కశ్మీర్ లో జరిగిన హింస్మాతక ఘటనల్లో అమాయకులు ప్రాణాలు కోల్పోవడం పట్ల కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు.
న్యూఢిల్లీ: కశ్మీర్ లో జరిగిన హింస్మాతక ఘటనల్లో అమాయకులు ప్రాణాలు కోల్పోవడం పట్ల కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. దేశభద్రత విషయంలో రాజీ పడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఉగ్రవాదంపై ఉక్కు మోపాలని సూచించారు. రాజకీయ ప్రక్రియతోనే కశ్మీర్ సమస్య పరిష్కారం అవుతుందన్న ఆశాభావాన్ని ఆమె వ్యక్తం చేశారు. రెండు దశాబ్దాల్లో రాజకీయ ప్రక్రియ కారణంగా కశ్మీర్ కు ఎన్నో ప్రయోజనాలు దక్కాయన్నారు.
హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ బుర్హాన్ వనీని భద్రతా దళాలు హతమార్చడంతో కశ్మీర్ లో కల్లోలం చెలరేగింది. హింసాత్మక ఘటనల్లో 23 మంది మృతి చెందగా, 200 మందిపైగా గాయపడ్డారు. తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడంతో పలు జిల్లాల్లో కర్ఫ్యూ విధించారు. మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపేశారు.