ముగ్గురు పోలీసులను హత్యచేసిన ముష్కరులు | Terrorists abduct, kill three policemen in Kashmir's Shopian | Sakshi
Sakshi News home page

ముగ్గురు పోలీసులను హత్యచేసిన ముష్కరులు

Published Fri, Sep 21 2018 12:21 PM | Last Updated on Fri, Mar 22 2024 11:28 AM

జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. దక్షిణ కశ్మీర్‌లో షోపియాన్‌ జిల్లాలో గురువారం రాత్రి కిడ్నాప్‌ చేసిన ముగ్గురు పోలీసులను హత్యచేశారు. శుక్రవారం ఉదయం పోలీసులు వారి మృతదేహాలను గుర్తించారు. వివరాల్లోకి వెళ్తే.. నిన్న అర్ధరాత్రి జిల్లాలోని రెండు గ్రామాల్లోకి చోరబడ్డ ఉగ్రవాదులు ముగ్గురు ప్రత్యేక బలగాలకు(ఎస్పీవో) చెందిన పోలీసులతో పాటు మరో పోలీసును అపహరించుకుపోయారు. కిడ్నాప్‌ అయిన వారిలో పోలీసు మాత్రం గ్రామస్తుల సహాయంతో బయటపడగలిగారు. మిగత వారిని ఉగ్రవాదులు అత్యంత పాశవికంగా హత్యచేశారు. 

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement