
వర్షిణి (ఫైల్)
కురబలకోట (చిత్తూరు జిల్లా): చిత్తూరు జిల్లాలో ఘోరం జరిగింది. అభం శుభం తెలియని ఆరేళ్ల చిన్నారిని పాశవికంగా హత్య చేసిన ఘటన పలువురిని కలచి వేసింది. కురబలకోట మండలం చేనేతనగర్‌లోని ఓ కల్యాణ మండపంలో శుక్రవారం ఉద యం 5 గంటలకు జరుగనున్న తమ బంధువుల వివాహానికి బి.కొత్తకోట మండలం గుట్టపాళ్యంకు చెందిన ఎద్దేశరి శిద్దారెడ్డి, అతని భార్య ఉషారాణి, ముగ్గురు కుమార్తె లు వైష్ణవి, వర్షిత, వర్షిణి గురువారం రాత్రే చేరుకున్నారు. పది గంటల తర్వాత ఆఖరి కుమార్తె వర్షిణి(6) కనిపించకుండా పోయింది.
ఎవరో కిడ్నాప్ చేసి తీసుకెళ్లారని ముదివేడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉదయం ఆరున్నర గంటల సమయంలో కల్యాణ మండపం వెనుక లోతట్టు ప్రాంతంలో చిన్నారి మృతదేహాన్ని కనుగొన్నారు. కల్యాణ మండపంలోని సీసీ కెమెరాల ఫుటేజీని పోలీసులు పరిశీలించగా.. చిన్నారిని ఓ వ్యక్తి కల్యాణ మండపం వెనుక మరుగుదొడ్ల వైపు తీసుకెళ్లినట్లుగా ఉంది. 15 నిమిషాల తర్వాత అతనొక్కడే తిరిగి మండపంలోకి వచ్చి బయటకు వెళ్లినట్లు సీసీ పుటేజీలో కనిపించింది. దీన్ని బట్టి అతనే చిన్నారిని బలి తీసుకుని ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. చిన్నారి శరీరంపై గాయాలు, గాట్లు, కాళ్లు చేతులపై గీరిన గాయాలు కన్పిస్తుండడంతో లైంగికదాడికి పాల్పడి ఆపై హత్య చేసి ఉండవచ్చని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment