శాన్వి హత్యకేసులో రఘునందన్కు మరణ శిక్ష | Raghunandan Yandamuri sentenced to death in upper merion killings | Sakshi
Sakshi News home page

శాన్వి హత్యకేసులో రఘునందన్కు మరణ శిక్ష

Published Wed, Oct 15 2014 8:05 AM | Last Updated on Fri, Aug 24 2018 8:18 PM

శాన్వి హత్యకేసులో రఘునందన్కు మరణ శిక్ష - Sakshi

శాన్వి హత్యకేసులో రఘునందన్కు మరణ శిక్ష

వాషింగ్టన్ : అమెరికా పెన్సిల్వేనియాలో చిన్నారి శాన్వి, సత్యవతి దారుణహత్య కేసులో నిందితుడైన యండమూరి రఘునందన్‌కు అక్కడి న్యాయస్థానం మరణశిక్ష విధించింది. ఈ కేసులో రెండేళ్ళ పాటు విచారణ చేసిన అమెరికా కోర్టు  ఈ నెల తొమ్మిదిన రఘునందన్‌ ను దోషిగా నిర్ధారించిన విషయం తెలిసిందే. చిన్నారి కిడ్నాప్‌, జంటహత్యలు చేసిన రఘునందన్‌కు కోర్టు మరణశిక్ష ఖరారు చేశింది.

2012 అక్టోబర్‌ 22న పెన్సిల్వేనియా చిన్నారి శాన్వి, పాప నానమ్మ సత్యవతి వాళ్ల ఇంట్లోనే హత్యకు గురయ్యారు.  తొలుత హత్య చేసింది తనే అంటూ ఒప్పుకున్న రఘునందన్‌ ఆ తర్వాత మాట మార్చాడు. జంట హత్యలతో తనకు ప్రమేయం లేదని, జరిగిన దొంగతనంలో మాత్రమే పాల్గొన్నానంటూ ఐదుగురు సభ్యుల కోర్టు బెంచ్‌ ముందు వాగ్మూలం ఇచ్చాడు. 

ఇద్దరు అమెరికన్లు తనను బెదిరించి హత్యలకు పాల్పడ్డారని రఘునందన్‌ చెప్పాడు. దీంతో ఏడుగురు సభ్యుల బెంచ్‌కు కేసును బదిలీఅయ్యింది. కేసును మళ్ళీ విచారించిన న్యాయమూర్తులు రఘునందన్‌ వాదనతో విభేదించారు.   డబ్బుకోసం రఘునేఈ హత్యలను చేశాడని నిర్థారించారు. మంగళవారం అమెరికా కోర్టు రఘనందన్‌కు  మరణశిక్ష విధించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement