అరుదైన భారీ గిరి నాగు హల్‌చల్ | 20 Feet Dangerous Snake Found in Visakhapatnam District Madugula | Sakshi
Sakshi News home page

20 అడుగుల గిరి నాగు పట్టివేత

Published Mon, May 25 2020 9:57 AM | Last Updated on Mon, May 25 2020 10:39 AM

20 Feet Dangerous Snake Found in Visakhapatnam District Madugula - Sakshi

సాక్షి, విశాఖ: జిల్లాలోని దేవరాపల్లి మండలం తెనుగుపూడి అటవీ సెక్షన్‌ పరిధిలోని సమీప పంట పొలాల్లో ఆదివారం అరుదైన భారీ గిరి నాగు హల్‌చల్‌ చేసింది. ఇది సుమారు 20 అడుగుల పొడవు ఉండటంతో ఆందోళన చెందిన గ్రామస్తులు స్థానిక అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. అధికారుల ఆదేశాలతో విశాఖపట్నం తూర్పు కనుమల వన్యప్రాణి సంరక్షణ సమితి ప్రతినిధి మూర్తి అక్కడకు చేరుకుని, సుమారు రెండు గంటల పాటు శ్రమించి అతికష్టం మీద గిరినాగును పట్టుకున్నారు. అనంతరం దానిని సమీపంలోని రిజర్వ్‌ ఫారెస్ట్‌లో విడిచిపెట్టారు. (నేడు గన్నవరం, విశాఖ నుంచి విమాన సర్వీసులు రద్దు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement