satyavathi venna
-
నా కేసు నేనే వాదించుకుంటా
వాషింగ్టన్ : అమెరికాలో చిన్నారి శాన్వి, సత్యవతి దారుణహత్య కేసులో నిందితుడైన ఎన్నారై రఘునందన్ యండమూరి (29) తన కేసు తానే వాదించుకుంటానని చేసుకున్న అభ్యర్థనని పెన్సిల్వేనియా స్టేట్ సుప్రీంకోర్టు జడ్జి అంగీకరించారు. అయితే కోర్టు నిబంధనలకు లోబడి వాదనలు సాగాలని అతడికి జడ్జి సూచించారు. ఈ మేరకు స్థానిక మీడియా బుధవారం వెల్లడించింది. అమెరికాలోని పెన్సిల్వేనియాలో చిన్నారి శాన్వీని కిడ్నాప్ చేయడానికి యత్నించి ఆ పసికందును, ఆమె నాయనమ్మ సత్యావతిని దారుణంగా చంపేసిన కేసులో విశాఖపట్నానికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ యండమూరి రఘునందన్(28)కు స్థానిక కోర్టు ఉరిశిక్ష విధించిన సంగతి తెలిసిందే. 2012లో జరిగిన ఈ జంట హత్యలపై రెండేళ్ల విచారణ అనంతరం మాంట్గోమెరీ కౌంటీ కోర్టు జ్యూరీ, రఘునందనే ఈ హత్యలు చేశాడని నిర్ధారించింది. జూదానికి బానిసైన రఘునందన్ భారీగా బకాయిలు పడడంతో, వాటిని తీర్చడానికి చిన్నారి శ్వాన్వీ కిడ్నాప్ ప్లాన్ వేశాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. కిడ్నాప్‌నకు అడ్డొచ్చిన చిన్నారి నాయనమ్మ వెన్న సత్యావతి (61)ని కత్తితో పొడిచి, పది నెలల పసికందు వెన్న శాన్వీని ఊపిరాడకుండా చేసి చంపేసినట్లు రఘునందన్ పోలీసుల విచారణలో వెల్లడించాడు. అయితే తొలుత ఈ హత్యలు చేసింది తనే అంటూ ఒప్పుకున్న రఘునందన్ ఆ తర్వాత మాట మార్చాడు. జంట హత్యలతో తనకు ప్రమేయం లేదని, జరిగిన దొంగతనంలో మాత్రమే పాల్గొన్నానంటూ ఐదుగురు సభ్యుల కోర్టు బెంచ్ ముందు వాగ్మూలం ఇచ్చాడు. ఇద్దరు అమెరికన్లు తనను బెదిరించి హత్యలకు పాల్పడ్డారని రఘునందన్ చెప్పాడు. దీంతో ఏడుగురు సభ్యుల బెంచ్‌కు కేసు బదిలీ అయింది. కేసును మళ్ళీ విచారించిన న్యాయమూర్తులు రఘునందన్ వాదనతో విభేదించారు. డబ్బుకోసం రఘునే ఈ హత్యలను చేశాడని నిర్థారించారు. దాంతో రఘనందన్‌కు అమెరికా కోర్టు మరణశిక్ష విధించింది. -
మరణ దండన
-
శాన్వి హత్యకేసులో రఘునందన్‌కు మరణ శిక్ష
వాషింగ్టన్ : అమెరికా పెన్సిల్వేనియాలో చిన్నారి శాన్వి, సత్యవతి దారుణహత్య కేసులో నిందితుడైన యండమూరి రఘునందన్‌కు అక్కడి న్యాయస్థానం మరణశిక్ష విధించింది. ఈ కేసులో రెండేళ్ళ పాటు విచారణ చేసిన అమెరికా కోర్టు ఈ నెల తొమ్మిదిన రఘునందన్ ను దోషిగా నిర్ధారించిన విషయం తెలిసిందే. చిన్నారి కిడ్నాప్, జంటహత్యలు చేసిన రఘునందన్‌కు కోర్టు మరణశిక్ష ఖరారు చేశింది. 