం రెండు రోజుల గడువు మాత్రమే ఇచ్చింది మెర్స్‌డ్ కౌంటీ డిస్ట్రిక్ అటార్నీ కార్యాలయం. పంజాబ్‌కు చెందిన ఎన్నారై సిక్కు కుటుంబంలో జస్దీప్ సింగ్(36), అతని భార్య జస్లీన్ కౌర్, ఎనిమిది నెలల కూతురు ఆరూహీ ధేరి, దగ్గరి బంధువు అమన్ దీప్ సింగ్(39)లను తుపాకీ చూపించి మరీ కిడ్నాప్ చేసి.. ఆపై దారుణంగా హతమార్చాడు సల్గాడో. కిడ్నాప్ అయిన వాళ్ల కోసం పోలీసులు గాలిస్తున్న క్రమంలో.. ఈ వ్యవహారం విషాదంగా ముగిసింది. నలుగురు మృతదేహాలను మెర్స్‌డ్ కౌంటీలోని ఓ పండ్ల తోటలో పడేశారు. నిందితుడిని పోలీసులు అదుపు తీసుకునే సమయంలో ఆత్మహత్యకు ప్రయత్నించగా.. వైద్యం అందడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. ఇక కిడ్నాప్‌నకు సంబంధించిన వీడియో సైతం పోలీసుల ద్వారా బయటకు రిలీజ్ అయ్యింది. ఈ నేపథ్యంలో నిందితుడిని వదల్లదంటూ బాధిత కుటుంబం, మెర్స్‌డ్ అధికారుల్ని వేడుకుంటోంది. జీవిత ఖైదుగానీ, మరణ శిక్షగానీ ఆస్కారం ఉండొచ్చని న్యాయ నిపుణులు చెప్తున్నారు. ఇక నాలుగు హత్యలకు సంబంధించి సల్గాడోపై వేర్వేరు కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది. అతని సోదరుడు ఆల్బర్ట్ సల్గాడోపై సైతం కుట్రకు సహకరించిన నేరం, ఆధారాలు మాయం చేసే యత్నాల కింద కేసు నమోదు అయ్యింది. సల్గాడో ఒకప్పుడు సింగ్ కుటుంబం నిర్వహించిన ట్రక్కు వ్యాపారంలో పనిచేశాడు. అప్పటి నుంచే వాళ్లతో అతనికి గొడవలు ఉన్నాయి. ఈ నేపథ్యమే ఈ దారుణానికి కారణమైందని అధికారులు, సింగ్ కుటుంబ బంధువులు చెప్తున్నారు. కిడ్నాప్, హత్య కేసులతో పాటు అక్రమంగా ఆయుధాలు కలిగి ఉండటం, ట్రక్కుకు నిప్పంటించడం లాంటి అభియోగాలు ఎదుర్కొనున్నాడు. ఈ నేరారోపణలు రుజువైతే గనుక.. పెరోల్ కూడా దొరక్కుండా జీవితాంతం సల్గాడో జైలులోనే మగ్గాల్సి ఉంటుందని మెర్స్‌డ్ కౌంటీ డిస్ట్రిక్ అటార్నీ కార్యాలయం వెల్లడించింది. ఇక మరణ శిక్ష విధింపు అనేది న్యాయమూర్తుల విచక్షణపై ఆధారపడి ఉంటుందని తెలిపింది. ఎన్నారై కుటుంబంపై దారుణానికి తెగ బడే నెలల ముందు నుంచి.. వాళ్లను వెంబడించాడని, వాళ్ల కదలికలను నిశితంగా గమనించాడని పోలీసులు వెల్లడించారు. సల్గాడో గతం మొత్తం నేర చరిత్రేనని పోలీసులు చెప్తున్నారు. దొంగతనం, ఆయుధాల చోరీ, అక్రమ ఆయుధాల్ని కలిగి ఉన్న ఆరోపణలు రుజువు కావడంతో పదేళ్లకు పైగా జైలు జీవితం గడిపాడు. ఓ ఇంట్లో చొరబడిన కేసులో 2005లో జైలుకు వెళ్లాడు. 2007లో అతనికి పదకొండేళ్ల శిక్ష పడింది. ఆ తర్వాత దానిని ఎనిమిదేళ్లకు కుదించారు. దీంతో 2015 నుంచి 2018 వరకు పెరోల్ మీద అతను ముందుగానే అతను బయటకు వచ్చాడు. ఈ నేపథ్యంలో తాజా నేరాల తీవ్రత ఆధారంగా అతను మళ్లీ బయటకు వచ్చే అవకాశాలు లేవని న్యాయ నిపుణులు చెప్తున్నారు. -
ఏడేళ్ల చిన్నారిపై హత్యాచారం
థానే: ఏడేళ్ల చిన్నారిని కిడ్నాప్ చేసి, హత్యాచారం చేసిన దుర్ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. ఆదివారం ఉదయం చిన్నారి మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు తెలపడంతో నిందితుడు కొరి (30)ని అరెస్ట్ చేశారు. భివండి డీసీపీ రాజ్‌కుమార్ షిండే కథనం ప్రకారం.. కరివాలి గ్రామానికి చెందిన కొరి శనివారం రాత్రి రెండో తరగతి చదువుతున్న ఏడేళ్ల చిన్నారిని కిడ్నాప్ చేశాడు. అనంతరం చిన్నారిని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేసి, బండరాయితో తలపై మోది చంపేశాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. ఆదివారం ఉదయం పొదల మాటున చిన్నారిని మృతదేహాన్ని చూసిన బాటసారులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు కొరిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిపై పోక్సో సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. -
ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం.. ఆపై హత్య?
కురబలకోట (చిత్తూరు జిల్లా): చిత్తూరు జిల్లాలో ఘోరం జరిగింది. అభం శుభం తెలియని ఆరేళ్ల చిన్నారిని పాశవికంగా హత్య చేసిన ఘటన పలువురిని కలచి వేసింది. కురబలకోట మండలం చేనేతనగర్‌లోని ఓ కల్యాణ మండపంలో శుక్రవారం ఉద యం 5 గంటలకు జరుగనున్న తమ బంధువుల వివాహానికి బి.కొత్తకోట మండలం గుట్టపాళ్యంకు చెందిన ఎద్దేశరి శిద్దారెడ్డి, అతని భార్య ఉషారాణి, ముగ్గురు కుమార్తె లు వైష్ణవి, వర్షిత, వర్షిణి గురువారం రాత్రే చేరుకున్నారు. పది గంటల తర్వాత ఆఖరి కుమార్తె వర్షిణి(6) కనిపించకుండా పోయింది. ఎవరో కిడ్నాప్ చేసి తీసుకెళ్లారని ముదివేడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉదయం ఆరున్నర గంటల సమయంలో కల్యాణ మండపం వెనుక లోతట్టు ప్రాంతంలో చిన్నారి మృతదేహాన్ని కనుగొన్నారు. కల్యాణ మండపంలోని సీసీ కెమెరాల ఫుటేజీని పోలీసులు పరిశీలించగా.. చిన్నారిని ఓ వ్యక్తి కల్యాణ మండపం వెనుక మరుగుదొడ్ల వైపు తీసుకెళ్లినట్లుగా ఉంది. 15 నిమిషాల తర్వాత అతనొక్కడే తిరిగి మండపంలోకి వచ్చి బయటకు వెళ్లినట్లు సీసీ పుటేజీలో కనిపించింది. దీన్ని బట్టి అతనే చిన్నారిని బలి తీసుకుని ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. చిన్నారి శరీరంపై గాయాలు, గాట్లు, కాళ్లు చేతులపై గీరిన గాయాలు కన్పిస్తుండడంతో లైంగికదాడికి పాల్పడి ఆపై హత్య చేసి ఉండవచ్చని భావిస్తున్నారు. -
సాత్విక్ కేసులో మలుపు.. అది హత్య కాదు!
మాచర్ల: ఆరేళ్ల చిన్నారి సాయి సాత్విక్ సిద్ధు మృతి వ్యవహారంలో షాకింగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. సాయి సాత్విక్ సిద్ధూ హత్యకు గురికాలేదని, ఆ బాలుడు ఆడుకుంటూ వెళ్లి క్వారీ గుంటలో పడి చనిపోయాడని గురజాల డీఎస్పీ శ్రీధర్ బాబు వెల్లడించారు. మాచర్లలో ఈనెల 22న ఇంటిముందు ఆడుకుంటూ సిద్ధూ అదృశ్యమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఓ మహిళ ఇచ్చిన సమాచారంతో సిద్ధు కిడ్నాప్‌కు గురయ్యాడని భావించామని, గుంటూరు రైల్వే స్టేషన్లో సీసీటీవీ ఫుటేజీ పరిశీలించగా.. ఓ వ్యక్తి భుజాలపై ఉన్న బాలుడిని సాత్విక్ అనుకున్నామని ఆయన వివరించారు. అయితే, విచారణలో అతను గుంటూరు అరండల్ పేటకు చెందిన మరో బాలుడిని తేలిందని చెప్పారు. అసలు సాత్విక్ కిడ్నాప్‌కు గురికాలేదని, ఇంటి ముందు ఆడుకుంటూ.. ఇంటికి 400 మీటర్ల దూరంలో ఉన్న క్వారీ గుంటలో ప్రమాదవశాత్తు పడిపోయి చనిపోయాడని తెలిపారు. క్వారీ దగ్గర సాత్విక్ ఆడుకుంటున్నప్పుడు చూసిన ప్రత్యక్ష సాక్షులను కూడా విచారించామని, ఆ బాలుడిది హత్య కాదని డీఎస్పీ తెలిపారు. ఈనెల 22న ఇంటిముందు ఆడుకుంటూ సిద్ధు అదృశ్యమైన సంగతి తెలిసిందే. దీంతో బాలుడు కిడ్నాప్ అయ్యాడని భావించారు. 23న గుంటూరు రైల్వే స్టేషన్‌లోని సీసీ కెమెరాల్లో ఓ వ్యక్తి బాలుడిని ఎత్తుకెళుతున్న దృశ్యాలు చూసి.. సాత్విక్ అనుకొని పోలీసులు భ్రమపడ్డారు. ఈ క్రమంలో గురువారం ఉదయం మాచర్ల శివారులోని క్వారీ గుంతలో బాలుడి మృతదేహం లభ్యమవ్వడంతో బాలుడు దారుణ హత్యకు గురైనట్టు తొలుత భావించారు. అయితే, విచారణలో అది నిజం కాదని తేలింది. మాచర్లలోని నెహ్రూనగర్‌లో నివసిస్తున్న వెంకటేశ్వర నాయక్, సరోజ దంపతుల కుమారుడు సాయి సాత్విక్ సిద్ధు. బాలుడి తండ్రి వెంకటేశ్వర నాయక్ వెల్దుర్తి మండలం కండ్లకుంటలోని మోడల్ స్కూల్లో టీచర్‌గా పనిచేస్తూ.. మాచర్లలోని నెహ్రూనగర్ 2వ లైన్లో అద్దెకు ఉంటున్నారు. సిద్ధూ మృతి విషయం తెలియడంతో బాలుడి కుటుంబసభ్యులు గుండెలవిసేలా కన్నీరుమున్నీరవుతున్నారు. -
మరణాన్ని తప్పించిన కవిత్వం
న్యూఢిల్లీ: మరణశిక్ష పడిన ఖైదీ జైల్లో రాసుకున్న కవిత్వం అతని తలరాతను మార్చేసింది. మరణం అంచుల్లో ఉన్న అతను రాసిన కవితలను చదివిన సుప్రీం కోర్టు ధర్మాసనం మనసు కరిగి ఆ ఖైదీకి కింది కోర్టు విధించిన మరణశిక్షను ఇటీవల యావజ్జీవ ఖైదుగా మార్చింది. మహారాష్ట్రకు చెందిన ధ్యానేశ్వర్ సురేష్ బార్కర్ అనే వ్యక్తి 18 ఏళ్ల క్రితం ఓ చిన్నారిని కిడ్నాప్ చేసి అతని తల్లిదండ్రుల్ని భారీగా డబ్బులు డిమాండ్ చేశాడు. అయితే వారు అడిగినంత సొమ్ము ఇవ్వకపోవడంతో ఆ అబ్బాయిని చంపేశాడు. ఈ కేసును విచారించిన కింది కోర్టు బార్కర్‌కు మరణశిక్ష విధించింది. బొంబాయి హైకోర్టు కూడా అతనికి మరణశిక్షను సమర్థించింది. 