కశ్మీర్: ప్రపంచంలో తండ్రీ.. కూతురి అనుబంధం ఎప్పుడు ప్రత్యేకమే. అమ్మకు కొడుకు మీద ప్రేమ ఉంటే.. నాన్నకు కూతురు మీద ప్రేమ ఉంటుంది. ఇప్పుడు ఈ ఎందుకు అని మీకు డౌట్ వచ్చి ఉంటుంది. అక్కడికే వస్తున్నాం. క్రికెట్‌కు జెంటిల్మెన్ గేమ్ అని పేరు ఉంది. ఆటలో ఎన్నోసార్లు ఆసక్తికర సన్నివేశాలు చూసుంటాం. ఉదాహరణకు ఆటగాళ్ల మధ్య గొడవలు.. ఫీల్డింగ్ విన్యాసాలు.. క్యాచ్‌లు.. రనౌట్‌లు.. భారీ సిక్స్‌లు ఇలా చెప్పుకుంటే పోతే చాలానే ఉన్నాయి. తాజాగా అలాంటి ఘటనే మ్యాచ్ మధ్యలో చోటుచేసుకుంది.
దక్షిణ కశ్మీర్‌లో జరుగుతున్న క్లబ్ క్రికెట్‌లో మ్యాచ్‌లో ఫీల్డర్‌కు దాహం వేసింది. సాధారణంగా డ్రింక్స్ అందించడానికి బాయ్స్ ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం తన తండ్రికి దాహం వేయడంతో అతని కూతురు స్వయంగా గ్రౌండ్‌లోకి వచ్చి వాటర్ అందించింది. దీనిలో ప్రత్యేకంగా చెప్పడానికి ఏమీ లేకపోయినప్పటికి ఫోటో మాత్రం వైరల్ అయింది. వీలైతే మీరు ఒక లుక్కేయండి. కాగా సదరు తండ్రి మట్టన్ స్పోర్ట్స్‌క్లబ్‌కు ఆడుతున్నట్లు అతను వేసుకున్న జెర్సీ ఆధారంగా తెలిసింది. ఇటీవలే కశ్మీర్ ప్రీమియర్ లీగ్‌పై వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ హర్షలే గిబ్స్‌కు బీసీసీఐ నుంచి బెదిరింపులు వచ్చినట్లు వార్తలు వచ్చాయి. అయితే బీసీసీఐ మాత్రం దీనిని ఖండించింది. అయితే పాక్ మాజీ క్రికెటర్లు మాత్రం బీసీసీఐ అనవసర రాద్దాంతం చేస్తుందని విషం కక్కారు.
This picture is ❤️. Daughter carrying drinks for her father during drinks break at #Tikbagh KP Road Mattan In ongoing #MPL2 league. Daughter are gifted ❤️@imVkohli @ICC @BCCI @ImParveezRasool @evarayees @dr_piyushsingla @hussain_imtiyaz @ABdeVilliers17 @bhatray @Kashmir_Monitor pic.twitter.com/MYrjqxCQHB
— Aabid Bhat (@ubiiibhat87) August 8, 2021
Comments
Please login to add a commentAdd a comment