న్యూఢిల్లీ : జమ్మూ కశ్మీర్లో పరిస్థితులపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ మంగళవారం అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. మోదీ అధికారిక నివాసం 7 రేస్ కోర్స్లో జరుగుతున్న ఈ ఉన్నతస్థాయి సమీక్ష సమావేశానికి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తో సహా ఉన్నతాధికారులు హాజరయ్యారు.
కాగా హిజ్బుల్ కమాండర్ బుర్హాన్ కాల్చివేతపై తలెత్తిన ఘర్షణల్లో ఇప్పటివరకూ 29మంది మృతి చెందగా, సుమారు 800మంది గాయపడ్డారు. ఈ నేపథ్యంలో తాజా పరిస్థితులపై ఆయన అధికారులతో చర్చిస్తున్నారు. మరోవైపు కశ్మీర్లో బంద్ కొనసాగుతోంది. వేర్పాటువాదులు బంద్ను మరో రెండు రోజులు పొడిగించారు. శ్రీనగర్ సహా చాలా ప్రాంతాల్లో కర్ఫ్యూ వాతావరణం నెలకొంది.