25 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
చిలుకూరు: అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యంను మండలంలోని బేతవోలు గ్రామ శివారులో బుధవారం అర్ధరాత్రి పోలీసులు పట్టుకున్నారు. ఎస్‌ఐ టి. రాము తెలిపిన వివరాల ప్రకారం విశ్వసనీయ సమాచారం మేరకు మండలంలోని బేతవోలు గ్రామం శివారులో ∙రేషన్ బియ్యంతో వస్తున్న వ్యాన్‌ను పట్టుకున్నట్లుగా తెలిపారు. వ్యాన్‌లో అక్రమంగా 25 క్వింటాళ్ల బియ్యంను తరలిస్తున్నరని తెలిపారు. ఈ విషయంపై విచారణ చేసి పలువురిపై కేసు నమోదు చేసినట్లుగా తెలిపారు. అక్రమ రేషన్ బియ్యం తరలించిన, కొనుగోలు చేసిన, అమ్మినా కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. అక్రమంగా ఏవరైనా రేషన్ బియ్యంను తరలిస్తే వెంటనే 94407 00058 నంబర్‌కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని కోరారు.