22 ఏళ్ల వయసులో ఉండగా నేరం చేసిన బార్కర్ గత 18 సంవత్సరాలుగా జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. బొంబాయి హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ బార్కర్ సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. విచారణ సందర్భంగా బార్కర్ తరఫు లాయరు ఆయన రాసిన కవితలను సుప్రీం కోర్టుకు సమర్పించారు. జస్టిస్ ఏకే సిక్రి, జస్టిస్ అబ్దుల్ నజీర్, జస్టిస్ ఎంఆర్ షాలతో కూడిన ధర్మాసనం ఆ కవితలను చదివింది. ‘నేరస్తుడు పశ్చాత్తాప పడుతున్నాడని, మంచి మనిషిగా మారాడని అతని కవితలను బట్టి అర్థమవుతోంది. నేరస్తుడు చేసింది ఎంత పెద్ద ఘోరమో మాకు తెలుసు. అయినా అతనికి మరణ శిక్ష విధించే విషయంలో మమ్మల్ని మేం సంతృప్తి పరచుకోలేకపోతున్నాం’ అని ధర్మాసనం పేర్కొంది. నిందితుడు సమాజంలో భాగం కావాలనుకుంటున్నాడని, నాగరికుడిగా మారాలనుకుంటున్నాడని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్నాక అతనికి మరణశిక్ష విధించడం సరికాదని ధర్మాసనం తన తీర్పులో పేర్కొంది. -
‘నా కొడుకు ఉద్యోగం మానేస్తాడు.. వదిలిపెట్టండి’
శ్రీనగర్ : ‘మా కుమారుడు ఈ ఉద్యోగానికి రాజీనామా చేస్తాడు. తనను వదిలిపెట్టండి. తనే మా కుటుంబానికి ఆధారం. ఇద్దరు ముసలి వాల్లం, ఇద్దరు చిన్నారులు తన మీదే ఆధారపడ్డారు. దయచేసి తనను వదిలి పెట్టండి. ఈ ఉద్యోగం మానేస్తాడు’ అంటూ 70 ఏళ్ల సైదా బేగం కన్నీరు మున్నిరుగా విలపించిన ఆ పాశాన హృదయాలు కరగలేదు. అతి కిరాతకంగా నిసార్ అహ్మద్(44)ని హత్య చేశారు. ఈ హృదయవిదారకరమైన ఘటన కశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలో చోటుచేసుకుంది. ఉగ్రవాదులు ముగ్గురు స్పెషల్ పోలీసు అధికారులను(ఎస్పీవో) శుక్రవారం వారి ఇళ్ల నుంచి అపహరించి దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. అలా ఉగ్రవాదుల చేతిలో హతమైన వారిలో నిసార్ అహ్మద్ ఒకరు. పోలీసులను కిడ్నాప్ చేసిన అనంతరం హిజ్బుల్ ముజాహిదీన్ గ్రూప్ నాయకుడు ఓ వీడియోను విడుదల చేసినట్లు సమాచారం. ఈ వీడియోలో అతడు సదరు పోలీసులను తమ ఉద్యోగాలకు రాజీనామా చేయలని.. లేకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కొవాల్సి వస్తుంది అని తెలిపారు. దాంతో నిసార్ తల్లి, సైదా తమ కుమారుడు తన ఉద్యోగానికి రాజీనామా చేస్తాడని.. అతన్ని విడుదల చేయాల్సిందిగా కోరింది. తన కుటుంబానికి అతనోక్కడే ఆధారం అని తెలిపింది. సైదా అభ్యర్ధనను అంగీకరించిన ఉగ్రవాదుల అతన్ని విడుదల చేస్తామని తెలిపారు. కానీ మాట తప్పి నిసార్‌ని హత్య చేసి అతని కుటుంబానికి తీవ్రం అన్యాయం చేశారు. ఈ ముసలి వయసులో మాకు దిక్కెవరంటూ ఏడుస్తున్న సైదాని సముదాయించడం ఎవరి తరం కాలేదు. -
కశ్మీర్లో ఉగ్ర ఘాతుకం
శ్రీనగర్/న్యూఢిల్లీ: కశ్మీర్ రాష్ట్రంలోని షోపియాన్ జిల్లాలో ఉగ్రవాదులు దురాగతానికి ఒడిగట్టారు. ముగ్గురు స్పెషల్ పోలీసు అధికారులను(ఎస్పీవో) శుక్రవారం వారి ఇళ్ల నుంచి అపహరించి దారుణంగా హత్య చేశారు. పోలీసుల్ని ఇంటి నుంచి అపహరించి హత్య చేయడం ఆ రాష్ట్ర ఉగ్రవాద చరిత్రలో ఇదే మొదటిసారి. ఉగ్రవాదుల వెంటపడ్డ గ్రామస్తులు ‘శుక్రవారం ఉదయం షోపియాన్ జిల్లాలోని బాటాగండ్, కప్రన్ గ్రామాల నుంచి ముగ్గురు ఎస్పీవో సిబ్బందిని ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు. బాటాగండ్ గ్రామస్తులు ఉగ్రవాదుల వెంటపడి పోలీసుల్ని కిడ్నాప్ చేయవద్దని వేడుకున్నారు. ఉగ్రవాదులు గాల్లోకి కాల్పులు జరిపి గ్రామస్తుల్ని బెదిరించారు’ అని అధికారులు చెప్పారు. ఉగ్రవాదులు సమీపంలోని నదిని దాటి తీరం వెంట ఉన్న తోటలో పోలీసుల్ని దారుణంగా హత్యచేశారని వారు తెలిపారు. మృతి చెందిన పోలీసుల్ని కానిస్టేబుల్ నిస్సార్ అహ్మద్, ప్రత్యేక పోలీసు అధికారులు ఫిర్దౌస్ అహ్మద్, కుల్వంత్ సింగ్‌లుగా గుర్తించారు. ఈ హత్య తామే చేసినట్లు హిజ్బుల్ ముజాహిదీన్‌కు చెందినదిగా భావిస్తున్న ట్విటర్ ఖాతాలో ఆ ఉగ్రవాద సంస్థ ప్రకటించుకుంది. ఈ పని హిజ్బుల్ ఉగ్రవాదులదేనని భద్రతా విభాగాలు కూడా నిర్ధారణకు వచ్చాయి. దీనిని పిరికిపందల చర్యగా కశ్మీర్ రేంజ్ పోలీసు ఐజీ స్వయంప్రకాశ్ పాణి పేర్కొన్నారు. ‘భద్రతా దళాల ఏరివేతతో ఉగ్రవాదులు తీవ్ర నిస్పృహలో ఉన్నారు. పాశవికమైన ఈ ఉగ్ర దాడిలో ముగ్గురు సహచరులను కోల్పోయాం. ఈ ఘాతుకానికి పాల్పడిన వారిని త్వరలోనే చట్టం ముందు నిలబెడతాం’ అని ఆయన చెప్పారు. ఆందోళనలో ఎస్పీవోలు ఈ హత్యలు పోలీసు విభాగంలోని కింది స్థాయి ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళనకు తెరతీశాయి. ఆరుగురు ఎస్పీవోలు తమ ఉద్యోగానికి రాజీనామా చేసినట్లు వార్తలొచ్చాయి. తాము ఉద్యోగాలను వదులుకుంటున్నామని సామాజిక మాధ్యమాల్లో ఇద్దరు ఉద్యోగుల వర్తమానాలు వాటికి మరింత ఊతమిచ్చాయి. అయితే అవన్నీ అవాస్తవాలేనంటూ కేంద్ర హోం శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ‘కశ్మీర్లో మొత్తం 30 వేలకు మించి ఎస్పీవోలు పనిచేస్తున్నారు. కొన్ని పరిపాలన కారణాల వల్ల వారి సేవల్ని పునరుద్ధరించని సంఘటనల్ని రాజీనామాలుగా చిత్రీకరించేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయి’ అని హోంశాఖ పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తోన్న బలవంతపు అణచివేత చర్యలతో ఫలితం లేదని పోలీసులు, వారి కుటుంబ సభ్యుల కిడ్నాపు ఘటనల్ని రుజువు చేస్తున్నాయని మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ అన్నారు. చర్చలే కశ్మీర్ సమస్యకు పరిష్కారమని ఆమె పేర్కొన్నారు. సుష్మ–ఖురేషి భేటీ రద్దు భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, పాక్ విదేశాంగ మంత్రి ఖురేషి మధ్య న్యూయార్క్‌లో జరగాల్సిన సమావేశాన్ని భారత్ రద్దుచేసుకుంది. అంతకుముందు కశ్మీర్‌లోని షోపియాన్‌లో ఉగ్రవాదులు ముగ్గురు పోలీసులను అపహరించి కిరాతకంగా హత్యచేయడం, ఉగ్రవాది బుర్హాన్ వనీని కీర్తిస్తూ పాకిస్తాన్ స్టాంపులు విడుదల చేయడమే ఇందుకు కారణమని ప్రకటించింది. ఈ సంఘటనలు పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ నిజ స్వరూపాన్ని, చర్చల ప్రతిపాదన వెనక ఉన్న దుష్ట అజెండాను తేటతెల్లం చేస్తున్నాయని పేర్కొంది. భేటీ రద్దును విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్ ధ్రువీకరించారు. పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ విజ్ఞప్తి మేరకు ఇరు దేశాల విదేశాంగ మంత్రుల సమావేశానికి గురువారం అంగీకరించిన భారత్.. కశ్మీర్లో తాజా పరిస్థితుల నేపథ్యంలో నిర్ణయం మార్చుకుంది. -
హత్యకు దారితీసిన కిడ్నాప్ పథకం
శ్రీరాంపూర్(మంచిర్యాల) : ఓ వ్యక్తిని కిడ్నాప్ చేసి డబ్బులు వసూలు చేయాలన్న ఇద్దరు పాత నేరస్తుల పథకం విఫలమై ఓ యువకుడి హత్యకు దారితీసిన వైనమిది. నస్పూర్ గ్రామ సమీపంలో ఈ నెల 17న జరిగిన గడ్డం శివగౌడ్(22) హత్య కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. కేసు వివరాలను సీఐ ప్రమోద్‌రావు సోమవారం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. శ్రీరాంపూర్ ఏరియా హిమ్మత్‌నగర్‌కు చెందిన లారీ క్లీనర్ తాళ్లపల్లి రాకేశ్‌గౌడ్ అలియాస్ లక్ష్మణ్, సికింద్రాబాద్ తిరుమలగిరికి చెందిన ర్యాకం రమేశ్ కలిసి ఈ హత్య చేశారని తెలిపారు. హతుడు నస్పూర్‌కు చెందిన శివగౌడ్ నిందితుల్లో ఒకరైన రాకేశ్‌గౌడ్ దూరపు బంధువులు. రాకేశ్‌గౌడ్ పాత నేరస్తుడు. గతేడాది సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో సెల్‌ఫోన్, నగదు దోపిడీ కేసులో నిందితుడు. మరో నిందితుడు రమేశ్ సైతం పాత నేరస్తుడే. ఇతడిపై బైక్ దొంగతనాల కేసు ఉంది. ఇద్దరు చంచలగూడ జైల్లో ఖైదీలుగా ఉండగా పరిచయం ఏర్పడింది. బయటికి వచ్చిన తరువాత మళ్లీ నేరాల ప్రవృత్తితో ఈ హత్యకు ఒడిగట్టారు. ఇందులో భాగంగా రాకేశ్‌గౌడ్ హైదరాబాద్‌లో ఉన్న రమేశ్‌కు ఫోన్ చేసి నస్పూర్‌లో తన దూరపు బంధువు శివగౌడ్ ఉన్నాడని, అతడిని కిడ్నాప్ చేసి బెదిరించి రూ.5 లక్షలు వసూలు చేద్దామని చెప్పాడు. దీనికి రమేశ్ అంగీకరించడంతో ఇద్దరు కలిసి పథకం రచించారు. ఈనెల 17న నస్పూర్‌కు వచ్చారు. రాకేశ్‌గౌడ్ తన ఫోన్‌తో శివగౌడ్‌కు ఫోన్ చేసి ఇక్కడ కొంచెం పని చేసి పెట్టాలని చెప్పడంతో శివగౌడ్ ఇంటి నుంచి వచ్చి వీరిద్దరిని కలిశాడు. తరువాత శివగౌడ్ బైక్‌పైనే ముగ్గురు కలిసి సీతారాంపల్లి దారిలోని వైన్స్‌కు వెళ్లి మద్యం కొనుక్కున్నారు. అక్కడినుంచి బైక్‌పై కొత్త పోలీస్ స్టేషన్ సమీపంలోకి వచ్చి ఒక షెడ్డులో మద్యం సేవించారు. షెడ్డు యాజమాని వచ్చి అక్కడి నుంచి వెళ్లిపోమని చెప్పడంతో నస్పూర్ సమీపంలోకి వెళ్లి మద్యం తాగారు. ముందుగా ఒక దెబ్బకొట్టి రక్తం వచ్చిన తరువాత ఆ ఫొటోను శివగౌడ్ కుటుంబసభ్యులకు పంపించి డబ్బులు డిమాండ్ చేయాలని ఇద్దరూ నిర్ణయించుకున్నారు. అయితే తాగిన మైకంలో రమేశ్ బీరు సీసాతో శివగౌడ్ తలపై కొట్టాడు. తీవ్ర గాయమై రక్తం రావడంతో వెంటనే రాకేశ్‌గౌడ్ స్పందిస్తూ ‘వాడు లేస్తే ఊరుకోడు.. మనల్నే వేస్తాడు..’ అంటూ తన చేతిలో ఉన్న బీరు సీసాతో శివగౌడ్ తలపై బాదాడు. బండరాయితో తలపై మోదారు. దీంతో శివగౌడ్ అక్కడక్కిడే మృతి చెందాడు. రమేశ్‌పై రక్తం మరకలు పడడంతో వెంటనే తన ప్యాంటు విప్పి హతుడు శివగౌడ్ ప్యాంటు వేసుకున్నాడు. తర్వాత అక్కడి నుంచి పరారయ్యారు. మంచిర్యాల వెళ్లిన తరువాత రమేశ్ ప్యాంటు కొనుక్కొని వేసుకొని అక్కడినుంచి ఎవరిదారిలో వారు వెళ్లిపోయారు. నిందితులను పట్టించిన సీసీ టీవీ ఫుటేజీ.. నిందితులను వైన్స్షాపులోని సీసీ టీవీ కెమెరా పట్టించింది. ఈ నెల 17న ఇంట్లో నుంచి వెళ్లిన శివగౌడ్ సాయంత్రం వరకు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు పలుచోట్ల వెతికారు. అదే సమయంలో సాయంత్రం శివగౌడ్ సెల్‌కు తండ్రి వెంకాగౌడ్ ఫోన్ చేయగా ఎత్తలేదు. తరువాత శివగౌడ్ వద్ద ఆటో డ్రైవర్‌గా పనిచేసే సతీశ్‌కు ఫోన్ చేయగా శివగౌడ్ ఫోన్‌ను రమేశ్ ఎత్తి మాట్లాడారు. ఫోన్ శివగౌడ్‌కు ఇవ్వాలని కోరితే అతడు పనిమీద ఉన్నాడని, అకౌంట్లో డబ్బులు వేయమని చెప్పి అకౌంట్ నంబర్ ఇచ్చారు. ఇది కూడా క్లూకు ఆధారమైంది. తరువాత శివగౌడ్‌కు మరోసారి కాల్ చేస్తే ఫోన్ స్విచ్ఛాప్ అయ్యింది. దీంతో అనుమానం వచ్చి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వైన్స్ వద్దకు వచ్చి ఉంటారనే అనుమానంతో అడుగగా అక్కడ ఫాస్ట్‌ఫుడ్ నిర్వహించే వ్యక్తి ఉదయం శివగౌడ్‌తో పాటు మరో ఇద్దరు వచ్చి మద్యం తీసుకెళ్లినట్లు చెప్పాడు. షాపులోని సీసీ కెమెరా పుటేజీని పరిశీలించగా అందులో శివగౌడ్తోపాటు మరో ఇద్దరు ఉన్నట్లు కనిపించింది. దీని ఆధారంగా నిందితుల కోసం గాలించగా శ్రీరాంపూర్‌లో దొరికారు. వారిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. -
కిడ్నాపైన విద్యార్థి దారుణహత్య
సాక్షి, అనంతపురం: అనంతపురం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. 45 రోజుల కిందట అదృశ్యమైన 3వ తరగతి విద్యార్థి గౌతం దారుణహత్యకు గురయ్యాడు. పోలీసుల కథనం ప్రకారం.. జనవరి నెలలో స్కూల్ నుంచి ఇంటికి వెళ్తున్న బాలుడు గౌతంను కొందరు గుర్తుతెలియని దుండగులు కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో విచారణ చేపట్టిన పోలీసులకు బి.యాలేరు చెరువులో బాలుడి మృతదేహం ఉందంటూ సమాచారం అందింది. చెరువు వద్దకు వెళ్లిన పోలీసులు బాలుడి మృతదేహాన్ని వెలికితీశారు. బాగా తెలిసిన వారే బాలుడిని హత్య చేసుంటారని పోలీసులు భావిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
మరణ దండన
-
శాన్వి హత్యకేసులో రఘునందన్‌కు మరణ శిక్ష
