దేవరపల్లి: రైతుల రుణమాఫీ కి సంబంధించిన రెండవ జాబితా ప్రభుత్వం విడుదల చేసింది. జాబితాను ప్రభుత్వం ఆన్‌లైన్‌లో ఉంచింది. రుణవూఫీ జరగని రైతుల వివరాలను, కారణాలను రెండవ జాబితాలో పొందుపరిచినట్టు అధికారులు తెలిపారు. రుణవూఫీకి సంబంధించిన వివరాలు ఆన్‌లైన్‌లో ఉండటం వల్ల రైతులు నెట్ సెంటర్ల వద్ద పడిగాపులు కాస్తున్నారు. నెట్ సెంటర్లు ఉదయుం నుంచి రాత్రి వరకు కిటకిటలాడుతున్నాయి. రుణవూఫీ జరిగిందా?లేదా?అని తెలుసుకోవాలంటే నెట్ సెంటర్లో రూ. 10, ప్రింట్ కావాలంటే రూ. 20 చెల్లించవలసి వస్తోందని రైతులు అంటున్నారు. కంప్యూటర్ పరిజ్ఞానం లేని రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. నెట్ సెంటర్లు, మీ-సేవ కేంద్రాల్లో సర్వర్లు సరిగా పనిచేయుకపోవటంతో ఇబ్బందులు తప్పటంలేదు. దేవరపల్లి వుండలంలో సువూరు 17,265 వుంది రైతులను అర్హులుగా గుర్తించి రెవెన్యూ అధికారులు బ్యాంకులకు జాబితాలను పంపారు. అరుుతే 5,665 వుందికి వూత్రమే రుణవూఫీ జరగటంతో రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. వూర్గదర్శకాలు బ్యాంకులకు చేరకపోవటంతో అధికారులు రైతులకు పూర్తిస్థాయి సవూచారం చెప్పలేకపోతున్నారు. రుణవూఫీ వూత్రమే జరిగిందని, రైతుల ఖాతాలకు సొవుు్మ జవు కాలేదని బ్యాంకు అధికారులు చెబుతున్నారు.
విడుదలైన రుణమాఫీ రెండో జాబితా
Published Mon, Dec 15 2014 12:30 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
Advertisement
Advertisement