తన ఆఖరి టెస్టుకు ముందు సెలక్టర్లు తనతో వ్యవహరించిన తీరు పట్ల వీరేంద్ర సెహ్వాగ్ అసంతృప్తి వ్యక్తం చేశాడు.
రిటైర్మెంట్‌పై సెహ్వాగ్ వ్యాఖ్య
న్యూఢిల్లీ: తన ఆఖరి టెస్టుకు ముందు సెలక్టర్లు తనతో వ్యవహరించిన తీరు పట్ల వీరేంద్ర సెహ్వాగ్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఆ సమయంలో తగిన అవకాశాలు ఇవ్వకుండానే వేటు వేశారని, కనీసం తనతో మాట్లాడి ఉంటే గౌరవంగా తప్పుకునేవాడినని అతను అన్నాడు. ‘2013 ఆస్ట్రేలియా సిరీస్ సందర్భంగా తప్పించే ముందు సెలక్టర్లు నా భవిష్యత్తు ప్రణాళికల గురించి అడిగితే అదే సిరీస్‌లో రిటైర్మెంట్ ప్రకటించి ఒక ప్రసంగం కూడా చేసేవాడిని. కానీ నాకు మరోలా రాసి పెట్టి ఉంది’ అన్నాడు.
గతంలో 2007లోనే జట్టులోంచి తొలగించినప్పుడు రిటైర్ అవుదామనుకున్నానని, అయితే సచిన్ నచ్చజెప్పడంతో ఆగిపోయానని వీరూ గుర్తు చేసుకున్నాడు. కామెంటరీ చేస్తే తన ఆటలాగే కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడతానని అన్నాడు.