Mphasis
-
ఇంకెన్నాళ్లు వెయిట్ చేయిస్తారు..? ఐటీ కంపెనీ ఫ్రెషర్ల ఆవేదన
ఐటీ కంపెనీ ఎంఫసిస్ తమను ఆన్‌బోర్డింగ్ చేయించకుండా తీవ్ర జాప్యం చేస్తోందని ఆ సంస్థ ఫ్రెషర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై కొందరు ఫ్రెషర్లు ట్విటర్ వేదికగా తమ ఆక్రోశాన్ని వ్యక్తం చేస్తున్నారు. కంపెనీ నుంచి తాము అందుకున్న అంగీకార పత్రాల గడువు కూడా ముగుస్తున్న నేపథ్యంలో తమను ఉద్యోగంలోకి తీసుకుంటారో లేదో అని భయాందోళన చెందుతున్నారు. తాను కంపెనీ నుంచి 2021 అక్టోబర్‌లో అంగీకార పత్రం అందుకున్నానని, అప్పటి నుంచి జాయినింగ్ తేదీ కోసం ఎదురుచూస్తున్నానని నితిన్‌రాకేష్ అనే అభ్యర్థి తెలియజేశారు. కంపెనీ నుంచి అంగీకార పత్రం అందుకున్నప్పుడు తాను కూడా ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగి కాబోతున్నానని ఎంతో సంతోషించానని, కానీ తనను ఆన్‌బోర్డ్ చేయకుండా ఎంఫసిస్ కంపెనీ నిరాశకు గురిచేస్తోందని వాపోయాడు. ఇప్పటికైనా ఆన్‌బోర్డ్ చేయాలని వేడుకుంటున్నాడు. (ఇదీ చదవండి: అతిగా ఫోన్ వాడుతున్నారా.. ఈమెకు జరిగిందే మీకూ జరగొచ్చు!) తౌహీద్ అనే మరో అభ్యర్థి.. తనుకు 2022 జూన్‌లో లెటర్ ఆఫ్ ఇంటెంట్ ఇచ్చారని, 2023 మార్చికి దాని గడువు ముగిసిపోతుందని, ఆన్‌బోర్డింగ్‌పై సమాచారం ఇవ్వాలని అభ్యర్థించారు. నిక్కీ అనే అభ్యర్థి అయితే తాను 16 నెలలుగా ఆన్‌బోర్డింగ్ కోసం ఎదురు చూస్తున్నాని, ఈ కంపెనీలో చేరాలనే ఉద్దేశంతో ఇతర కంపెనీల వచ్చిన ఆఫర్లను కూడా వదులుకున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. (ఇదీ చదవండి: Joom: భారత్‌లోకి మరో ఈ-కామర్స్ దిగ్గజం.. ఎస్ఎంఈలకు సరికొత్త వేదిక) -
హైదరాబాద్ లో ఎంఫసిస్ కేంద్రం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ఐటీ సొల్యూషన్స్, సర్వీసుల రంగంలో ఉన్న ‘ఎంఫసిస్’... హైదరాబాద్‌లో కాగ్నిటివ్ హబ్‌ను ప్రారంభించింది. ఆర్థిక సేవల రంగ కంపెనీలకు ఈ కేంద్రం తదుపరి తరం గవర్నెనెన్స్, రిస్క్, కాంప్లియన్స్ పరిష్కారాలను అందిస్తుంది. తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు ఈ కార్యాలయాన్ని బుధవారం ప్రారంభించారు. 250 సీట్ల సామర్థ్యంతో దీనిని ఏర్పాటు చేసినట్టు కంపెనీ సీఈవో గణేష్ అయ్యర్ ఈ సందర్భంగా తెలిపారు. మరిన్ని హబ్‌లను పలు నగరాల్లో ఏర్పాటు చేస్తామని చెప్పారు. -
ఫలితాల్లో అదరగొట్టిన ఎంఫసిస్
న్యూఢిల్లీ : బెంగళూరుకు చెందిన ఐటీ కంపెనీ ఎంఫసిస్కు 2016-17 ఆర్థిక సంవత్సరంలో త్రైమాసిక ఫలితాల బోణి అదిరింది. తొలి త్రైమాసికంలో కన్సాలిడేటడ్ నికర లాభాలు 38శాతం దూసుకెళ్లి, రూ.204.3 కోట్లగా నమోదయ్యాయి. 2016 జూన్ క్వార్టర్ ఫలితాలను కంపెనీ శనివారం ప్రకటించింది. వరుసగా ఇన్ఫోసిస్, విప్రో లాంటి ఐటీ దిగ్గజాలు ఫలితాల్లో నిరాశపరిచినా.. ఎంఫసిస్ మాత్రం లాభాల్లో దూసుకెళ్లింది. నిర్వహణ ఆదాయం యేటికేటికి 1.5 శాతం ఎగబాకి, రూ.1,516.6 కోట్లగా నమోదైనట్టు పేర్కొంది. తొలి త్రైమాసిక ప్రారంభం బాగుందని.. కొత్త తర సర్వీసులపై కంపెనీ ఎక్కువగా ఫోకస్ చేయడంతో, స్ట్రాంగ్ రిజల్ట్స్ ను నమోదుచేసినట్టు ఎంఫసిస్ సీఈవో గణేష్ అయ్యర్ పేర్కొన్నారు. 2016 ఆర్థిక సంవత్సరం ఎంఫసిస్కు బ్యానర్ ఏడాదని, వృద్ధిని, లాభాలను ఆర్జించడానికి ఈ ఏడాది తాము వ్యూహాత్మక రోడ్ మ్యాప్‌ను రూపొందించుకున్నామని అయ్యర్ వెల్లడించారు.ఇంటర్నేషనల్ రెవెన్యూ ఏడాదికి ఏడాది 14.7 శాతం పెరిగినట్టు కంపెనీ పేర్కొంది. -
ఎంఫసిస్, బ్లాక్ స్టోన్ ల మధ్య భారీ ఒప్పందం
ముంబై : దేశంలో అగ్రగామి ఐటీ కంపెనీల్లో ఒకటిగా కొనసాగుతున్న ఎంఫసిస్.. ప్రముఖ గ్లోబల్ ప్రైవేట్ ఈక్విటీ ఫండ్ బ్లాక్ స్టోన్ తో భారీ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఎంఫసిస్ కంపెనీ మెజార్టి 60.5 శాతం షేరును బ్లాక్ స్టోన్ కొనుగోలు చేసింది. దీని విలువ రూ. 5,466 కోట్ల నుంచి రూ. 7,071 కోట్ల(1బిలియన్ డాలర్ల)గా ఉంది. భారత టేక్ ఓవర్ కోడ్ ప్రకారం ఎంఫసిస్ కంపెనీ 26 శాతం అదనపు షేర్లను ఓపెన్ ఆఫర్లో ఉంచినట్టు బ్లాక్ స్టోన్ సంస్థ సోమవారం స్టాక్ ఎక్సేంజ్ లకు తెలిపింది. ఒక్కో షేరుకు రూ.430ను చెల్లిస్తున్నట్టు ఆ సంస్థ ప్రకటించింది. నేషనల్ స్టాక్ ఎక్సేంజ్, బీఎస్ఈలో నమోదైన కంపెనీలో ఎంఫసిస్ ఒకటి కాబట్టి బీఎస్ఈలో ఆ షేరు ధర 1.48 శాతం తగ్గి, రూ.460.50 వద్ద నమోదైంది. బ్యాంకింగ్, ఫైనాన్సియల్, ఇన్సూరెన్స్, డిజిటల్ సర్వీసులు అందిస్తున్న కంపెనీల్లో ఎంఫసిస్ ఎక్కువ లాభాలు ఆర్జిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ వినియోగదారులను కలిగిఉన్న ఎంఫసిస్ 16 దేశాల్లో సేవలను అందిస్తోంది. ఆ కంపెనీలో 24 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.