2012 అక్టోబర్ 22న పెన్సిల్వేనియా చిన్నారి శాన్వి, పాప నానమ్మ సత్యవతి వాళ్ల ఇంట్లోనే హత్యకు గురయ్యారు. తొలుత హత్య చేసింది తనే అంటూ ఒప్పుకున్న రఘునందన్ ఆ తర్వాత మాట మార్చాడు. జంట హత్యలతో తనకు ప్రమేయం లేదని, జరిగిన దొంగతనంలో మాత్రమే పాల్గొన్నానంటూ ఐదుగురు సభ్యుల కోర్టు బెంచ్ ముందు వాగ్మూలం ఇచ్చాడు. ఇద్దరు అమెరికన్లు తనను బెదిరించి హత్యలకు పాల్పడ్డారని రఘునందన్ చెప్పాడు. దీంతో ఏడుగురు సభ్యుల బెంచ్‌కు కేసును బదిలీఅయ్యింది. కేసును మళ్ళీ విచారించిన న్యాయమూర్తులు రఘునందన్ వాదనతో విభేదించారు. డబ్బుకోసం రఘునేఈ హత్యలను చేశాడని నిర్థారించారు. మంగళవారం అమెరికా కోర్టు రఘనందన్‌కు మరణశిక్ష విధించింది. -
శాన్వి హత్యకేసులో రఘునందన్ దోషి: కోర్టు
-
శాన్వి హత్యకేసులో రఘునందన్ దోషి: కోర్టు
అమెరికాలో చిన్నారి శాన్వి, ఆమె నాయనమ్మ సత్యవతిల హత్యకేసులో యండమూరి రఘునందన్‌ను కోర్టు దోషిగా తేల్చింది. అతడు ఉద్దేశపూర్వకంగానే హత్య చేసినట్లు కోర్టు నిర్ధారించింది. దీంతో అతడికి జీవితఖైదు లేదా మరణశిక్ష పడే అవకాశం ఉంది. అయితే తాను దొంగతనం మాత్రమే చేశాను పత్ప హత్యలతో తనకు సంబంధం లేదని రఘునందన్ వాదించాడు. దోషులను కఠినంగా శిక్షించాలని కోర్టును కోరాడు. 2012 సంవత్సరంలో అప్పర్ మెరియన్ ప్రాంతంలో శాన్వి వెన్నా (10 నెలల) అనే చిన్నారిని కిడ్నాప్ చేసి, ఆమెను చంపేశాడని, ఆమెతో పాటు చిన్నారి నాయనమ్మ సత్యవతి (61)ను కూడా చంపేశాడని రఘునందన్ మీద అభియోగాలు వచ్చాయి. రెండు కౌంట్ల ఫస్ట్ డిగ్రీ హత్య కేసులు అతడిమీద రుజువైనట్లు ఏడుగురు మగ, ఐదుగురు ఆడ న్యాయమూర్తులతో కూడిన జ్యూరీ తేల్చిచెప్పింది. ఈ తీర్పుపై శాన్వి తండ్రి వెంకట్ వెన్నా మాత్రం ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. తీర్పు వెలువడగానే రఘునందన్ తల్లి పద్మావతి భోరున విలపించారు. ఆమె వెంటనే భారతదేశానికి తిరిగి వెళ్లే అవకాశం ఉంది. తన కొడుకును ఎలాగోలా కాపాడాలని ఆమె రోదిస్తూ కోరారు. 1997లో తన భర్త, భారతదేశంలో పోలీసు అధికారిగా పనిచేస్తూ ఉగ్రవాదుల దాడిలో విధి నిర్వహణలో్ మరణించినట్లు ఆమె కోర్టుకు చెప్పారు. అప్పటికి 11 ఏళ్ల వయసులో ఉన్న తన కొడుకు రఘునందన్.. తండ్రిలేని జీవితం ఎందుకంటూ ఆత్మహత్య చేసుకోబోయినట్లు తెలిపారు. 2012 అక్టోబర్ 12వ తేదీన మార్కిస్ అపార్ట్మెంట్లలో కిడ్నాప్, హత్య సంఘటనలు జరిగాయి. శాన్వి కోసం వెతుకుతున్న పోలీసులకు అక్కడో లేఖ కనిపించింది. అందులో 50వేల డాలర్లు ఇస్తేనే పిల్లను ఇస్తామని, లేకపోతే చంపేస్తామని ఉంది. అయితే, శాన్వి తల్లిదండ్రుల అసలు పేర్లతో కాకుండా వాళ్లను బాగా తెలిసిన వాళ్లు మాత్రమే పిలిచే పేర్లను ఆ నోట్లో రాయడంతో పోలీసుల పని సులభమైంది. వాళ్ల విచారణలో రఘునందన్ తన నేరాన్ని అంగీకరించాడు. కిడ్నాప్ చేసిన కొద్దిసేపటికే శాన్విని చంపేసినట్లు చెప్పాడు.