కర్ణాటకలో రగిలిన కంబలా అగ్గి | Students stage a protest in Mangaluru, demanding ban on PETA and permission to conduct | Sakshi
Sakshi News home page

Published Fri, Jan 27 2017 1:51 PM | Last Updated on Thu, Mar 21 2024 8:43 PM

ఒకపక్క జల్లికట్టు స్ఫూర్తితో ఆంద్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఉద్యమం మళ్లీ పట్టాలెక్కితే.. సంప్రదాయ క్రీడకోసం కర్ణాటకలో కన్నడిగులు రోడ్డెక్కారు. జల్లికట్టు కోసం తమిళ తంబిల ఉడుంపట్టుతో అనుకున్నది సాధించడంతో కర్ణాటకలో కూడా కంబాల క్రీడపై నిషేధాన్ని ఎత్తివేయాలన్న డిమాండ్ ఊపందుకుంది. కంబాలకు అనుమతివ్వాలంటూ వేలాదిమంది విద్యార్థులు శుక్రవారం ఆందోళన చేపట్టారు. హుబ్లీలో కంబాలపై బ్యాన్ ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. పెటాను నిషేధించాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులతో ప్రదర్శన నిర్వహించారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement