శ్రీనగర్: కశ్మీర్‌లోని బారాముల్లా, అనంత్‌నాగ్ జిల్లాల్లో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన రెండు వేర్వేరు ఎన్‌కౌంటర్‌లలో ఆరుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. బారాముల్లాలోని క్రీరీ ప్రాంతంలో ఉగ్రసంచారం వార్త తెలిసి భద్రతాబలగాలు గాలింపు చేపట్టగా వారిపై ఉగ్రవాదులు ఎదురుకాల్పులు జరిపారు. వెంటనే స్పందించిన సైన్యం జరిపిన కాల్పుల్లో ఇద్దరు లష్కరే తోయిబా ముష్కరులు హతమయ్యారు. అనంత్‌నాగ్ జిల్లాలోని అర్వానీ ప్రాంతంలో జరిగిన మరో ఎన్‌కౌంటర్‌లో నలుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టామని సీనియర్ పోలీసు అధికారి చెప్పారు. రెండు ఘటనాస్థలాల్లో ఉగ్రవాదులకు చెందిన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment