
డాబాగార్డెన్స్(విశాఖ దక్షిణ): అరుదైన విషసర్పం కడలి ఒడికి చేరింది. విశాఖ నగరంలోని కాన్వెంట్ జంక్షన్ సమీపాన పారిశ్రామిక ప్రాంగణంలో మంగళవారం రాత్రి డాగ్ ఫేస్ సీ స్నేక్‌ను స్నేక్ క్యాచర్ రొక్కం కిరణ్ పట్టుకున్నారు.
కుక్క మొహం పోలికతో ఉండే ఈ పాము అతి ప్రమాదకరమైందని, దీని విషానికి విరుగుడు అందించే ఔషధం కూడా దొరకదని కిరణ్ తెలిపారు. తన 20 ఏళ్ల సర్వీస్‌లో దాదాపు 25 వేల పాముల్ని పట్టుకున్నానని, ఇటువంటి పామును మాత్రం ఎప్పుడూ చూడలేదని చెప్పారు. ఈ సర్పాలు సముద్ర తీర ప్రాంతాల్లో ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
చదవండి: భార్య ఉండగానే మరో మహిళతో లవ్ ఎఫైర్.. చివరికి బిగ్ ట్విస్ట్
Comments
Please login to add a commentAdd a comment