కశ్మీర్ అల్లర్లలో 54కి చేరిన మృతుల సంఖ్య
శ్రీనగర్: జమ్ముకశ్మీర్ లోని బుద్గామ్ జిల్లాలో మళ్లీ నిరసన సెగ ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు భద్రతా బలగాలు ఆందోళనకారులపై జరిపిన కాల్పుల్లో ముగ్గురు వ్యక్తులు మృతిచెందగా, వంద మందికి పైగా నిరసనకారులకు గాయాలయ్యాయి. మృతులలో ఛదూర ప్రాంతానికి చెందిన 45 ఏళ్ల మహ్మద్ ఇక్బాల్, ఖాన్ సాహిబ్ ప్రాంతానికి చెందిన జహూర్ అహ్మద్, మరో వ్యక్తి మృతిచెందాడని అధికారులు తెలిపారు.
గత నాలుగు వారాలుగా ఆందోళనకారులు చెలరేగిపోతుంటే సెక్యూరిటీ సిబ్బంది జరిపిన కాల్పుల్లో ఇప్పటివరకూ 54 మంది మృతిచెందగా, దాదాపు 3 వేల మంది గాయపడ్డారు. వాటెండ్ టెర్రరిస్టు, హిజ్బుల్ ముజాహిద్దీన్ కమాండర్ బుర్హాన్ వని ఎన్‌కౌంటర్ నేపథ్యంలో ఇక్కడ అల్లర్లు మొదలవడంతో కర్ఫ్యూ విధించిన విషయం తెలిసిందే.