
సాక్షి, అనంతపురం: అనంతపురం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. 45 రోజుల కిందట అదృశ్యమైన 3వ తరగతి విద్యార్థి గౌతం దారుణహత్యకు గురయ్యాడు. పోలీసుల కథనం ప్రకారం.. జనవరి నెలలో స్కూల్ నుంచి ఇంటికి వెళ్తున్న బాలుడు గౌతంను కొందరు గుర్తుతెలియని దుండగులు కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో విచారణ చేపట్టిన పోలీసులకు బి.యాలేరు చెరువులో బాలుడి మృతదేహం ఉందంటూ సమాచారం అందింది. చెరువు వద్దకు వెళ్లిన పోలీసులు బాలుడి మృతదేహాన్ని వెలికితీశారు. బాగా తెలిసిన వారే బాలుడిని హత్య చేసుంటారని పోలీసులు భావిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment