సాక్షి, విశాఖపట్నం: అరుదైన పాము జాడలు కంబాల కొండ పరిధిలో కనిపించాయి. మడ అడవుల్లో కనిపించే బార్కుడియా లింబ్‌లెస్ స్కింక్ స్నేక్‌ని అభయారణ్యంలో గుర్తించినట్లు డీఎఫ్‌వో అనంత్‌శంకర్ సోమవారం వెల్లడించారు. 1790ల్లో తొలిసారిగా కంబాలకొండ అభయారణ్యంలో బార్కుడియా లింబ్‌లెస్ స్కింక్ స్నేక్‌లు విరివిగా కనిపించేవి. ఆ తర్వాత క్రమంగా అంతరించిపోయాయని అనుకున్నారు.
1950ల్లో మరోసారి వీటి ఉనికిని గుర్తించారు. ఆ సమయంలో కోల్‌కతాలోని జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు దీన్ని పంపించారు. అనంతరం ఈ బార్కుడియాలు కంబాలకొండలో దర్శన మివ్వలేదు. దశాబ్దాల అనంతరం మళ్లీ ఈ అభయారణ్యంలో బార్కుడియా కనిపించింది. ఏపీ అటవీశాఖలో విధులు నిర్వ ర్తిస్తున్న ప్రాజెక్టు సైంటిస్ట్ అడారి యజ్ఞపతి దీన్ని గుర్తించారు. బార్కుడియా స్నేక్ జాతిని సంరక్షించేందుకు అటవీ శాఖ తక్షణ చర్యలు తీసుకుంటుంది. 16.5 సెంటీమీటర్లు పొడవు మాత్రమే ఉండే ఈ లింబ్‌లెస్ స్కింక్ జీవవైవిధ్యానికి ప్రతీకగా నిలుస్తోంది.
ఇది కూడా చదవండి: టీచర్లకు గుడ్‌న్యూస్.. బదిలీలకు గ్రీన్‌సిగ్నల్
Comments
Please login to add a commentAdd a comment