ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశాల జాబితా గురించి విన్నాం. ప్రతిసారి ఫిన్లాండ్ అగ్రస్థానంలో నిలిచి సంతోషానికి ప్రతికగా నిలుస్తోంది. మరికొన్ని దేశాలు కొద్ది తేడాలతో సంతోషకరమైన దేశాలుగా మొదటి పదిస్థానాల్లో నిలిచి మరింత ఆనందంగా జీవించేలా అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తున్నాయి. అయితే ఆ సంతోషానికి కనుచూపు మేరలో కూడా లేకుండా తీవ్ర అసంతృప్తితో కొట్టుమిట్టాడుతున్న దేశాలు కూడా ఉన్నాయి. ఆ దేశాల జాబితా, అందుకు గల కారణాలు తోపాటు భారత్ ఏ స్థానంలో ఉందో చూద్దామా..
ప్రపంచవ్యాప్తంగా ఆనంద స్థాయిలలో వైవిధ్యాలను నిర్ణయించడానికి ఆరు కీలక అంశాలను పరిగణలోనికి తీసుకుంటుంది ప్రపంచ సంతోష నివేదిక. ఈ అంశాల్లో సామాజిక మద్దతు, ఆరోగ్యం, ఆదాయం, స్వేచ్ఛ, దాతృత్వం, అవినీతి లేకపోవడం తదితరాల ఆధారంగా జాబితాను అందిస్తుంది. వాటన్నింటిలో వెనుకబడి ఉండి అత్యల్ప సంతోషకరమైన దేశాలుగా నిలిచిన దేశాలేవంటే..
అఫ్ఘనిస్తాన్..
ప్రపంచ సంతోష సూచికలో 137 దేశాలలో అట్టడుగున ఉన్న ఆఫ్ఘనిస్తాన్తో తక్కువ ఆయుర్దాయం తోపాటు మహమ్మారికి ముందు నుంచి ఉన్న వివిధ నిరంతర సమస్యల సవాలును ఎదుర్కొంటుంది. దీనికి గొప్ప సాంస్కృతిక చరిత్ర ఉన్నప్పటికీ, పోరాటాలు, పౌరుల శ్రేయస్సును గణనీయంగా ప్రభావితం చేశాయి.
లెబనాన్..
అఫ్ఘనిస్తాన్ తర్వాత, లెబనాన్ రెండవ అత్యల్ప సంతోషకరమైన దేశంగా దురదృష్టకర ఘనతను కలిగి ఉంది. ఈ దేశంలో అత్యంత సంతోషకరమైన దేశాల కంటే ఆయుర్దాయం ఎక్కువగా ఉన్నప్పటికీ సామాజిక-రాజకీయ సవాళ్లు, ఆర్థిక అస్థిరతతో సతమతమవుతోంది.
సియెర్రా లియోన్..
ప్రపంచంలో మూడవ అత్యలప్ప సంతోషకరమైన దేశంగా ఆఫ్రికాలోని సియెర్రా లియోన్ నిలిచింది. తక్కువ సంతోష సూచికకు దోహదపడే ప్రత్యేకమైన సవాళ్లను ఎదుర్కొంటుంది. ఆర్థిక అసమానతలు, రాజకీయ అస్థిరత, సామాజిక అశాంతి తీవ్రంగా ఉన్నాయి
జింబాబ్వే..
ప్రపంచ సంతోష నివేదికలో నాల్గవ స్థానంలో ఉంది. యుద్ధంతో దెబ్బతిన్న అఫ్ఘనిస్తాన్, లెబనాన్, సియెర్రా లియోన్‌లతో పోలిస్తే జింబాబ్వే కొంచెం అనుకూలమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది. దేశం అల్లకల్లోల చరిత్ర, కొనసాగుతున్న సవాళ్లతో పోరాడుతోం. ఇది ఆ దేశలోని మొత్తం జనాభా శ్రేయస్సును తీవ్రంగా ప్రభావితం చేస్తోంది.
డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో..
ఈ దేశం ఐదవ స్థానాన్ని దక్కించుకుంది. డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో సుదీర్ఘ చరిత్ర సంఘర్షణ, రాజకీయ తిరుగుబాటు, నిరంకుశ పాలన, బలవంతంగా స్థానభ్రంశం తదితర సవాళ్లను ఎదుర్కొంటుంది. ఈ అంశాలన్ని అత్యల్ప సంతోషానికి సూచిక.
బోట్స్వానా..
బోట్స్వానా అఫ్ఘనిస్తాన్, లెబనాన్ వంటి దేశాల కంటే కొంచెం ముందుంది. ఇక్కడ సాపేక్ష స్థిరత్వం ఉన్నప్పటికీ, సామాజిక శ్రేయస్సలో వెనుబడి ఉండటంతో అత్యల్ప సంతోషకరమైన దేశాల్లో చేరింది.
మలావి..
వేగంగా పెరుగుతున్న జనాభా, సారవంతమైన భూమి, నీటిపారుదల లేకపోవడం వంటి సవాళ్లను ఎదుర్కొంటోంది మలావి. ఈ నేపథ్యంలోనే అక్కడ పౌరులు అనందానికి ఆమడం దూరంలో ఉండి, అసంతృప్తితో బతుకీడస్తన్నారు.
కొమొరోస్..
ఈ దేశం రాజకీయ తిరుగుబాట్లు కారణంగా కొమొరోస్‌ను ప్రపంచంలోని అత్యల్ప సంతోషకరమైన దేశాల జాబితాలో చేర్చింది. ఇక్కడ ఉన్న సామాజిక-రాజకీయ దృశ్యం ప్రజలపై గణనీయంగా ప్రభావితం చూపుతోంది. అందువల్లే ఈ దేశం అసంతృప్తి వాతవరణంగా తార స్థాయిలో నెలకొంది.
టాంజానియా..
ప్రధాన సంతోష సూచికలలో తక్కువ స్కోర్‌ల కారణంగా దీనిని ఈ జాబితాలో చేర్చారు. దేశం ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో పలు తీవ్ర సవాళ్లను ఎదుర్కుంటుంది. ఇది మొత్తం దేశం శ్రేయస్సును ప్రభావితం చేస్తుంది. అందవల్లే ఆధునిక ప్రపంచాన్ని నావిగేట్ చేయడంలో విఫలమవుతుంది. ఈ కారణాల రీత్యా అత్యల్ప సంతోషకరమైన దేశాల జాబితాలో చేరింది.
జాంబియా
అత్యల్స సంతోషకరమైన జాబితాలో చిట్టచివరన పదో స్థానంలో ఉన్న దేశం జాంబియా. దీన్ని సెంట్రల్ ఆఫ్రికన్ ఫెడరేషన్ అని పిలుస్తారు. ఇక్కడ ఉపాధి, రాజకీయ అనిశ్చిత, సామాజిక అసమానత తదితర సవాళ్లతో పోరాడుతోంది.
భారతదేశం ఈ జాబితాలో లేనప్పటికీ, అది చాలా వెనుకబడి లేదు. ‘ప్రపంచంలోని అత్యంత తక్కువ సంతోషకరమైన దేశంగా 12వ స్థానంలో ఉంది.
(చదవండి: అస్సాం సత్రియా చారిత్రాత్మక అరంగేట్రం)
Comments
Please login to add a commentAdd a comment