ఐటీ కంపెనీ ఎంఫసిస్ తమను ఆన్‌బోర్డింగ్ చేయించకుండా తీవ్ర జాప్యం చేస్తోందని ఆ సంస్థ ఫ్రెషర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై కొందరు ఫ్రెషర్లు ట్విటర్ వేదికగా తమ ఆక్రోశాన్ని వ్యక్తం చేస్తున్నారు. కంపెనీ నుంచి తాము అందుకున్న అంగీకార పత్రాల గడువు కూడా ముగుస్తున్న నేపథ్యంలో తమను ఉద్యోగంలోకి తీసుకుంటారో లేదో అని భయాందోళన చెందుతున్నారు.
తాను కంపెనీ నుంచి 2021 అక్టోబర్‌లో అంగీకార పత్రం అందుకున్నానని, అప్పటి నుంచి జాయినింగ్ తేదీ కోసం ఎదురుచూస్తున్నానని నితిన్‌రాకేష్ అనే అభ్యర్థి తెలియజేశారు. కంపెనీ నుంచి అంగీకార పత్రం అందుకున్నప్పుడు తాను కూడా ఎంఎన్‌సీ కంపెనీలో ఉద్యోగి కాబోతున్నానని ఎంతో సంతోషించానని, కానీ తనను ఆన్‌బోర్డ్ చేయకుండా ఎంఫసిస్ కంపెనీ నిరాశకు గురిచేస్తోందని వాపోయాడు. ఇప్పటికైనా ఆన్‌బోర్డ్ చేయాలని వేడుకుంటున్నాడు.
(ఇదీ చదవండి: అతిగా ఫోన్ వాడుతున్నారా.. ఈమెకు జరిగిందే మీకూ జరగొచ్చు!)
తౌహీద్ అనే మరో అభ్యర్థి.. తనుకు 2022 జూన్‌లో లెటర్ ఆఫ్ ఇంటెంట్ ఇచ్చారని, 2023 మార్చికి దాని గడువు ముగిసిపోతుందని, ఆన్‌బోర్డింగ్‌పై సమాచారం ఇవ్వాలని అభ్యర్థించారు. నిక్కీ అనే అభ్యర్థి అయితే తాను 16 నెలలుగా ఆన్‌బోర్డింగ్ కోసం ఎదురు చూస్తున్నాని, ఈ కంపెనీలో చేరాలనే ఉద్దేశంతో ఇతర కంపెనీల వచ్చిన ఆఫర్లను కూడా వదులుకున్నానని ఆవేదన వ్యక్తం చేశారు.
(ఇదీ చదవండి: Joom: భారత్‌లోకి మరో ఈ-కామర్స్ దిగ్గజం.. ఎస్‌ఎంఈలకు సరికొత్త వేదిక)
Comments
Please login to add a commentAdd a comment