
యశవంతపుర: బురద మడిలో దున్నపోతులతో పరిగెత్తే కర్ణాటక గ్రామీణ క్రీడ కంబళలో కొత్త రికార్డులు నమోదవుతున్నాయి. కంబళ పోటీల్లో ఉసేన్ బోల్ట్ కంటే వేగంగా పరుగెత్తాడన్న రికార్డు సొంతం చేసుకున్న కర్ణాటక మంగళూరువాసి శ్రీనివాసగౌడ మరో ఘనతను సృష్టించాడు. మంగళూరు సమీపంలోని బెళ్తంగడి తాలూకా వేణూరు పెర్ముడ సూర్య– చంద్ర జోడు చెరువులో శనివారం జరిగిన కంబళ పోటీలలో గతంలో నమోదైన అన్ని రికార్డులను బద్దలు కొట్టాడు. గతంలో కంబళ పోటీలో 100 మీటర్ల దూరాన్ని 11:21 సెకన్లలో, తర్వాత 9.37 సెకన్లలో అధిగమించినదే అత్యుత్తమ రికార్డులు కాగా, తాజా పోటీలలో ఏకంగా 8.96 సెకన్లలో చేరుకుని నభూతో అనిపించాడు. పాత రికార్డులను శ్రీనివాసగౌడ తుడిచిపెట్టాడు. తాజా పోటీలో సురేశ్ 9.37 సెకన్లు, ఆనంద 9.57 సెకన్లతో రెండు, మూడోస్థానంలో నిలిచారు.
Comments
Please login to add a commentAdd a comment