మోడల్ గోశాలగా మారుస్తాం | The model will change as Gaushala | Sakshi
Sakshi News home page

మోడల్ గోశాలగా మారుస్తాం

Published Mon, Dec 22 2014 2:41 AM | Last Updated on Sat, Sep 2 2017 6:32 PM

మోడల్ గోశాలగా మారుస్తాం

మోడల్ గోశాలగా మారుస్తాం

గోవు మాతృమూర్తితో సమానం
గో ఆధారిత వ్యవసాయమే ఉత్తమమార్గం
మంత్రి మాణిక్యాలరావు
 

తిరుపతి తుడా : టీటీడీ ఆధ్వర్యంలో న డుస్తున్న ఎస్వీ గో సంరక్షణ  శాలను మో డల్ గోశాలగా మార్చేందుకు చర్యలు చేపడుతున్నామని దేవాదాయ ధర్మాదాయశాఖ మంత్రి మాణిక్యాలరావు తెలిపారు. గో వ్యవసాయ ఆరోగ్య విజ్ఞాన కేంద్రం ఆదివారం తిరుపతి ఎస్వీ గో సంరక్షణశాలలో ఏపీ గో శాలల నిర్వహణ ప్రతినిధుల సదస్సు నిర్వహిం చింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మం త్రి మాణిక్యాలరావు మాట్లాడుతూ దేశీ య గోవుల నిర్వహణ, సంరక్షణ లక్ష్యం గా మోడల్ గోశాలగా తీర్చిదిద్దనున్నట్టు చెప్పారు. ఇక్కడ నుంచి ఇతర గో సంరక్షణ శాలలకు విస్తరింపవచ్చన్నారు. దేశీయ గోవుల సంరక్షణతోపాటు పునరుత్పత్తి, వ్యర్థాలతో ఔషధాల తయారీ సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు చర్యలు చేపట్టాలని టీటీడీ అధికారులకు సూచించారు. తిరుమలకు వచ్చే భక్తులు మోడల్ గోశాలను సందర్శించే విధంగా రూపురేఖలు మారుతాయన్నారు. హిం దూ సనాతన ధర్మంలో గోవును మాతృమూర్తితో సమానంగా భావిస్తారన్నారు. ఈ విషయాన్ని ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లాలని సూచించారు. గో ఆధారిత వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడం ద్వారా ఉత్తమమైన దిగుబడులు సాధించవచ్చన్నారు.

అంతకు ముందు జేఈవో భాస్కర్‌తో కలిసి మంత్రి గో పూజ చేశారు. అనంతరం గోవులకు దాణా తినిపించారు. ఎగ్జిబిషన్‌ను సందర్శించారు. ఈ కార్యక్రమంలో చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, తిరుపతి జేఈవో పోలా భాస్కర్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్‌రెడ్డి, ఎస్వీ గో సంరక్షణశాల డెరైక్టర్ హరినాథరెడ్డి, బీజేపీ నేత సామంచి శ్రీనివాస్, ఏపీ గో సంరక్షణ శాలల ని ర్వాహకులు కుమారస్వామి, సుబ్బరాజు, దామోదర్ పాల్గొన్నారు.

వకుళామాత ఆలయానికి జీర్ణోద్ధరణ

తిరుపతి రూరల్: వేంకటేశ్వరస్వామి తల్లి వకుళామాత ఆలయానికి త్వరలో జీర్ణో ద్ధరణ చేస్తామని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు తెలిపారు. తిరుపతికి సమీపంలోని పేరూరు బండపై ఉన్న వకుళామాత ఆలయాన్ని ఆదివారం ఆయన సందర్శించారు. మైనింగ్ వల్ల దుస్థితికి చేరిన ఆలయాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆలయాలు దేశ సంస్కృతి, సంప్రదాయాలకు ఆనవాళ్లన్నారు. కొందరు స్వార్థపరులు స్వాలాభం కోసం ఆలయాలను ధ్వంసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వేలకోట్ల సంపద ఉన్న శ్రీవారి తల్లి కొలువైన ఆలయం శిథిలావస్థకు చేరటం సమాజానికి మంచిదికాదన్నారు. అందుకే వకుళామాత ఆలయాన్ని త్వరలోనే జీర్ణోద్ధరణ చేసి భక్తులందరూ దర్శించుకునేలా చేస్తామని చెప్పారు.
 
నిలదీసిన స్థానికులు


వకుళమాత ఆలయం వద్ద పాత కాల్వ సర్పంచ్ మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో స్థానికులు మంత్రి మణిక్యాలరావుని నిలదీశారు. ఎన్నో ఏళ్లుగా బండనే నమ్ముకుని జీవిస్తున్న స్థానికులకు ఉపాధి చూపిన తర్వాత జీర్ణోద్ధరణ కోసం రాయిని కదపాలని డిమాండ్ చేశారు. 4 ఏళ్లుగా ఉపాధి లేక కుటుంబాలు వలస వెళ్లే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇదంతా ప్రజా ప్రతినిధులు, అధికారులు, స్వామీజీల మాయమాటలు వల్లేనని కన్నీరు పెట్టుకున్నారు. దీంతో జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి ఉపాధి కల్పిస్తానని మంత్రి జారుకున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు భానుప్రకాష్‌రెడ్డి, సామంచి శ్రీనివాస్, కోలా భాస్కర్, వరప్రసాద్, గోపి, జాషువా, సర్పంచ్ మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement