ముంబై : దేశంలో అగ్రగామి ఐటీ కంపెనీల్లో ఒకటిగా కొనసాగుతున్న ఎంఫసిస్.. ప్రముఖ గ్లోబల్ ప్రైవేట్ ఈక్విటీ ఫండ్ బ్లాక్ స్టోన్ తో భారీ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఎంఫసిస్ కంపెనీ మెజార్టి 60.5 శాతం షేరును బ్లాక్ స్టోన్ కొనుగోలు చేసింది. దీని విలువ రూ. 5,466 కోట్ల నుంచి రూ. 7,071 కోట్ల(1బిలియన్ డాలర్ల)గా ఉంది. భారత టేక్ ఓవర్ కోడ్ ప్రకారం ఎంఫసిస్ కంపెనీ 26 శాతం అదనపు షేర్లను ఓపెన్ ఆఫర్లో ఉంచినట్టు బ్లాక్ స్టోన్ సంస్థ సోమవారం స్టాక్ ఎక్సేంజ్ లకు తెలిపింది. ఒక్కో షేరుకు రూ.430ను చెల్లిస్తున్నట్టు ఆ సంస్థ ప్రకటించింది.
నేషనల్ స్టాక్ ఎక్సేంజ్, బీఎస్ఈలో నమోదైన కంపెనీలో ఎంఫసిస్ ఒకటి కాబట్టి బీఎస్ఈలో ఆ షేరు ధర 1.48 శాతం తగ్గి, రూ.460.50 వద్ద నమోదైంది. బ్యాంకింగ్, ఫైనాన్సియల్, ఇన్సూరెన్స్, డిజిటల్ సర్వీసులు అందిస్తున్న కంపెనీల్లో ఎంఫసిస్ ఎక్కువ లాభాలు ఆర్జిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ వినియోగదారులను కలిగిఉన్న ఎంఫసిస్ 16 దేశాల్లో సేవలను అందిస్తోంది. ఆ కంపెనీలో 24 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.
ఎంఫసిస్, బ్లాక్ స్టోన్ ల మధ్య భారీ ఒప్పందం
Published Mon, Apr 4 2016 2:26 PM | Last Updated on Sun, Sep 3 2017 9:12 PM
Advertisement
Advertisement