కర్ణాటకలో కంబళ ఉత్సవాలు ప్రతియేటా ఘనంగా జరుగుతాయి. ఇది శతాబ్దాల నాటి ఆనవాయతీ. వారి సంస్కృతి సంప్రదాయంలో ఇదొక భాగం.. అందుకే కాంతార సినిమాలో కూడా కంబళ పోటీలలో రిషభ్ శెట్టి పాల్గొంటాడు. ఆ సినిమాలో కూడా వాటిని రియల్‌గానే ఆయన చిత్రీకరించారు. నవంబర్‌లో ప్రారంభమై మార్చి వరకు జరిగే వార్షిక పండుగ సీజన్‌గా గుర్తింపు ఉంది. ఈ ఏడాది పోటీల కోసం కర్ణాటక సన్నద్ధమవుతోంది. ఈసారి అతి పొడవైన ట్రాక్‌ను నిర్మిస్తున్నట్టు కంబళ కమిటీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే అశోక్‌కుమార్ రాయ్ వెల్లడించారు. పోటీలలో భాగంగా శీతాకాలంలో తీర ప్రాంతంలోని రైతులు.. గేదెలను పట్టుకుని బురదపై పరుగులు తీస్తారు. పంట బాగా పండాలని దేవుడుకి ప్రార్థిస్తూ ఈ పోటీలు నిర్వహిస్తారు.
చాలా ఏళ్లుగా ఈ కంబళ పోటీలు కొనసాగుతున్నా ఈ మధ్య ఎక్కువగా దేశాన్ని ఆకర్షిస్తున్నాయి. సాధారణంగా ఈ పోటీలు తీర ప్రాంతానికే పరిమితం. కానీ ప్రజల నుంచి భారీ రెస్పాన్స్ రావడంతో తొలిసారిగా ఈ కార్యక్రమాన్ని బెంగళూరు వేదికగా పాలెస్ గ్రౌండ్స్‌లో జరగనున్నాయి. నవంబర్ 25, 26 తేదీల్లో ఈ ఈవెంట్ జరుగుతుందని స్పష్టం చేశారు. ఈ పోటీలను చూసేందుకు సుమారు 10 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నారు. ఈ పోటీలో పాల్గొనేందుకు ఇప్పటి వరకు 150 గేదెలు ఉన్నాయి. ఆ మేరకు వాటి యజమానులు తమ పేర్లు రిజిస్టర్ చేసుకున్నారు. పోటీలో గెలిచిన వారికి రూ. 1.50 లక్షల నగదు అందించినున్నారు.
తీర ప్రాంతానికే పరిమితం అయిన ఈ పోటీలను ఈసారి ప్రజలకు మరింత చేరువ చేసేందుకు.. బెంగళూరులో ఈవెంట్‌ను నిర్వహించాలని నిర్ణయించారు. ఫలితంగా.. నవంబర్ 25, 26 తేదీల్లో ఈ కంబళ పోటీలు.. తొలిసారిగా పాలెస్ గ్రౌండ్స్‌లో జరగనున్నాయి. ఈసారి జరగనున్న కంబళ పోటీలకు ప్రముఖ సినీ తారలు ఐశ్వర్య రాయ్, అనుష్క శెట్టి, సునీల్ శెట్టి, శిల్పా శెట్టి, కేజీఎఫ్ యష్, దర్శన్‌లతో పాటు క్రికెటర్ కే.ఎల్ రాహుల్ కూడా ఈ రెండు రోజుల ఈవెంట్లో పాల్గొంటారని అశోక్ రాయ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment