Minister Manikya Rao
-
ఆగస్టు 12 నుంచి కృష్ణా పుష్కరాలు
పుష్కరాల నిర్వహణపై ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష సాక్షి, విజయవాడ బ్యూరో: ఈ ఏడాది ఆగస్టు 12 నుంచి కృష్ణా పుష్కరాలు జరగనున్నట్లు ఏపీ దేవాదాయ మంత్రి మాణిక్యాలరావు తెలిపారు. శుక్రవారం క్యాంపు కార్యాలయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కృష్ణా పుష్కరాలపై సమీక్ష నిర్వహించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. కృష్ణా పుష్కరాల కోసం నూతనంగా 280 ఘాట్లు నిర్మించనున్నట్లు చెప్పారు. అమరావతిలో ఘాట్ల నిర్మాణంతో పాటు కృష్ణా పరీవాహక ప్రాంతాన్ని సుందరంగా తీర్చిదిద్దుతామన్నారు. గోదావరి, కృష్ణా సంగమంలో ఘాట్ల నిర్మాణంపై మార్చి 15న మరోసారి సమీక్ష నిర్వహిస్తానని సీఎం చెప్పినట్లు వెల్లడించారు. కాగా, గోదావరి పుష్కరాల్లో జరిగిన తప్పిదం పునరావృతం కాకుండా చూడాలని సమీక్ష సందర్భంగా అధికారులను సీఎం ఆదేశించారు. గోదావరి పుష్కరాల సందర్భంగా గోదావరి-కృష్ణా నదుల అనుసంధానానికి సంకల్పం తీసుకున్నట్లు వివరించారు. అలాగే కృష్ణా పుష్కరాలను కూడా నదుల అనుసంధానికి సంకల్పంగా స్వీకరించాలన్నారు. పూణె ఎంఐటీ(మహారాష్ట్ర ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) ప్రతినిధి బృందం శుక్రవారం క్యాంపు కార్యాలయంలో చంద్రబాబును కలిసింది. యువతకు నాయకత్వ లక్షణాల్లో శిక్షణ ఇస్తున్నట్లు ముఖ్యమంత్రికి సంస్థ ఉపాధ్యక్షుడు రాహుల్ విశ్వనాథ్ కరాడ్ తెలిపారు. -
దేవాలయాల ఆస్తుల పరిరక్షణకు కమిటీ
త్వరలోనే ముఖ్యమైన దేవాలయాలకు ట్రస్టులు ఇతర మతాల వారికి దేవాలయాల్లో ఉద్యోగావకాశాలు లేవ్ ‘సాక్షి’తో రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి మాణిక్యాలరావు విజయవాడ : రాష్ట్రంలోని దేవాలయాల ఆస్తుల్ని పరిరక్షించేందుకు త్వరలోనే రాష్ట్ర స్థాయిలో ఒక కమిటీ వేస్తామని దేవాదాయ శాఖ మంత్రి పీ మాణిక్యాలరావు ప్రకటించారు. హైకోర్టు రిటైర్డ్ జడ్జిలు, లీగల్ సెక్రటరీలుగా పనిచేసినవారు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారన్నారు. దేవాలయాల ఆస్తులు నాలుగైదేళ్లుగా కోర్టులో ఉన్నట్లయితే అటువంటి కేసులను ఈ కమిటీ పరిశీలిస్తుందని వెల్లడించారు. శనివారం డాక్టర్ శ్యామ్‌ప్రసాద్ ముఖర్జీ ట్రస్టు ఆధ్వర్యంలో జరిగిన భూమి పూజ కార్యక్రమానికి హాజరైన మంత్రి మాణిక్యాలరావు ‘సాక్షి’తో మాట్లాడారు. న్యాయస్థానాల్లో ఉన్న దేవాలయాల కేసులన్నీ సత్వరం పరిష్కరించి, వాటి ఆదాయం పెంచాలనే ఉద్దేశంతోనే ఈ కమిటీని వేసినట్లు ఆయన వెల్లడించారు. ఈ కమిటీ కేసుల్ని పరిశీలించి సలహాలు, సూచనలు చేస్తుందే తప్ప ఏ విధమైన అధికారాలూ అప్పగించబోమని తెలిపారు. 6 సీ దేవాలయాల సిబ్బందికి వేతనాలు రాష్ట్రంలో కొన్ని దేవాలయాల్లో అర్చకులు అనేక ఇబ్బందులు పడటం గురించి స్పందిస్తూ ఆదాయం తక్కువగా ఉన్న 6సీ దేవాలయాల్లో పనిచేసే అర్చకులు, ఇతర సిబ్బందికి నెలకు రూ.5 వేలు చొప్పున దేవాదాయ శాఖ నుంచి ఇచ్చేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని మంత్రి చెప్పారు. సిబ్బందికి వచ్చే జీతాలు ఇందులోంచి మినహాయించాలా.. లేక జీతానికి అదనంగా రూ.5 వేలు ఇవ్వాలా అనే అంశాన్ని ఇంకా నిర్ణయించాల్సి ఉందన్నారు. దీనివల్ల దేవాలయాల్లో పనిచేసే సిబ్బంది ఆర్థిక పరిస్థితులు బాగుపడతాయన్నారు. గోదావరి పుష్కరాల సందర్భంగా ఉభయగోదావరి జిల్లాల్లో ఉన్న అన్ని దేవాలయాలను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. సుమారు రూ.60 కోట్ల బడ్జెట్ కేటాయించి పుష్కర ఏర్పాట్లతో పాటు దేవాలయాల్లో మౌలిక సదుపాయాలు, రంగులు వేయించడం చేస్తున్నామన్నారు. దేవాలయాల్లో అన్యమతస్తులకు ఉద్యోగావకాశం కల్పించబోమన్నారు. దేవాదాయ శాఖలో సెక్యులర్ సిబ్బంది అనేది కుదరదని, తప్పనిసరిగా హిందువై ఉండాలని స్పష్టం చేశారు. ఏటా సిబ్బందికి డిక్లరేషన్ తప్పనిసరి తాను మత మార్పిడి చేసుకోలేదని, హిందువుగానే ఉన్నానని సిబ్బంది ప్రతి ఏడాదీ డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుందని మంత్రి చెప్పారు. దేవాలయాల్లో ధార్మిక, ధార్మికేతర సిబ్బంది ఉన్నారని, ధార్మికేతర సిబ్బందిని అన్యమతస్తులు అనుకుంటున్నారని తెలిపారు. అర్చకులు కాకుండా ఇతర సిబ్బందిని ధార్మికేతర సిబ్బందిగా వ్యవహరిస్తామన్నారు. చిత్తూరులో ఎన్నికల కోడ్ అమలులో ఉండటం వల్లనే టీటీడీకి ట్రస్టు బోర్టు వేయడం కుదరలేదన్నారు. కోడ్ రావడానికి ముందు ముఖ్యమంత్రి పర్యటనలతో హడావుడిగా ఉండటం వల్ల కమిటీ వేయలేదని తెలిపారు. ఈసారి 19 మంది ట్రస్టు బోర్డులో ఉంటారని, దేశవ్యాప్తంగా సభ్యుల్ని తీసుకుంటామని వెల్లడించారు. -
మోడల్ గోశాలగా మారుస్తాం
గోవు మాతృమూర్తితో సమానం గో ఆధారిత వ్యవసాయమే ఉత్తమమార్గం మంత్రి మాణిక్యాలరావు తిరుపతి తుడా : టీటీడీ ఆధ్వర్యంలో న డుస్తున్న ఎస్వీ గో సంరక్షణ శాలను మో డల్ గోశాలగా మార్చేందుకు చర్యలు చేపడుతున్నామని దేవాదాయ ధర్మాదాయశాఖ మంత్రి మాణిక్యాలరావు తెలిపారు. గో వ్యవసాయ ఆరోగ్య విజ్ఞాన కేంద్రం ఆదివారం తిరుపతి ఎస్వీ గో సంరక్షణశాలలో ఏపీ గో శాలల నిర్వహణ ప్రతినిధుల సదస్సు నిర్వహిం చింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మం త్రి మాణిక్యాలరావు మాట్లాడుతూ దేశీ య గోవుల నిర్వహణ, సంరక్షణ లక్ష్యం గా మోడల్ గోశాలగా తీర్చిదిద్దనున్నట్టు చెప్పారు. ఇక్కడ నుంచి ఇతర గో సంరక్షణ శాలలకు విస్తరింపవచ్చన్నారు. దేశీయ గోవుల సంరక్షణతోపాటు పునరుత్పత్తి, వ్యర్థాలతో ఔషధాల తయారీ సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు చర్యలు చేపట్టాలని టీటీడీ అధికారులకు సూచించారు. తిరుమలకు వచ్చే భక్తులు మోడల్ గోశాలను సందర్శించే విధంగా రూపురేఖలు మారుతాయన్నారు. హిం దూ సనాతన ధర్మంలో గోవును మాతృమూర్తితో సమానంగా భావిస్తారన్నారు. ఈ విషయాన్ని ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లాలని సూచించారు. గో ఆధారిత వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడం ద్వారా ఉత్తమమైన దిగుబడులు సాధించవచ్చన్నారు. అంతకు ముందు జేఈవో భాస్కర్‌తో కలిసి మంత్రి గో పూజ చేశారు. అనంతరం గోవులకు దాణా తినిపించారు. ఎగ్జిబిషన్‌ను సందర్శించారు. ఈ కార్యక్రమంలో చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, తిరుపతి జేఈవో పోలా భాస్కర్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్‌రెడ్డి, ఎస్వీ గో సంరక్షణశాల డెరైక్టర్ హరినాథరెడ్డి, బీజేపీ నేత సామంచి శ్రీనివాస్, ఏపీ గో సంరక్షణ శాలల ని ర్వాహకులు కుమారస్వామి, సుబ్బరాజు, దామోదర్ పాల్గొన్నారు. వకుళామాత ఆలయానికి జీర్ణోద్ధరణ తిరుపతి రూరల్: వేంకటేశ్వరస్వామి తల్లి వకుళామాత ఆలయానికి త్వరలో జీర్ణో ద్ధరణ చేస్తామని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు తెలిపారు. తిరుపతికి సమీపంలోని పేరూరు బండపై ఉన్న వకుళామాత ఆలయాన్ని ఆదివారం ఆయన సందర్శించారు. మైనింగ్ వల్ల దుస్థితికి చేరిన ఆలయాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆలయాలు దేశ సంస్కృతి, సంప్రదాయాలకు ఆనవాళ్లన్నారు. కొందరు స్వార్థపరులు స్వాలాభం కోసం ఆలయాలను ధ్వంసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వేలకోట్ల సంపద ఉన్న శ్రీవారి తల్లి కొలువైన ఆలయం శిథిలావస్థకు చేరటం సమాజానికి మంచిదికాదన్నారు. అందుకే వకుళామాత ఆలయాన్ని త్వరలోనే జీర్ణోద్ధరణ చేసి భక్తులందరూ దర్శించుకునేలా చేస్తామని చెప్పారు. నిలదీసిన స్థానికులు వకుళమాత ఆలయం వద్ద పాత కాల్వ సర్పంచ్ మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో స్థానికులు మంత్రి మణిక్యాలరావుని నిలదీశారు. ఎన్నో ఏళ్లుగా బండనే నమ్ముకుని జీవిస్తున్న స్థానికులకు ఉపాధి చూపిన తర్వాత జీర్ణోద్ధరణ కోసం రాయిని కదపాలని డిమాండ్ చేశారు. 4 ఏళ్లుగా ఉపాధి లేక కుటుంబాలు వలస వెళ్లే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇదంతా ప్రజా ప్రతినిధులు, అధికారులు, స్వామీజీల మాయమాటలు వల్లేనని కన్నీరు పెట్టుకున్నారు. దీంతో జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి ఉపాధి కల్పిస్తానని మంత్రి జారుకున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు భానుప్రకాష్‌రెడ్డి, సామంచి శ్రీనివాస్, కోలా భాస్కర్, వరప్రసాద్, గోపి, జాషువా, సర్పంచ్ మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. -
సమస్యల పరిష్కారమే అజెండా
తాడేపల్లిగూడెం /పెంటపాడు :తాడేపల్లిగూడెం పట్టణ సమస్యల పరిష్కారమే తన ధ్యేయమని దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు పేర్కొన్నారు. గూడెంలో బుధవారం ఆయన వార్డు బాట చేపట్టారు. ఒకటో వార్డు గణేష్ నగర్ గుడి నుంచి 4 వార్డు డీఎస్ చెరువు వరకు కాలినడకన పర్యటించారు. 1, 2, 3, 4, వార్డులలో డ్రెయినేజీ, నీటి సరఫరా, లో వోల్టేజ్, పందుల స్వైరవిహారం సమస్యలను, ఇళ్ల స్థలాలు, రేషన్ కార్డుల మంజూరు తదితర అంశాలను స్థానికులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. పలువురు వినతులు అందించారు. మాణిక్యాలరావు మాట్లాడుతూ సమస్యలను గుర్తించి సాధ్యమైనంత తొందరగా పరిష్కరించేందుకు కృషిచేస్తామన్నారు. వీధికుళాయిల వద్ద అధికంగా మహిళలు ఉండటం గమనించిన మంత్రి కుళాయి కనెక్షన్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని వారికి సూచించారు. వేకువజాము 5 గంటలకు వార్డు పర్యటనకు బయలు దేరిన ఆయన ఉదయం 9 గంటల వరకు వార్డులలోనే గడిపారు. మధ్యలో కనిపిం చిన పలు ఆలయాల్లో ఆయన పూజ చేయిం చారు. మునిసిపల్ కమీషనర్ టి.నిరంజన్‌రెడ్డి, తహసిల్దార్ పాశం నాగమణి, దేవాదాయ శాఖ అధికారి కేవీవీ రమణ, మునిసిపల్ చైర్మన్ అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్, ఆయా వార్డుల కౌన్సిలర్లు రాంపండు, కొల్లి రమావతి, అడపా జమున, సింగం సుబ్బారావు పాల్గొన్నారు. బీజేపీలో చేరికలు తాడేపల్లిగూడెం : దేవాదాయ శాఖ మంత్రి ైపైడికొండల మాణిక్యాలరావు సమక్షంలో బుధవారం పలువురు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. భీమడోలు మండలం గుండుగొలనుకు చెందిన వగ్వాల అచ్యుతరామయ్యతోపాటు ఎల్.ప్రకాశరావు, పి.రాంబాబు, తాడేపల్లిగూడెంకు చెందిన కైండ్‌నెస్ సొసైటీ అధ్యక్షుడు గట్టిం మాణిక్యాలరావు బీజేపీలో చేరారు. వారికి పార్టీ కండువాలు వేసి మంత్రి ఆహ్వానించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు భూపతిరాజు శ్రీనివాసవర్మ మాట్లాడుతూ పార్టీ జిల్లాలో బలమైన శక్తిగా తయారవుతోందన్నారు. పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొండేపాటి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. పురాతన ఆలయాలకు ప్రాభవం తీసుకొస్తా ... తణుకు : పురాతన ఆలయాలను గుర్తించి వాటికి ప్రాభవం తీసుకువచ్చేందుకు చర్యలు చేపడతామని దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు చెప్పారు. బుధవారం తణుకులోని బీజేపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో 25వేల ఎకరాల దేవాదాయ శాఖ భూములు కజ్జాకు గురైనట్లు గుర్తించామన్నారు. వాటిపై కోర్టుల్లో వాజ్యాలుండటంతో రిటైర్డ్ హైకోర్టు జడ్జిలతో కమిటి వేసి వాటిని పరిష్కరించాలని యోచిస్తున్నట్టు వివరించారు. దేవాదాయ శాఖ ఆస్తుల వివరాలను వెబ్సైట్లో పొందుపర్చటంతోపాటు, ఆలయాల జమా ఖర్చులన్నీ పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు. భక్తులు ఇచ్చే కానుకలకు ఆలయ అధికారుల జవాబుదారీతోపాటు వాటిని దేనికోసం సమర్పించారో దానికే వినియోగిస్తామన్నారు. దేవాలయ భూముల కౌలు తక్కువుగా ఉన్నచోట పెంచే మార్గాలను అన్వేషిస్తామని ఈ విషయంలో కౌలు రైతుల పట్ల మానవాతా దృక్పథంతో వ్యవహరిస్తామని వివరించారు. దేవాలయాలు వ్యాపార సంస్థలు కావని కౌలు వ్యత్యాసం మరీ ఎక్కువుగా ఉంటేనే పెంచే విషయంపై దృష్టిసారిస్తామన్నారు. దేవాదాయశాఖ పరిధిలోకి రాని ఆలయాల్లోను నిత్య ధూప దీప నైవేద్యాలు జరిగేలా ఆధ్యాత్మిక భావాలు కలిగిన వ్యక్తులు, ధార్మిక సంస్థల సహాయం తీసుకుంటామన్నారు. దేవాదాయ శాఖలో మిగులు సిబ్బంది ఉన్నట్టు గుర్తించామని, వారి సేవలను ఎలా వినియోగించుకోవాలనే దానిపై చీఫ్ సెక్రటరీతో కమిటీ వేస్తామన్నారు. మానవ సేవే దైవ సేవ అనే రీతిలో పెద్ద ఆలయాలకు అనుబంధంగా వైద్య, విద్య సౌకర్యాలు కల్పిస్తామన్నారు. దేవాలయ భూముల్లో నిర ్వ హిస్తున్న తణుకు చిట్టూరి ఇంద్రయ్య ప్రభుత్వ కళాశాల అంశాన్ని పరిశీలించి తగుచర్యలు తీసుకుంటామన్నారు. బీజేపీ నాయకులు శ్రీనివాసవర్మ, వీవీఎస్ వర్మ, వైడీ కృష్ణయ్య, మల్లిన రాధాకృష్ణ, శేషాద్రిశాస్త్రి పాల్గొన్నారు.