ఇవాళ వైజాగ్‌లో సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రసంగం విన్న ఎవరికైనా మనసులో ఒకటి కచ్చితంగా అనిపించి ఉంటుంది. ఏంటీ.. సీఎం జగన్ ఇంత కాన్ఫిడెంట్‌గా ఉన్నారు.? ఇంత బలంగా మాట్లాడుతున్నారని మనసులో తప్పకుండా అనుకుని ఉంటారు. ఎన్నికలు దగ్గర పడే కొద్దీ సీఎం జగన్‌లో ఉత్సాహం రెట్టింపవుతోంది. విశ్వాసం పెరిగిపోతుంది. దీనికి తన పాలనపై తనకు నమ్మకం ఉండటం వలన కావొచ్చు.
ఒక పక్క టీడీపీ - జనసేన పొత్తులతో కుస్తీ పడుతుంటే.. వైఎస్‌ఆర్ సీపీ మాత్రం తన ప్రశాంతంగా చేసుకుంటూ పోతోంది. ఇప్పటి వరకూ తాడే పల్లి ప్యాలస్.. తాడేపల్లి ప్యాలస్ అని కామెంట్ చేసినవారు.. ఇప్పుడు ఆ ప్యాలెస్‌లో ప్రశాంతంగా కూర్చొని ..సీఎం జగన్ ఆడే రాజకీయ చదరంగం చూసి వణికిపోవడమే కాదు బెంబేలెత్తుతున్నారు. "వచ్చే ఎన్నికల అనంతరం వైజాగ్ నుంచే పాలన సాగిస్తానని సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు. మళ్లీ గెలిచి వచ్చాక వైజాగ్‌లోనే సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తానన్నారు. విశాఖ అభివృద్ధికి అన్ని విధాలుగా కట్టుబడి ఉన్నానన్నారు." ఈ పదాలు పలుకుతున్నప్పుడు సీఎం జగన్ ముఖంలో ఆత్మవిశ్వాసం చూశారా.. యస్ నేను సాధిస్తాననే నమ్మకంలో ఆయన ముఖంలో అణువణువునా కనిపించింది. ఈ రోజు విశాఖలో జగన్ ఇచ్చిన స్పీచ్ ఉత్తరాంధ్రకే కాదు రాష్ట్రానికి భరోసానిచ్చింది. ఉత్తరాంధ్ర విజన్‌నే కాదు విశాఖ భవిష్యత్తును రాష్ట్ర బంగారు భవిష్యత్తు కోట్ల మంది కళ్లకు కనబడేలా ప్రసంగించారు. భవిష్యత్తులో విశాఖ నగరం హైదరాబాద్, చెన్నైల కంటే ఎక్కువుగా అభివృద్ధి చెందుతుందన్నారు.
తాను ఏ ప్రాంతానికి వ్యతిరేకం కాదన్నారు సీఎం జగన్. అమరావతిని శాసన రాజధానిగా ప్రకటించామని చెప్పారు. కర్నూలును న్యాయ రాజధానిగా ప్రకటించామన్నారు. అమరావతిలో మౌలిక సదుపాయాల కల్పనకే రూ.లక్ష కోట్లు అవసరమవుతాయని.. భవిష్యత్తులో రూ.10 నుంచి 15 లక్షల కోట్లకు చేరుకుంటుందని సీఎం జగన్ చెప్పారు. విశాఖ నుంచి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు వరకు 6 లైన్ల రహదారి విశాఖకు మణిమకుటం కానుందన్నారు.
రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యమిస్తున్నామని, దేశంలోనే వ్యవసాయ రంగంలో ఏపీ వాటా 70 శాతం వృద్ధి సాధించామని సీఎం జగన్ చెప్పారు. 58 నెలల వైఎస్ జగన్ పాలనలో ఆయన తీసుకొచ్చిన వ్యవసాయ రంగంలోని సంస్కరణలు ఏపీని దేశంలోనే మొదటి స్థానంలో నిలబెట్టాయి. RBKలు విత్తు నుంచి విక్రయం వరకు రైతులకు అండగా ఉంటున్నాయి. భవిష్యత్తులో ఆర్బీకేలు లావాదేవీ కేంద్రాలుగానే కాకుండా ప్రయోగ కేంద్రాలుగా కూడా మారబోతున్నాయి.
ఉత్పత్తి రంగంలో ఏపీ మెరుగ్గా దూసుకెళ్తుందని చెప్పారు సీఎం జగన్. మూలపేట, కాకినాడ, మచిలీపట్నం, రామాయపట్నం రేవులతో ఆంధ్రా తీరం రూపురేఖలు మారిపోతోంది. ఏపీలో తలసరి ఆదాయం తెలంగాణ కంటే ఎక్కువుగా పెరిగిందని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. తమ ప్రభుత్వ చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు, తీసుకొచ్చిన పరిశ్రమలు వలన రాష్ట్రంలో నిరుద్యోగిత శాతం తగ్గిందన్నారు సీఎం జగన్. డీబీటీ ద్వారా నేరుగా కోట్ల మందికి డబ్బులు జమ చేస్తున్నామని చెప్పారు. నిజంగా ఇది దేశంలోనే అత్యద్భుతమైన ప్రయోగమని ఆర్ధిక నిపుణులు, సామాజిక వేత్తలు చెబుతున్నారు. దీని ద్వారా నిరుద్యోగిత రేటు తగ్గడం కాకుండా యువత క్రైం వైపు, టెర్రరిజం, మావోయిజం వైపు మొగ్గు చూపకుండా తల్లిదండ్రుల ఆకాంక్షల మేరకు ఉద్యోగాలు చేసుకుంటారు. ఈ వాతావరణం ఏపీలో స్పష్టంగా కనిపిస్తోంది. మెగా, భారీ పరిశ్రమల వలన కాకుండా చిన్న, మధ్యతరహా పరిశ్రమలు వల్ల 30 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని సీఎం జగన్ విశాఖ వేదికగా చెప్పారు.
చంద్రబాబు హయాంలో పరిశ్రమలకు, వ్యాపార వేత్తలకు కనీస విలువ ఉండేది కాదు. చంద్రబాబు హయాంలో అవినీతి గురించి కొందరు విదేశీ వ్యాపారులు కేంద్రానికి ఫిర్యాదు చేస్తూ లేఖలు రాశారంటేనే అప్పుడు పరిస్థితి ఎంత దారుణంగా ఉండేదో అర్ధం చేసుకోవచ్చు. ఇక.. భవిత కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి.. జాబ్ ఓరియంటెడ్ కోర్సులకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. ప్రతి జిల్లాలో స్కిల్ కాలేజీ, ప్రతి నియోజకవర్గంలో స్కిల్ హబ్ సెంటర్ ఏర్పాటు చేస్తామన్నారు. చదువుల్లో క్వాలిటీ పెంచుతున్నామన్నారు. స్కూల్‌లో 3వ తరగతి నుంచే సబ్జక్ట్ టీచర్లను తీసుకొస్తున్నట్లు తెలిపారు. 158 పారిశ్రామిక సంస్థలు వచ్చి విద్యార్ధులకు శిక్షణ ఇచ్చాయన్నారు.
విశాఖ వేదికగా ముఖ్యమంత్రి జగన్ మాటలు భవిష్యత్ తరానికి ఆశాకిరణంగా కనిపించాయి. పిల్లలను ప్రపంచ పౌరులుగా తీర్చిదిద్దాలని అనుకుంటున్నారు. అందుకు తగ్గ వనరులను కల్పిస్తున్నారు. మంచి ఇంగ్లిష్ ద్వారా ప్రపంచాన్ని జయించవచ్చనేది సీఎం జగన్ అనుకుంటున్నారు. ఇది నిజం. చేతిలో విద్య అనే ఆయుధముంటే విశ్వాన్నిగెలవచ్చు. సీఎం జగన్ నాణ్యమైన విద్య గురించి, నాణ్యమైన మానవ వనరుల గురించి మాట్లాడుతున్నారు. ఎంతో ముందు చూపు ఉన్న నాయకుడు మాత్రమే ఇలా మాట్లాడగలరు. సీఎం జగన్ ప్రసంగంలోని కాన్పెన్స్‌కు ప్రధాన కారణం.. నిజాయితీ, అవినీతిలేని పాలన. తాను చేయాలి అనుకున్నది చేసుకుంటూ పోవడం. ప్రజలకు మంచి చేస్తున్నానే సంతృప్తి. పారదర్శక పాలన. ఇవన్నీ ఆయనలో విశ్వాసాన్ని పెంచుతున్నాయి.
- YV రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment