kambala
-
శతాబ్దాల నాటి పండుగ.. వేదికపై ఐశ్వర్య రాయ్, అనుష్కతో పాటు ఈ స్టార్స్ కూడా..
కర్ణాటకలో కంబళ ఉత్సవాలు ప్రతియేటా ఘనంగా జరుగుతాయి. ఇది శతాబ్దాల నాటి ఆనవాయతీ. వారి సంస్కృతి సంప్రదాయంలో ఇదొక భాగం.. అందుకే కాంతార సినిమాలో కూడా కంబళ పోటీలలో రిషభ్ శెట్టి పాల్గొంటాడు. ఆ సినిమాలో కూడా వాటిని రియల్‌గానే ఆయన చిత్రీకరించారు. నవంబర్‌లో ప్రారంభమై మార్చి వరకు జరిగే వార్షిక పండుగ సీజన్‌గా గుర్తింపు ఉంది. ఈ ఏడాది పోటీల కోసం కర్ణాటక సన్నద్ధమవుతోంది. ఈసారి అతి పొడవైన ట్రాక్‌ను నిర్మిస్తున్నట్టు కంబళ కమిటీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే అశోక్‌కుమార్ రాయ్ వెల్లడించారు. పోటీలలో భాగంగా శీతాకాలంలో తీర ప్రాంతంలోని రైతులు.. గేదెలను పట్టుకుని బురదపై పరుగులు తీస్తారు. పంట బాగా పండాలని దేవుడుకి ప్రార్థిస్తూ ఈ పోటీలు నిర్వహిస్తారు. చాలా ఏళ్లుగా ఈ కంబళ పోటీలు కొనసాగుతున్నా ఈ మధ్య ఎక్కువగా దేశాన్ని ఆకర్షిస్తున్నాయి. సాధారణంగా ఈ పోటీలు తీర ప్రాంతానికే పరిమితం. కానీ ప్రజల నుంచి భారీ రెస్పాన్స్ రావడంతో తొలిసారిగా ఈ కార్యక్రమాన్ని బెంగళూరు వేదికగా పాలెస్ గ్రౌండ్స్‌లో జరగనున్నాయి. నవంబర్ 25, 26 తేదీల్లో ఈ ఈవెంట్ జరుగుతుందని స్పష్టం చేశారు. ఈ పోటీలను చూసేందుకు సుమారు 10 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నారు. ఈ పోటీలో పాల్గొనేందుకు ఇప్పటి వరకు 150 గేదెలు ఉన్నాయి. ఆ మేరకు వాటి యజమానులు తమ పేర్లు రిజిస్టర్ చేసుకున్నారు. పోటీలో గెలిచిన వారికి రూ. 1.50 లక్షల నగదు అందించినున్నారు. తీర ప్రాంతానికే పరిమితం అయిన ఈ పోటీలను ఈసారి ప్రజలకు మరింత చేరువ చేసేందుకు.. బెంగళూరులో ఈవెంట్‌ను నిర్వహించాలని నిర్ణయించారు. ఫలితంగా.. నవంబర్ 25, 26 తేదీల్లో ఈ కంబళ పోటీలు.. తొలిసారిగా పాలెస్ గ్రౌండ్స్‌లో జరగనున్నాయి. ఈసారి జరగనున్న కంబళ పోటీలకు ప్రముఖ సినీ తారలు ఐశ్వర్య రాయ్, అనుష్క శెట్టి, సునీల్ శెట్టి, శిల్పా శెట్టి, కేజీఎఫ్ యష్, దర్శన్‌లతో పాటు క్రికెటర్ కే.ఎల్ రాహుల్ కూడా ఈ రెండు రోజుల ఈవెంట్లో పాల్గొంటారని అశోక్ రాయ్ తెలిపారు. -
AP: కంబాలకొండలో అరుదైన పాము.. 1790ల్లో తొలిసారిగా..
సాక్షి, విశాఖపట్నం: అరుదైన పాము జాడలు కంబాల కొండ పరిధిలో కనిపించాయి. మడ అడవుల్లో కనిపించే బార్కుడియా లింబ్లెస్ స్కింక్ స్నేక్‌ని అభయారణ్యంలో గుర్తించినట్లు డీఎఫ్‌వో అనంత్‌శంకర్ సోమవారం వెల్లడించారు. 1790ల్లో తొలిసారిగా కంబాలకొండ అభయారణ్యంలో బార్కుడియా లింబ్లెస్ స్కింక్ స్నేక్‌లు విరివిగా కనిపించేవి. ఆ తర్వాత క్రమంగా అంతరించిపోయాయని అనుకున్నారు. 1950ల్లో మరోసారి వీటి ఉనికిని గుర్తించారు. ఆ సమయంలో కోల్‌కతాలోని జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు దీన్ని పంపించారు. అనంతరం ఈ బార్కుడియాలు కంబాలకొండలో దర్శన మివ్వలేదు. దశాబ్దాల అనంతరం మళ్లీ ఈ అభయారణ్యంలో బార్కుడియా కనిపించింది. ఏపీ అటవీశాఖలో విధులు నిర్వ ర్తిస్తున్న ప్రాజెక్టు సైంటిస్ట్ అడారి యజ్ఞపతి దీన్ని గుర్తించారు. బార్కుడియా స్నేక్ జాతిని సంరక్షించేందుకు అటవీ శాఖ తక్షణ చర్యలు తీసుకుంటుంది. 16.5 సెంటీమీటర్లు పొడవు మాత్రమే ఉండే ఈ లింబ్లెస్ స్కింక్ జీవవైవిధ్యానికి ప్రతీకగా నిలుస్తోంది. ఇది కూడా చదవండి: టీచర్లకు గుడ్‌న్యూస్.. బదిలీలకు గ్రీన్‌సిగ్నల్ -
కంబళలో మెరుపు వీరుడు
యశవంతపుర: బురద మడిలో దున్నపోతులతో పరిగెత్తే కర్ణాటక గ్రామీణ క్రీడ కంబళలో కొత్త రికార్డులు నమోదవుతున్నాయి. కంబళ పోటీల్లో ఉసేన్ బోల్ట్ కంటే వేగంగా పరుగెత్తాడన్న రికార్డు సొంతం చేసుకున్న కర్ణాటక మంగళూరువాసి శ్రీనివాసగౌడ మరో ఘనతను సృష్టించాడు. మంగళూరు సమీపంలోని బెళ్తంగడి తాలూకా వేణూరు పెర్ముడ సూర్య– చంద్ర జోడు చెరువులో శనివారం జరిగిన కంబళ పోటీలలో గతంలో నమోదైన అన్ని రికార్డులను బద్దలు కొట్టాడు. గతంలో కంబళ పోటీలో 100 మీటర్ల దూరాన్ని 11:21 సెకన్లలో, తర్వాత 9.37 సెకన్లలో అధిగమించినదే అత్యుత్తమ రికార్డులు కాగా, తాజా పోటీలలో ఏకంగా 8.96 సెకన్లలో చేరుకుని నభూతో అనిపించాడు. పాత రికార్డులను శ్రీనివాసగౌడ తుడిచిపెట్టాడు. తాజా పోటీలో సురేశ్ 9.37 సెకన్లు, ఆనంద 9.57 సెకన్లతో రెండు, మూడోస్థానంలో నిలిచారు. -
కంబళ.. మామూలుగా పరిగెత్తలేదుగా!
సాక్షి, బెంగళూరు: కర్ణాటక తీరప్రాంత జిల్లాల్లో బురదనీటిలో సాగే దున్నపోతుల పరుగు పందేలు కంబళలో ఒలింపిక్స్ పరుగు రికార్డులు బద్ధలవుతున్నాయి. బురదమడిలో వంద మీటర్ల దూరాన్ని కేవలం 9.15 సెకన్లలో దక్షిణ కన్నడ జిల్లా బైందూరుకు చెందిన విశ్వనాథ్ పూర్తి చేసి కొత్త రికార్డును నెలకొల్పాడు. గత శనివారం నిర్వహించిన పోటీల్లో విజేతగా నిలిచి అంతర్జాతీయ స్థాయిలో అందరి దృష్టి ఆకర్షించాడు. మొత్తం 125 మీటర్ల దూరాన్ని 11.44 సెకన్లలో పూర్తి చేశాడు. గతేడాది శ్రీనివాసగౌడ 9.55 సెకన్లలో, అదేవిధంగా నిశాంత్ శెట్టి 9.51 సెకన్లలో 100 మీటర్ల పరుగు సాధించి అప్పటికి సరికొత్త రికార్డును సృష్టించారు. విశ్వనాథ్ వీటిని అధిగమించాడు. ఉసేన్ బోల్ట్ కటే వేగంగా.. ప్రపంచ పరుగు పందెం విజేత ఉసేన్ బోల్ట్ రికార్డును మంగళూరుకు చెందిన శ్రీనివాసగౌడ అనే యువకుడు కొత్త చరిత్ర సృష్టించగా నిశాంత్ శెట్టి కూడా బోల్ట్ బద్దలు కొట్టాడు. ఈసారి బైందూరుకు చెందిన మరో యువకుడు విశ్వనాథ్ కూడా పాత రికార్డులన్నీ సవరించాడు. ఎన్నో ఏళ్ల కఠోర సాధన చేసినా ఈ స్థాయిలో రికార్డు సృష్టించడానికి పరుగు పందేలా క్రీడాకారులు ఆపసోపాలు పడుతుంటే కంబళ పోటీల్లో ఇంత అవలీలగా ఎలా సాధించేశారనే కుతూహలం అందరిలోనూ మొదలైంది. కరావళి సంప్రదాయమే.. కర్ణాటకలోని కరావళి ప్రాంతంగా పిలిచే ఉత్తరకన్నడ, దక్షిణ కన్నడ జిల్లాల్లో శతాబ్దాలుగా నిర్వహిస్తున్న క్రీడ పేరు కంబళ. కరావళి ప్రాంత సంస్కృతి, సంప్రదాయానికి ప్రతీకగా కంబళ క్రీడను భావించే ప్రజలు దాన్ని కాపాడుకోవడానికి పోటీలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంటారు. నవంబర్‌లో మొదలయ్యే కంబళ సీజన్ మార్చి వరకు కొనసాగుతుంది. కంబళ సమితుల ఆధ్వర్యంలో పోటీలు నిర్వహిస్తారు. 100 మీటర్లు అంత కంటే ఎక్కువ దూరం ఉండే ట్రాక్‌లు సిద్ధం చేసి వాటిలో కొద్దిమేర బురదనీటిని నింపుతారు. అనంతరం వాటిలో దున్నపోతులను పరుగెత్తించే పోటీలు నిర్వహిస్తారు. దున్నపోతులను అదుపు చేస్తూనే వేగంగా పరుగెత్తించి వాటితో పాటు అంతే వేగంతో పరుగెత్తి ఎవరైతే ముందుగా లక్ష్యాన్ని చేరుకుంటారో వారినే విజేతలుగా ప్రకటిస్తారు. క్రీడ ఒక్కటే.. ఎన్నెన్నో పోటీలు.. కంబళ పోటీల్లో ఏడు రకాల పోటీలు ఉన్నాయి. బారే కంబళ, కోరి కంబళ, అరసు కంబళ, దెవెరే కంబళ, బాలె కంబళ, కెరె కంబళ, కాద్రి కంబళగా విభజించారు. అయితే కంబళ క్రీడలో అన్ని కంబళలు పోటీ కంబళలు కావు. అందులో కొన్ని కంబళలు పోటీ కంబళలు.. కాగా మరికొన్ని పోటీ లేని సాధారణ కంబళలు. అయితే రెండు రకాల కంబళలను బురదనీటిలో నిర్వహిస్తారు. అన్ని రకాల కంబళలు మూడు శతాబ్దాలకు పైగానే చరిత్ర కలిగినవే. వీటిలో ఎక్కువశాతం దక్షిణ కన్నడ జిల్లాలోనే నిర్వహిస్తుండగా కొన్ని కంబళలు సమీపంలోని ఉడుపి జిల్లాలో నిర్వహిస్తారు. చరిత్ర ఏం చెబుతుందంటే.. కంబళ చరిత్ర గురించి తెలుసుకుంటే పరమ శివుడికి భక్తులైన నాథుల ప్రేరణతో కంబళ మొదలైనట్లు చెబుతారు. కంబళ క్రీడలు ప్రారంభమయ్యే ముందురోజు రాత్రి కొరగ తెగకు చెందిన పురుషులు కొరగ సాంస్కృతిక నృత్యాలు ప్రదర్శిస్తారు. అందులో భాగంగా పంచకర్మగా భావించే మద్య, మాంస, మత్స్య, ముద్ర, మిథున (రతి) పాటిస్తారు. దీంతో పాటు పానిక్కులుని అనే సాంస్కృతిక వేడుకను సైతం నిర్వహిస్తారు. పోటీలు.. విభాగాలు.. కంబళ పోటీల్లో కొన్ని రకాల పోటీలను ప్రత్యేక విభాగాలుగా విభజిస్తారు. వాటిలో నెగిలు, హగ్గ, అడ్డా హాలేజ్, కేన్ హాలేజ్ ప్రధానమైనవి. ఒక్కో రకమైన కంబళకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు. వాటి గురించి తెలుసుకుందాం. ► నెగిలు: చెక్క లేదా ఇనుముతో తయారు చేసిన ఓ రకమైన భారీ నాగలితో నిర్వహించే పోటీని నెగిలుగా గుర్తిస్తారు. ఈ భారీ నాగలి ని దున్నలకు కట్టి బురదనీటిలో పరుగెత్తి స్తారు. ఇందులో కేవలం ఎంట్రీ స్థాయి, జూనియర్, సీనియర్ రౌండ్లు మాత్రమే ఉంటాయి. ► హగ్గ: ఈ విభాగంలో పాల్గొనే దున్నలకు అనుభవం ఎక్కువగా ఉంటుంది. బలమైన తాడును దున్నలకు కట్టి బురదనీటిలో పరుగెత్తిస్తారు. ఇందులో ఓ వ్యక్తి చేతిలో తాడుతో దున్నలను నియంత్రిస్తూ వాటితో పాటు బురద నీటిలో పరుగెత్తుతాడు. ఇందులోనూ సీనియర్, జూనియర్ రౌండ్లు ఉంటాయి. ► అడ్డా హాలేజ్: ఈ విభాగం కఠినంగానే ఉంటుంది. వంపు తిరిగిన చెక్కను దున్నలకు కట్టి బురదనీటిలో పరుగెత్తిస్తారు. ఈ సమయంలో చెక్కపలకపై వ్యక్తి నిలబడి ఉంటాడు. దీంతో పోటీలో పాల్గొనే దున్నలు చెక్కతో పాటు వ్యక్తిని సైతం బురదనీటిలో వేగంగా లాక్కెళ్తాయి. ఇందులో సీనియర్ రౌండ్ మాత్రమే ఉంటుంది. ►కేన్ హాలేజ్: ఈ రకం పోటీలు ఎంతో రసవత్తరంగా, ఉత్కంఠగా ఉంటాయి. ప్రత్యేకంగా తయారు చేసిన గుండ్రటి చెక్కను దున్నలకు కడతారు. చెక్కకు మధ్యలో రెండు ప్రత్యేకమైన రంధ్రాలు ఏర్పాటు చేస్తారు. దున్నలు పరిగెత్తే సమయంలో ఈ రెండు రంధ్రాల నుంచి చిమ్మే నీటి ఎత్తు, వేగంతో విజేతను ఎన్నుకుంటారు. ఇందులో సూపర్ సీనియర్ రౌండ్ మాత్రమే ఉంటుంది. చదవండి: మిస్ ఇండియా రన్నరప్‌గా ఆటో డ్రైవర్ కూతురు ఆమె కోసం ఇల్లమ్మి.. ఆటోలోనే తిండి, నిద్ర -
కోస్తా తీరంలో కంబళ.. ఎలా ఆడతారంటే
క్రికెట్, ఫుట్‌బాల్ టోర్నీలతో సమానంగా ఆదరణ. ఏడాదిపాటు దున్నపోతులు, పరుగువీరులకు శిక్షణ. గెలిస్తే దున్నలు, ఆటగాళ్లు, యజమానుల పేరు జిల్లాలో మార్మోగిపోతుంది. ఓడినవారు ఈసారి గెలవాలని మళ్లీ ప్రయత్నిస్తారు. ఒక గ్రామీణ క్రీడ కంబళ ఇప్పుడు అందరికీ హాట్ టాపిక్ అయ్యింది. కంబళ ఆటగాళ్లు ప్రపంచ పరుగు రికార్డులను అవలీలగా అధిగమిస్తుండడమే దీనికి కారణం. అంతేకాదు కంబళకు ఘనమైన వారసత్వ చరిత్ర కూడా ఉంది. కోస్తా జిల్లాల ప్రజల సంస్కృతిలో ఒక విడదీయలేని భాగం. సాక్షి, బెంగళూరు: బురద నీటిలో దున్నపోతులతో పోటీగా వంద మీటర్ల దూరాన్ని కేవలం 9.55 సెకన్లలో పరుగెత్తి ప్రపంచ పరుగు పందెం విజేత ఉసేన్ బోల్ట్ రికార్డును బద్దలుకొట్టి మంగళూరుకు చెందిన శ్రీనివాసగౌడ, అలాగే నిశాంత్ శెట్టి అనే మరో కంబళ యువకుడు అదే 100 మీటర్ల దూరాన్ని కేవలం 9.51 సెకన్లలో పరిగెత్తి శ్రీనివాసగౌడ రికార్డును బద్దలుకొట్టాడు. ఎన్నో ఏళ్ల కఠోర సాధన చేసినా ఈ స్థాయిలో రికార్డు సృష్టించడానికి పరుగు పందేల క్రీడాకారులు ఆపసోపాలు పడుతుంటే కంబళ పోటీల్లో అవలీలగా ఎలా సాధించేశారనేది సర్వత్రా చర్చనీయాంశమైంది. కంబళ ఆటగాళ్లకు ఇంతటి శక్తిసామర్థ్యాలు ఎలా వచ్చాయనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఎలా ఆడతారంటే 100 మీటర్లు అంతకంటే ఎక్కువ దూరం ఉండే ట్రాక్‌లు సిద్ధం చేసి వాటిలో కొద్దిమేర బురదనీటిని నింపుతారు. తరువాత ఒకటి, లేదా జంట దున్నపోతులతో ఆటగాళ్లు రంగంలోకి దిగుతారు. ఎవరు వేగంగా అవతలికి చేరితే వారే విజేత. ఇది కూడా ఒక తరహా పరుగు పందెం అనే చెప్పాలి. అయితే సాధారణ ట్రాక్‌కు కంబళ ట్రాక్‌కు చాలా వ్యత్యాసం ఉంటుంది. సాధారణ ట్రాక్‌లో వేళ్లు, పూర్తి కాళ్లను నియంత్రించుకుంటూ పరుగెత్తాల్సి ఉంటుంది. కానీ కంబళలో మడమలను నియంత్రించుకుంటూ పరుగెత్తాల్సి ఉంటుంది. తెలుసుకోవాల్సింది ఎంతో ఉంది ఈ పోటీల్లో ఏడు రకాలున్నాయి. బారే కంబళ, కోరి కంబళ, అరసు కంబళ, దెవెరే కంబళ, బాలె కంబళ, కెరె కంబళ, కాద్రి కంబళలుగా విభజించారు. అయితే కంబళ క్రీడలో అన్ని కంబళలు పోటీ కంబళలు కావు. అందులో కొన్ని కంబళలు పోటీ కంబళలు కాగా మరికొన్ని పోటీ లేని సాధారణ కంబళలు. రెండు రకాల కంబళలను బురదనీటిలో నిర్వహిస్తారు. ఏడు రకాల కంబళలు కంబళ పోటీల్లో కొన్ని రకాల పోటీలను ప్రత్యేక విభాగాలుగా విభజిస్తారు. వాటిలో నెగిలు, హగ్గ, అడ్డా హాలేజ్, కేన్ హాలేజ్ ప్రధానమైనవి. ఒక్కో రకమైన కంబళకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు. వాటి గురించి పరిశీలిస్తే.. నెగిలు చెక్క లేదా ఇనుముతో తయారు చేసిన ఒక రకమైన భారీ నాగలితో నిర్వహించే పోటీని నెగిలుగా గుర్తిస్తారు. ఈ భారీ నాగలిని దున్నలకు కట్టి బురదనీటిలో పరుగెత్తిస్తారు. ఇందులో ఎంట్రీ స్థాయి, జూనియర్, సీనియర్ రౌండ్లు మాత్రమే ఉంటాయి. హగ్గ ఈ విభాగంలో పాల్గొనే దున్నలకు అనుభవం ఎక్కువగా ఉంటుంది. బలమైన తాడును దున్నలకు కట్టి బురదనీటిలో పరుగెత్తిస్తారు. ఇందులో ఓ వ్యక్తి చేతిలో తాడుతో దున్నలను నియంత్రిస్తూ వాటితో పాటు బురదనీటిలో పరుగెత్తుతాడు. ఇందులోనూ సీనియర్, జూనియర్ రౌండ్లు ఉంటాయి. అడ్డా హాలేజ్ ఇది కాస్త కఠినంగానే ఉంటుంది. వంపు తిరిగిన చెక్కను దున్నలకు కట్టి బురదనీటిలో పరుగెత్తిస్తారు. ఈ సమయంలో చెక్కపలకపై వ్యక్తి నిలబడి ఉంటాడు. దీంతో పోటీలో పాల్గొనే దున్నలు చెక్కతో పాటు వ్యక్తిని సైతం బురదనీటిలో వేగంగా లాక్కెళ్తాయి. ఇందులో కేవలం సీనియర్ రౌండ్ మాత్రమే ఉంటుంది. కేన్ హాలేజ్ ఈ రకం పోటీలు రసవత్తరంగా ఉంటాయి. ప్రత్యేకంగా తయారు చేసిన గుండ్రటి చెక్కను దున్నలకు కడతారు. చెక్కకు మధ్యలో రెండు ప్రత్యేక రంధ్రాలు ఏర్పాటు చేస్తారు. దున్నలు పరిగెత్తే సమయంలో ఈ రెండు రంధ్రాల నుంచి చిమ్మే నీటి ఎత్తు, వేగంతో విజేతను ఎన్నుకుంటారు. ఇందులో సూపర్ సీనియర్ రౌండ్ మాత్రమే ఉంటుంది. ఉడుపి, మంగళూరుకు ప్రత్యేకం కర్ణాటకలోని కరావళి ప్రాంతంగా పిలిచే ఉత్తర కన్నడ, దక్షిణ కన్నడ తదితర కోస్తా జిల్లాల్లో శతాబ్దాలుగా నిర్వహిస్తున్న క్రీడ కంబళ. తమ సంస్కృతికి ప్రతీకగా ప్రజలు ఈ పోటీలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంటారు. ఒక ఊరిని మించి మరో ఊరివారు పోటీలు ఘనంగా ఉండాలని శ్రమిస్తారు. నవంబర్ నెలలో మొదలయ్యే కంబళ సీజన్ మార్చి వరకు కొనసాగుతుంది. కంబళ సమితుల ఆధ్వర్యంలో కంబళ పోటీలు నిర్వహిస్తారు. అన్ని రకాల కంబళలు మూడు శతాబ్దాలకు పైగానే చరిత్ర ఉన్నవే. వీటిలో ఎక్కువ శాతం దక్షిణ కన్నడ జిల్లాలోనే నిర్వహిస్తుండగా కొన్ని కంబళలు సమీపంలోని ఉడుపి జిల్లాలో నిర్వహిస్తుంటారు. విజేతలకు బహుమానాల పంట కంబళలో పోటీల్లో గెలిచిన విజేతలను కొన్నిసార్లు నగదు బహుమానంతో మరికొన్నిసార్లు బంగారు నాణేలను బహుమానంగా అందించి సత్కరిస్తారు. గెలిచిన దున్నల యజమానులకూ పేరు లభిస్తుంది. ఆటగాళ్లు, చూసేవాళ్లలో కంబళ సాగుతున్నంతసేపూ ఉత్సాహం పొంగిపొర్లుతుంటుంది. కంబళ పోటీల కోసం దున్నలకు ప్రత్యేక శిక్షణనిస్తారు. శివుని భక్తుల ఆట కంబళ చరిత్ర శివునితో ముడిపడి ఉంది. పరమ శివునికి భక్తులైన నాథుల ప్రేరణతో కంబళ మొదలైనట్లు చెబుతారు. కంబళ క్రీడలు ప్రారంభమయ్యే ముందురోజు రాత్రి కొరగ తెగకు చెందిన పురుషులు కొరగ సాంస్కృతిక నృత్యాలు ప్రదర్శిస్తారు. అందులో భాగంగా పంచకర్మగా భావించే మద్య, మాంస, మత్స్య, ముద్ర, మిథున క్రియలను పాటిస్తారు. దీంతోపాటు పానిక్కులుని అనే సాంస్కృతిక వేడుకను సైతం నిర్వహిస్తారు. -
ట్రాక్‌పైకి కంబళ వీరుడు!
మంగళూరు: కంబళ పోటీల్లో ఉసేన్‌బోల్ట్ కంటే వేగంగా పరుగెత్తాడన్న రికార్డు సొంతం చేసుకున్న శ్రీనివాస గౌడ త్వరలో రన్నింగ్ ట్రాక్‌పైకి ఎక్కనున్నాడు. బురదతో నిండిన పొలంలో బర్రెలతో కలిసి పరుగెత్తే కంబళ పోటీల్లో గౌడ వంద మీటర్ల దూరాన్ని కేవలం 9.55 సెకన్లలో పూర్తి చేసి సంచలనం సృష్టించిన విషయం తెల్సిందే. ఇటీవల స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(శాయ్) దక్షిణభారత విభాగం డైరెక్టర్ అజయ్ భేల్, ఇతర అధికారులు కాసరగోడ్ జిల్లాలోని పైవలికేలో శ్రీనివాసతో మాట్లాడి శిక్షణకు ఆయనను ఒప్పించారు. బెంగళూరులోని శాయ్ కేంద్రంలో శ్రీనివాసకు శిక్షణనివ్వనున్నారు. ఈ ఏడాది కంబళ పోటీలు ముగిశాక, ఏప్రిల్‌లో శ్రీనివాస శిక్షణ కేంద్రంలో చేరే అవకాశముంది. మూడుబిద్రిలో నిర్మాణ రంగ కార్మికుడిగా పనిచేస్తున్న శ్రీనివాస ఈ ఏడాది కంబళ పోటీల్లో ఏకంగా 39 పతకాలు కైవసం చేసుకోవడం విశేషం. -
‘కంబళ’ బిల్లుకు ఆమోదం
బెంగళూరు: కరావళి ప్రాంత సాంస్కృతిక క్రీడ కంబళ నిర్వహణకు ప్రభుత్వం ప్రత్యేక చట్టాన్ని రూపొందించే బిల్లుకు సోమవారం ఆమోద ముద్ర వేసింది. గతంలో చెప్పినట్లుగానే ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే దీనికి సంబంధించిన బిల్లుపై చర్చించి పాస్ చేశారు. దీని ప్రకారం జీవహింస నిరోధక చట్టాల్లో సవరణలు చేస్తారు. దీనికి కేంద్రం అడ్డు చెప్పే అవకాశం లేకపోలేదు. జల్లికట్టుకు అడ్డుకట్టపడినట్లుగానే కంబళకు కూడా కర్ణాటక హైకోర్టు బ్రేక్ వేసిన విషయం తెలిసిందే. దీంతో తమిళనాడు మాదిరిగానే కర్ణాటకలో కూడా పెద్ద మొత్తంలో నిరసనలు బయలుదేరాయి. దీంతో ఈ గ్రామీణ క్రీడలో ఎలాంటి జీవహింస ఉండదని,ఆధ్యాత్మిక భావనతో ముడిపడిన కంబళ క్రీడను నిర్వహించుకోవడానికి గతంలోనే ప్రభుత్వం అనుమతిచ్చిందని, దీని నిర్వహణకు ఉన్న అడ్డంకులు తొలగించేందుకు త్వరలోనే చట్ట సవరణ బిల్లును తీసుకొస్తామని కర్ణాటక ప్రభుత్వం ప్రజలకు హామీ ఇచ్చింది. ఆ మాట ప్రకారం సవరణలు కోరే బిల్లును సోమవారం పాస్ చేసింది. -
కర్ణాటకలో రగిలిన కంబలా అగ్గి
-
కర్ణాటకలో రగిలిన కంబలా అగ్గి
హుబ్లీ: ఒకపక్క జల్లికట్టు స్ఫూర్తితో ఆంద్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఉద్యమం మళ్లీ పట్టాలెక్కితే.. సంప్రదాయ క్రీడకోసం కర్ణాటకలో కన్నడిగులు రోడ్డెక్కారు. జల్లికట్టు కోసం తమిళ తంబిల ఉడుంపట్టుతో అనుకున్నది సాధించడంతో కర్ణాటకలో కూడా కంబాల క్రీడపై నిషేధాన్ని ఎత్తివేయాలన్న డిమాండ్ ఊపందుకుంది. కంబాలకు అనుమతివ్వాలంటూ వేలాదిమంది విద్యార్థులు శుక్రవారం ఆందోళన చేపట్టారు. హుబ్లీలో కంబాలపై బ్యాన్ ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. పెటాను నిషేధించాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులతో ప్రదర్శన నిర్వహించారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య కూడా కంబాళ క్రీడక బ్యాన్ ఎత్తివేతకు సానుకూలంగా స్పందించారు. ప్రభుత్వం అవసరమైతే నిషేధాన్ని ఎత్తివేయాలని ఆర్డినెన్స్ తేనుందని ప్రకటించిన సంగతి తెలిసిందే. పెటా కర్నాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది .దీనిపై 2016, నవంబర్ లో కంబాళ ను నిలిపి వేస్తూ దేశాలు జారీ చేసింది. తదుపరి విచారణకు ఈ కేసు ఈ నెల 30 వరకు వాయిదా వేసింది. అటు కన్నడ కమిటీ కూడా స్టే ఎత్తివేయాల్సింది మధ్యంతర పిటీషన్ దాఖలు చేసింది. మరోవైపు కర్ణాటక రాష్ట్రంలో ఎంతో ప్రాచుర్యం పొందిన జానపద క్రీడ కంబాలా (బఫెల్లో రేస్) .ఈ క్రీడ సాధారణంగా నవంబర్ లో మొదలై మార్చి వరకు కొనసాగుతుంది. మూద్ బిద్రిలోని స్వరాజ్ మైదాన్ లో ఈనెల 28న ఆదివారం 50 వేల మందితో నిరసన ప్రదర్శనకు ప్లాన్ చేస్తున్నారు. 250 జతల పోట్ల గిత్తలను కూడా ఈ ఆందోళనకు తీసుకువచ్చేందుకు కంబాళ నిర్వహణ కమిటీ ఏర్పాట్లు చేస్తోంది.. తొలి ప్రదర్శనలోనే కనీసం అరలక్ష మందితో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని భావిస్తున్న సంగతి తెలిసిందే. -
కంబళ కోసం ప్రత్యేక చట్టం!
సాక్షి, బెంగళూరు: కరావళి ప్రాంత సాంస్కృతిక క్రీడ కంబళ నిర్వహణకు ప్రభుత్వం ప్రత్యేక చట్టాన్ని రూపొందిస్తున్నట్లు కర్ణాటక న్యాయ శాఖ మంత్రి టి.బి.జయచంద్ర తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఫిబ్రవరి 6 నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమా వేశాల్లో ఈ అంశంపై చర్చిస్తామని చెప్పారు. కంబళ క్రీడకు చట్టబద్ధత కల్పించడానికి పశుసంవర్థక శాఖకు ప్రతిపాదనలు పంపించనున్నట్లు తెలిపారు. ఈ గ్రామీణ క్రీడలో ఎలాంటి జీవహింస ఉండదని చెప్పారు. ఆధ్యాత్మిక భావనతో ముడిపడిన కంబళ క్రీడను నిర్వహించుకోవడానికి గతంలోనే ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్నారు. జీవహింస నిరోధక చట్టాల్లో సవరణలు చేయడం ద్వారా కంబళతోపాటు ఎడ్ల బండ్ల పరుగు పందేలకు అవకాశం కల్పించడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు. -
జల్లికట్టు స్ఫూర్తితో మరో ఉద్యమం
-
జల్లికట్టు స్ఫూర్తితో మరో ఉద్యమం
బొమ్మనహళ్లి (బెంగళూరు): జల్లికట్టు కోసం తమిళనాడు ప్రజానీకం పోరాడిన స్ఫూర్తితో కర్ణాటకలోనూ తమ సంప్రదాయ కంబళ కోసం ప్రముఖులు గళమెత్తుతున్నారు. కర్ణాటకలోని మంగళూరు, ఉడుపి, దక్షిణ కన్నడ తదితర తీరప్రాంత జిల్లాల్లో బురద మడుల్లో ఎద్దులు, ఆంబోతులను కాడెకు కట్టి పరుగులు తీయిస్తారు. నిర్ణీత దూరాన్ని ముందుగా అధిగమించిన పశువులే ఈ పోటీలో విజేతలు. సంక్రాంతి తరువాత ఇది జోరుగా సాగుతుంది. పశువులను హింసిస్తున్నారంటూ జంతుహక్కుల సంస్థ గతేడాది కర్ణాటక హైకోర్టులో పిటిషన్ వేసి కంబళ జరపకుండా స్టే తెచ్చింది. దీంతో ఈ సంక్రాంతికి బురద మడులు బోసిపోయాయి. కంబళ క్రీడకు అనుమతి కోసం ప్రధాని మోదీతో చర్చిస్తానని కేంద్ర మంత్రి డి.వి.సదానందగౌడ చెప్పారు. బెంగళూరులో సోమవారం ఆయన మాట్లాడుతూ.. కంబళ క్రీడలో ఎలాంటి ప్రమాదాలూ, ప్రాణహాని ఉండదని అన్నారు. మరో కేంద్రమంత్రి అనంత్‌కుమార్ మాట్లాడుతూ.. కంబళ క్రీడ కర్ణాటక ప్రజల హక్కు అని స్పష్టం చేశారు. ఎడ్ల పందేలపై త్వరలో ప్రధానితో చర్చలు జరుపుతానని తెలిపారు. వేలాది సంవత్సరాల చరిత్ర కలిగిన కంబళ క్రీడను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు బీఎస్ యడ్యూరప్ప అన్నారు.