పీడీయస్ బియ్యం పట్టివేత
చిట్యాల : మండలంలోని వట్టిమర్తి శివారులో పీడీయస్ బియ్యం లోడుతో వెళ్తున్న వాహనాన్ని శుక్రవారం పట్టుకున్నట్లు ఎస్‌ఐ ఏ.శివకుమార్ తెలిపారు. వివిధ గ్రామాల నుంచి సేకరించిన 25 క్వింటాళ్ల పీడీయస్ బియ్యంను మండలంలోని పెద్దకాపర్తి శివారులోని కోళ్ల ఫారాలకు అందజేసేందుకు వెళ్తుండగా మండలంలోని వట్టిమర్తి శివారులో పట్టుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు పంచానామ నిర్వహించి రెవెన్యూ అధికారులకు అప్పగించినట్లు ఎస్‌ఐ తెలిపారు.