
కర్ణాటకలో రగిలిన కంబలా అగ్గి
హుబ్లీ: ఒకపక్క జల్లికట్టు స్ఫూర్తితో ఆంద్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఉద్యమం మళ్లీ పట్టాలెక్కితే.. సంప్రదాయ క్రీడకోసం కర్ణాటకలో కన్నడిగులు రోడ్డెక్కారు. జల్లికట్టు కోసం తమిళ తంబిల ఉడుంపట్టుతో అనుకున్నది సాధించడంతో కర్ణాటకలో కూడా కంబాల క్రీడపై నిషేధాన్ని ఎత్తివేయాలన్న డిమాండ్ ఊపందుకుంది. కంబాలకు అనుమతివ్వాలంటూ వేలాదిమంది విద్యార్థులు శుక్రవారం ఆందోళన చేపట్టారు. హుబ్లీలో కంబాలపై బ్యాన్ ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. పెటాను నిషేధించాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులతో ప్రదర్శన నిర్వహించారు.
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య కూడా కంబాళ క్రీడక బ్యాన్ ఎత్తివేతకు సానుకూలంగా స్పందించారు. ప్రభుత్వం అవసరమైతే నిషేధాన్ని ఎత్తివేయాలని ఆర్డినెన్స్ తేనుందని ప్రకటించిన సంగతి తెలిసిందే. పెటా కర్నాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది .దీనిపై 2016, నవంబర్ లో కంబాళ ను నిలిపి వేస్తూ దేశాలు జారీ చేసింది. తదుపరి విచారణకు ఈ కేసు ఈ నెల 30 వరకు వాయిదా వేసింది. అటు కన్నడ కమిటీ కూడా స్టే ఎత్తివేయాల్సింది మధ్యంతర పిటీషన్ దాఖలు చేసింది.
మరోవైపు కర్ణాటక రాష్ట్రంలో ఎంతో ప్రాచుర్యం పొందిన జానపద క్రీడ కంబాలా (బఫెల్లో రేస్) .ఈ క్రీడ సాధారణంగా నవంబర్ లో మొదలై మార్చి వరకు కొనసాగుతుంది. మూద్ బిద్రిలోని స్వరాజ్ మైదాన్ లో ఈనెల 28న ఆదివారం 50 వేల మందితో నిరసన ప్రదర్శనకు ప్లాన్ చేస్తున్నారు. 250 జతల పోట్ల గిత్తలను కూడా ఈ ఆందోళనకు తీసుకువచ్చేందుకు కంబాళ నిర్వహణ కమిటీ ఏర్పాట్లు చేస్తోంది.. తొలి ప్రదర్శనలోనే కనీసం అరలక్ష మందితో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని భావిస్తున్న సంగతి తెలిసిందే.