వాషింగ్టన్ : అమెరికా పెన్సిల్వేనియాలో చిన్నారి శాన్వి, సత్యవతి దారుణహత్య కేసులో నిందితుడైన యండమూరి రఘునందన్‌కు అక్కడి న్యాయస్థానం మరణశిక్ష విధించింది. ఈ కేసులో రెండేళ్ళ పాటు విచారణ చేసిన అమెరికా కోర్టు ఈ నెల తొమ్మిదిన రఘునందన్ ను దోషిగా నిర్ధారించిన విషయం తెలిసిందే. చిన్నారి కిడ్నాప్, జంటహత్యలు చేసిన రఘునందన్‌కు కోర్టు మరణశిక్ష ఖరారు చేశింది. 2012 అక్టోబర్ 22న పెన్సిల్వేనియా చిన్నారి శాన్వి, పాప నానమ్మ సత్యవతి వాళ్ల ఇంట్లోనే హత్యకు గురయ్యారు. తొలుత హత్య చేసింది తనే అంటూ ఒప్పుకున్న రఘునందన్ ఆ తర్వాత మాట మార్చాడు. జంట హత్యలతో తనకు ప్రమేయం లేదని, జరిగిన దొంగతనంలో మాత్రమే పాల్గొన్నానంటూ ఐదుగురు సభ్యుల కోర్టు బెంచ్ ముందు వాగ్మూలం ఇచ్చాడు. ఇద్దరు అమెరికన్లు తనను బెదిరించి హత్యలకు పాల్పడ్డారని రఘునందన్ చెప్పాడు. దీంతో ఏడుగురు సభ్యుల బెంచ్‌కు కేసును బదిలీఅయ్యింది. కేసును మళ్ళీ విచారించిన న్యాయమూర్తులు రఘునందన్ వాదనతో విభేదించారు. డబ్బుకోసం రఘునేఈ హత్యలను చేశాడని నిర్థారించారు. మంగళవారం అమెరికా కోర్టు రఘనందన్‌కు మరణశిక్ష విధించింది. -
శాన్వి హత్యకేసులో రఘునందన్ దోషి: కోర్టు
-
శాన్వి హత్యకేసులో రఘునందన్ దోషి: కోర్టు
అమెరికాలో చిన్నారి శాన్వి, ఆమె నాయనమ్మ సత్యవతిల హత్యకేసులో యండమూరి రఘునందన్‌ను కోర్టు దోషిగా తేల్చింది. అతడు ఉద్దేశపూర్వకంగానే హత్య చేసినట్లు కోర్టు నిర్ధారించింది. దీంతో అతడికి జీవితఖైదు లేదా మరణశిక్ష పడే అవకాశం ఉంది. అయితే తాను దొంగతనం మాత్రమే చేశాను పత్ప హత్యలతో తనకు సంబంధం లేదని రఘునందన్ వాదించాడు. దోషులను కఠినంగా శిక్షించాలని కోర్టును కోరాడు. 2012 సంవత్సరంలో అప్పర్ మెరియన్ ప్రాంతంలో శాన్వి వెన్నా (10 నెలల) అనే చిన్నారిని కిడ్నాప్ చేసి, ఆమెను చంపేశాడని, ఆమెతో పాటు చిన్నారి నాయనమ్మ సత్యవతి (61)ను కూడా చంపేశాడని రఘునందన్ మీద అభియోగాలు వచ్చాయి. రెండు కౌంట్ల ఫస్ట్ డిగ్రీ హత్య కేసులు అతడిమీద రుజువైనట్లు ఏడుగురు మగ, ఐదుగురు ఆడ న్యాయమూర్తులతో కూడిన జ్యూరీ తేల్చిచెప్పింది. ఈ తీర్పుపై శాన్వి తండ్రి వెంకట్ వెన్నా మాత్రం ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. తీర్పు వెలువడగానే రఘునందన్ తల్లి పద్మావతి భోరున విలపించారు. ఆమె వెంటనే భారతదేశానికి తిరిగి వెళ్లే అవకాశం ఉంది. తన కొడుకును ఎలాగోలా కాపాడాలని ఆమె రోదిస్తూ కోరారు. 1997లో తన భర్త, భారతదేశంలో పోలీసు అధికారిగా పనిచేస్తూ ఉగ్రవాదుల దాడిలో విధి నిర్వహణలో్ మరణించినట్లు ఆమె కోర్టుకు చెప్పారు. అప్పటికి 11 ఏళ్ల వయసులో ఉన్న తన కొడుకు రఘునందన్.. తండ్రిలేని జీవితం ఎందుకంటూ ఆత్మహత్య చేసుకోబోయినట్లు తెలిపారు. 2012 అక్టోబర్ 12వ తేదీన మార్కిస్ అపార్ట్మెంట్లలో కిడ్నాప్, హత్య సంఘటనలు జరిగాయి. శాన్వి కోసం వెతుకుతున్న పోలీసులకు అక్కడో లేఖ కనిపించింది. అందులో 50వేల డాలర్లు ఇస్తేనే పిల్లను ఇస్తామని, లేకపోతే చంపేస్తామని ఉంది. అయితే, శాన్వి తల్లిదండ్రుల అసలు పేర్లతో కాకుండా వాళ్లను బాగా తెలిసిన వాళ్లు మాత్రమే పిలిచే పేర్లను ఆ నోట్లో రాయడంతో పోలీసుల పని సులభమైంది. వాళ్ల విచారణలో రఘునందన్ తన నేరాన్ని అంగీకరించాడు. కిడ్నాప్ చేసిన కొద్దిసేపటికే శాన్విని చంపేసినట్లు చెప్పాడు.