దక్షిణ కశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలో భద్రతా దళాలు కూంబింగ్ చేస్తుండగా మిలిటెంట్లు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఒక పౌరుడు మృతి చెందగా, ముగ్గురు సైనికులు గాయాలపాలయ్యారు. ఉగ్రవాదులు ఇళ్లలో నక్కి భద్రతా దళాలపై దాడులు చేస్తున్న నేపథ్యంలో ఆర్మీ, సీఆర్‌పీఎఫ్‌లతో కూడిన దళాలు షోపియాన్‌లోని 20కి పైగా గ్రామాల్లో గురువారం కార్డన్ సెర్చ్ ప్రారంభించాయి.