పీడీఎస్ బియ్యం పట్టివేత
పీడీఎస్ బియ్యం పట్టివేత
Published Mon, Oct 3 2016 10:24 PM | Last Updated on Mon, Sep 4 2017 4:02 PM
మిర్యాలగూడ
మిర్యాలగూడలోని మండల పరిషత్ కార్యాలయం ఎదుట ఓ దుకాణంలో సోమవారం సివిల్ సప్లయిస్ విజిలెన్స్ అధికారులు 50 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం, నూకల మిక్సింగ్‌ను పట్టుకున్నారు. గత నెల 28వ తేదీన సాక్షిలో ‘ కొత్త దందా’ శీర్షికన రేషన్ బియ్యం దందాపై ప్రచురించిన కథనానికి అధికారులు స్పందించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ బియ్యం– నూకల మిక్సింగ్, బియ్యం విక్రయాలు, నూకల నిల్వలపై దాడులు నిర్వహంచాలని సివిల్‌సప్లయిస్ అధికారులను ఆదేశించారు. కాగా నాటి నుంచి విజిలెన్స్ అధికారులు పట్టణంతో పాటు గ్రామీణ ప్రాంతాలలో కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆదివారం రాత్రి మిర్యాలగూడ ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఉన్న దుకాణంలో నూకలు – బియ్యం నిల్వ ఉన్న విషయాన్ని తెలుసుకున్న వన్‌టౌన్ సీఐ భిక్షపతి దుకాణాన్ని సీజ్ చేశారు. కాగా సోమవారం సివిల్ సప్లయిస్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. పీడీఎస్ బియ్యం – నూకల మిక్సింగ్‌గా గుర్తించి 50 క్వింటాళ్లను సీజ్ చేశారు. అనంతరం సివిల్ సప్లయిస్ హుజూర్‌నగర్ డిప్యూటీ తహసీల్దార్ చంద్రశేఖర్ విలేకరులతో మాట్లాడుతూ మహేశ్వరి ఎంటర్‌ప్రైజెస్ దుకాణంలో ఉన్న బియ్యం –నూకల మిక్సింగ్‌ను సీజ్ చేసి వ్యాపారి అమర్‌నాథ్‌పై సివిల్ సప్లయిస్ యాక్ట్ 6(ఎ) కేసు నమోదు చేసినట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో కొత్త చట్టం ప్రకారం రేషన్ బియ్యం కొనుగోలు చేసినా, విక్రయించినా చర్యలు తీసుకుంటామని, క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని చెప్పారు. ఆయన వెంట సివిల్ సప్లయిస్ పెద్దవూర డిప్యూటీ తహసిల్దార్ లక్ష్మణ్, మిర్యాలగూడ ప్రొక్యూర్‌మెంట్ ఆర్‌ఐ దీపక్ ఉన్నారు.
Advertisement