kashmir clashes
-
ఆత్మహత్య చేసుకోవడానికే వస్తున్నారు: డీజీపీ
శ్రీనగర్: భద్రతా దళాలపై రాళ్లు రువ్వేందుకు ఎన్కౌంటర్ జరుగుతున్న ప్రదేశాలకు వస్తున్న కశ్మీర్ యువత తీరుపై ఆ రాష్ట్ర డీజీపీ ఎస్పీ వేద్ తాజాగా స్పందించారు. ఎన్కౌంటర్ జరుగుతున్న ప్రదేశానికి యువత రావడమంటే ఆత్మహత్య చేసుకోవడమేనని పేర్కొన్నారు. అలాంటి చర్యలకు యువత పాల్పడకుండా నిగ్రహంగా ఉండాలని సూచించారు. 'ఎన్కౌంటర్ జరుగుతున్నప్పుడు భద్రతా దళాలు, పోలీసులు సైతం రక్షణకు అడ్డుగా బుల్లెట్ ప్రూఫ్ వాహనం లేదా ఇల్లు ఉండేలా చూసుకుంటారు. కానీ యువత మాత్రం నేరుగా ఆత్మహత్య చేసుకోవడానికే ఎన్కౌంటర్ జరుగుతున్న ప్రదేశాలకు వస్తున్నారు' అని ఎస్పీ వేద్ విలేకరులతో అన్నారు. ఎన్కౌంటర్ ప్రదేశాలకు యువత రాకూడదని ఆయన విజ్ఞప్తి చేశారు. శాంతికి విఘాతం కలిగించే శక్తులే యువతను తప్పుగా ప్రేరేపించి.. తప్పు దోవ పట్టించేందుకు ఇలా రెచ్చగొడుతున్నాయని చెప్పారు. తమ సంకుచిత రాజకీయాల కోసం యువతను కొందరు వాడుకుంటున్నారని, ఈ విషయాన్ని యువత గుర్తించాలని సూచించారు. ఎన్కౌంటర్ ప్రారంభమైన వెంటనే 300లకుపైగా వాట్సాప్ గ్రూపులలో, ఫేస్‌బుక్‌లలో దుష్రచారం చేసి..యువతను రెచ్చగొడుతున్నారని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో వాట్సాప్, ఇతర సోషల్ మీడియా గ్రూపులలో జరుగుతున్న దుష్ర్పచారంపై కట్టుదిట్టమైన నిఘా పెట్టినట్టు తెలిపారు. బుడ్గామ్ ఎన్కౌంటర్లో ఒక మిలిటెంట్ సహా.. ముగ్గురు యువత చనిపోయిన సంగతి తెలిసిందే. మిలిటెంట్‌కు మద్దతుగా భద్రతా దళాలపై యువత రాళ్లు రువ్వడంతో జవాన్లు జరిపిన కాల్పుల్లో ముగ్గురు ప్రాణాలు విడిచారు. -
కశ్మీర్ అల్లర్లలో 54కి చేరిన మృతుల సంఖ్య
-
కశ్మీర్ అల్లర్లలో 54కి చేరిన మృతుల సంఖ్య
శ్రీనగర్: జమ్ముకశ్మీర్ లోని బుద్గామ్ జిల్లాలో మళ్లీ నిరసన సెగ ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు భద్రతా బలగాలు ఆందోళనకారులపై జరిపిన కాల్పుల్లో ముగ్గురు వ్యక్తులు మృతిచెందగా, వంద మందికి పైగా నిరసనకారులకు గాయాలయ్యాయి. మృతులలో ఛదూర ప్రాంతానికి చెందిన 45 ఏళ్ల మహ్మద్ ఇక్బాల్, ఖాన్ సాహిబ్ ప్రాంతానికి చెందిన జహూర్ అహ్మద్, మరో వ్యక్తి మృతిచెందాడని అధికారులు తెలిపారు. గత నాలుగు వారాలుగా ఆందోళనకారులు చెలరేగిపోతుంటే సెక్యూరిటీ సిబ్బంది జరిపిన కాల్పుల్లో ఇప్పటివరకూ 54 మంది మృతిచెందగా, దాదాపు 3 వేల మంది గాయపడ్డారు. వాటెండ్ టెర్రరిస్టు, హిజ్బుల్ ముజాహిద్దీన్ కమాండర్ బుర్హాన్ వని ఎన్కౌంటర్ నేపథ్యంలో ఇక్కడ అల్లర్లు మొదలవడంతో కర్ఫ్యూ విధించిన విషయం తెలిసిందే. -
పాకిస్థాన్ 'బ్లాక్‌డే'పై భగ్గుమన్న భారత్!
న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్ విషయంలో పాకిస్థాన్ మరోసారి హద్దుమీరి ప్రవర్తించింది. కశ్మీర్ వాసులకు మద్దతుగా జూలై 19న బ్లాక్ డే పాటించనున్నట్టు పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ప్రకటించడంపై భారత్ భగ్గుమంది. ఈ విషయంలో పాకిస్థాన్ కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని తాము నిర్ద్వంద్వంగా, నిక్కచ్చిగా తిరస్కరిస్తున్నట్టు భారత్ తేల్చిచెప్పింది. 'మా అంతర్గత వ్యవహారాల్లో తల దూర్చేందుకు పాకిస్థాన్ నిరంతరం చేస్తున్న ప్రయత్నాలు మాకు దిగ్భ్రాంతి కలుగజేస్తున్నాయి' అని భారత విదేశాంగ మంత్రిత్వశాఖ ఓ ప్రకటనలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కొన్ని ఉగ్రవాద సంస్థలకు చెందిన ఉగ్రవాదులను కీర్తిస్తూ పాకిస్థాన్ తన పక్షపాత, కపట బుద్ధిని చాటుకుంటున్నదని ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోవైపు శుక్రవారం ఉదయం పాక్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఎం ఆసిఫ్ ట్విట్టర్లో జమ్ముకశ్మీర్‌లో తాజా ఘటనలను, 2002నాటి గుజరాత్ అల్లర్లతో పోలుస్తూ తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గుజరాత్లో మోదీ చేపట్టిన జాతుల నిర్మూలన కశ్మీర్‌లోనూ కొనసాగుతున్నదంటూ ఖవాజా నోరుపారేసుకున్నారు. ఆయన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన భారత్ పొరుగుదేశాల విషయాల్లో జోక్యం చేసుకోవద్దంటూ పాక్‌కు హితవు పలికింది. హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాది బుర్హాన్ వనీ భద్రతా దళాల ఎన్కౌంటర్లో మృతిచెందడంతో తలెత్తిన ఆందోళనల్లో 36మంది చనిపోగా.. 1500 మంది గాయపడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై పాకిస్థాన్ శృతిమించి స్పందిస్తోంది. ఇప్పటికే ఉగ్రవాది బుర్హాన్ వనీని కశ్మీర్ నాయకుడిగా కీర్తిస్తూ.. అతని మృతిపై పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.