
శ్రీనగర్: కశ్మీర్‌లో ఉగ్రవాదులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పుల్వామా జిల్లాలో శనివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో భద్రతాబలగాలు ఓ ఉగ్రవాదిని హతమార్చాయి. పుల్వామాలోని బబ్‌గుంద్‌లో ఉగ్రవాదులు నక్కిఉన్నట్లు సమాచారం అందుకున్న భద్రతా బలగాలు శుక్రవారం రాత్రి కార్డన్ సెర్చ్ చేపట్టాయి. బలగాల కదలికల్ని పసిగట్టిన ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. దీంతో భద్రతా బలగాలు ఎదురుకాల్పులు ప్రారంభించాయి. శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకూ సాగిన ఈ ఎన్‌కౌంటర్‌లో ఉగ్రసంస్థ హిజ్బుల్ ముజాహిదీన్ సభ్యుడు సబీర్ అహ్మద్ దార్ హతం కాగా, మరో ఉగ్రవాదిని భద్రతా బలగాలు సజీవంగా పట్టుకున్నాయి.