
కంబళ కోసం ప్రత్యేక చట్టం!
సాక్షి, బెంగళూరు: కరావళి ప్రాంత సాంస్కృతిక క్రీడ కంబళ నిర్వహణకు ప్రభుత్వం ప్రత్యేక చట్టాన్ని రూపొందిస్తున్నట్లు కర్ణాటక న్యాయ శాఖ మంత్రి టి.బి.జయచంద్ర తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఫిబ్రవరి 6 నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమా వేశాల్లో ఈ అంశంపై చర్చిస్తామని చెప్పారు. కంబళ క్రీడకు చట్టబద్ధత కల్పించడానికి పశుసంవర్థక శాఖకు ప్రతిపాదనలు పంపించనున్నట్లు తెలిపారు.
ఈ గ్రామీణ క్రీడలో ఎలాంటి జీవహింస ఉండదని చెప్పారు. ఆధ్యాత్మిక భావనతో ముడిపడిన కంబళ క్రీడను నిర్వహించుకోవడానికి గతంలోనే ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్నారు. జీవహింస నిరోధక చట్టాల్లో సవరణలు చేయడం ద్వారా కంబళతోపాటు ఎడ్ల బండ్ల పరుగు పందేలకు అవకాశం కల్పించడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు.