టీడీపీ-జనసేనల తాడేపల్లిగూడెం సభతో ఒక్క విషయంపై అయితే క్లారిటీ వచ్చేసింది. ముఖ్యంగా పవన్ కల్యాణ్ ఊగిపోతూ చేసిన ప్రసంగం తర్వాత.. రాష్ట్ర ప్రజానీకానికి, ఆయన అభిమానులకు ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. ఇక ‘మనం’ అనుకునే పవన్ కల్యాణ్ మనవాడు కాదు.. చంద్రబాబు వాడే అని తేటతెల్లమైపోయింది. జనసేన పార్టీ పెట్టి పదేళ్లు అవుతున్నా.. ఆ పార్టీ చంద్రబాబు కోసమే పెట్టిందని, పుట్టిందనే విషయం పవన్ కల్యాణ్ మాటల ద్వారా తేలిపోయింది.
తాడేపల్లిగూడెంలో సభలో "మనం ఏమీ చేయలేం, ఏమీ చేయలేం అంటూ 24 సీట్లతోనే" సరిపెట్టేసుకున్నట్లు కనిపించిన పవన్ కల్యాణ్.. చంద్రబాబు పన్నిన వలలో ఎలా చిక్కాడో అశేష రాష్ట్ర ప్రజానికానికి అర్థమైపోయింది. ఆవేశం తప్ప, పసలేని పవన్ కల్యాణ్ ప్రసంగంపై సామాన్యుడు ‘ఇదేంట్రా నాయనా’ అనుకుంటుంటే, నెటిజన్లు మాత్రం సోషల్ మీడియాలో ఆట ఆడేసుకుంటుకున్నారు. అందులో కొన్ని ఒక్కసారి చూద్దాం.
►వీరుడు ఉద్దండుడు అయిన బాబును 53 రోజులు జైల్లో పెడితే బాధేసింది : పవన్ కళ్యాణ్
చంద్రబాబు లక్ష కోట్లు దోచుకున్నాడు అని చెప్పిందే నువ్వు కదా పవన్
పైగా అమరావతి కాంట్రాక్టర్ల నుంచి బాబు పీఏ పెండ్యాల శ్రీనివాస్ చౌదరి ముడుపులు తీసుకొని బాబుకు ఇచ్చాను అని దర్యాప్తులో ఒప్పుకున్నాడు. అందుకే కదా కేంద్ర ఇన్‌కమ్ టాక్స్ వాళ్ళు నోటీస్ ఇచ్చారు కదా.! మరి ఈ విషయాన్నీ నీకు కేంద్ర నిఘా వర్గాలు చెప్పలేదా పవన్ కళ్యాణ్.?
►యుద్ధం అంటే ఏంటో నేను చూపిస్తా : పవన్ కళ్యాణ్
ఎందుకీ భారీ సినిమా డైలాగులు.?
(2019లో కూడ రాసి పెట్టుకోండి జగన్ ఎప్పటికీ సీఎం కాడు అన్నావుగా.!)
►అమరావతే ఏపీ రాజధాని : పవన్ కళ్యాణ్
అబ్బో ఆ రోజు ఏం చెప్పావు.? అమరావతి ఒక కుల రాజధాని అని అన్నావ్ కదా.!
బాబు నవ నగరాన్ని నిర్మించిన వ్యక్తి .. ఆయన అనుభవం కావాలి అని పొత్తుపెట్టుకున్నామరి అంత అనుభవం ఉన్న బాబుకు వ్యతిరేకంగా 2009 లో ప్రజారాజ్యం తరపున , 2009 లో నీవు ఎందుకు పోటీ చేసావ్.? హైటెక్ సిటీలో బాబు దోచుకున్నాడు అని నీవు చెప్పిన వీడియోలు యూట్యూబ్‌లో భద్రంగా ఉన్నాయి కదా.!
►నేను మీ కోసం సినిమా సంపాదన వదులుకొని వచ్చా : పవన్ కళ్యాణ్
సినిమాలలో ఓ వైపు నటిస్తూనే ఉన్నావు, పార్ట్‌టైమ్ పాలిటిక్స్ చేస్తూ నీతులెందుకు చెబుతావ్.?
(బ్రో, భీమ్లా నాయక్, వకీల్ సాబ్, అజ్ఞాతవాసి, కాటంరాయుడు .. ఇవన్నీ కొంపదీసి నీ తరపున డూప్ నటించాడా ఏంటి ?)
►24 యేనా ఇంతేనా అంటున్నారు ప్రత్యర్ధులు: పవన్ కళ్యాణ్
అబ్బబ్బ.. జనసేన మీద నీకెంత ప్రేమ.?
ఈ 24 లో కూడా కనీసం 10 -15 మంది టీడీపీ వాళ్లే పోటీ చేస్తారుగా.!
►వ్యూహం నాకొదిలేయండి, నాకు సలహాలు ఇచ్చే వాళ్ళు అక్కరలేదు, కొంతమంది నా నిర్ణయాలను ప్రశ్నిస్తున్నారు, నాతో నడిచేవాడే నావాళ్లు, పవన్ తో స్నేహమంటే సచ్చేదాకా, పవన్ తో పగ అంటే సచ్చేదాకా : పవన్ కళ్యాణ్
(ఇంతకుముందు బాబును కూడా చాల తిట్టావ్ కదా, మా అమ్మను తిట్టించిన బాబును వదలను అన్నావు కదా, మరి ఇప్పుడెందుకు మోస్తున్నావ్.!)
►విశ్వామిత్రుడు బ్రహ్మపదానికి వెళ్లింది 24తోనే. గాయత్రి మంత్రం 24 అక్షరాలు. అందుకే 24 సీట్లకు ఒప్పుకున్నా: పవన్ కళ్యాణ్
ఒకవేళ చంద్రబాబు...
- 10 సీట్లు ఇస్తే... దశావతారాలు.
- 9 సీట్లు ఇస్తే నవగ్రహాలు.
- 8 సీట్లు అష్ట దిక్పాలకులు.
- 7 సీట్లు ఇస్తే సప్త ఋషులు.
- 6 సీట్లు ఇస్తే షట్చక్రవర్తులు
- 5 సీట్లు ఇస్తే పంచభూతాలు
- 4 సీట్లు ఇస్తే నాలుగు దిక్కులు
- 3 సీట్లు ఇస్తే త్రిమూర్తులు
- 2 సీట్లు నర నారాయణులు.
- 1 సీటు ఇస్తే ఏక లింగేశ్వరుడు
అని కలరింగ్ ఇచ్చేవాడివా పవన్ కళ్యాణ్.?
►నాకు ప్రశ్నలు వేసే అభిమానులు కాదు, నన్ను విమర్శించే నాయకులు వద్దు : పవన్ కళ్యాణ్
నాకు జెండా కూలీలు కావాలి నేను తీసుకున్న ప్యాకేజీకి మీరు జై కొట్టాలి.. ఇదేనా మీ అర్థం పవన్.?
Comments
Please login to add a commentAdd a comment