Rural sports
-
కర్రసాములో ప్రత్యేకత చాటుకుంటున్న మంగంపేట
సాక్షి, రాయచోటి(అన్నమయ్య జిల్లా) : మన పూర్వీకుల కాలంలో బందిపోటు, గజదొంగలు, శత్రువులు గ్రామాలపై దాడి చేసి దోచుకొని వెళ్తుండేవారు. అప్పట్లో గ్రామాలను కాపాడుకునేందుకు ఆత్మరక్షణ కోసం యువత కర్రసాము విద్యను అభ్యసించి ప్రావీణ్యం పొందేవారు. ఇందుకు ప్రత్యేకంగా గురుకులాలు ఏర్పాటుచేసి కర్రసాములో శిక్షణ ఇచ్చే వారు. కర్రసాములో బాగా రాణించిన వారికి సంఘంలో ప్రత్యేక ఆదరణ లభించేంది. కాలానుగుణంగా అన్ని రంగాలలో అభివృద్ధి సాధించడంతో కర్రసాము విద్య మరుగున పడిపోయింది. అయితే గ్రామీణ ప్రాంతాలలో ఇప్పటికీ ఆనాటి కర్రసాములో ప్రావీణ్యం పొందిన వారు ఉన్నారు. పెళ్లిసందడి, జాతర్లలో, ఉరుసు ఉత్సవాలతోపాటు పండుగ, పబ్బాల సమయంలోనూ కర్రసాము తళుక్కుమంటోంది. పూర్వకాలం నుంచి వస్తున్న అనేక విద్యల్లో కర్రసాము అనేది విలువైనదిగా గ్రామీణ ప్రాంత జనం భావించేవారు. కాలంలో మార్పు.. కంప్యూటర్ యుగం రాకతో పాతకాలం సంప్రదాయాలు కనుమరుగవుతున్నాయి. అయితే ఓబులవారిపల్లె మండలం మంగంపేటకు చెందిన పలువురు యువకులు, చిన్నారులు కర్రసాము పట్ల ఆసక్తి చూపడంతోపాటు నేర్చుకోవడం విశేషం. అలా గిర్రున తిప్పేస్తున్నారు.. అంతే..! మంగంపేట గ్రామస్తులు తమ పిల్లలకు కర్రసాము నేర్పించాలనే ఉద్దేశంతో పునరావాస కాలనీ కోసం ఏర్పాటు చేసిన మైదానంలో గత కొంతకాలంగా ప్రతిరోజూ కర్రసాముపై శిక్షణ పొందుతూ వస్తున్నారు. వై.కోట గ్రామానికి చెందిన గురువు బాబు వేసవి సెలవుల నుంచి ప్రతి నిత్యం సాయంత్రం సమయంలో కర్రసాము నేర్పించారు. ఇదే వరుసలో గ్రామానికి చెందిన యువత కూడా ఆసక్తి చూపుతూ కర్రసాములో భాగంగా కట్టెను అలా గిర్రున తిప్పేస్తున్నారు. సెలవులలో ఇంటి వద్ద ఉన్న పిల్లలు కర్రసాముపై మక్కువ పెంచుకొని ప్రతి రోజూ సాధన చేయడంతో ఇప్పుడుతిప్పడంలో ఆరితేరిపోయారు. గ్రామానికి చెందిన దాదాపు 40 మంది పిల్లలు కర్రసాములో ప్రత్యేక నైపుణ్యం ప్రదర్శిస్తున్నారు. మంగంపేట పునరావాస కాలనీకి చెందిన ఎన్ఆర్ఐ బాబాయి, అబ్బాయిలైన బంగారపు నరసింహులు, బంగారపు పీరయ్య గ్రామంలో యువకులు, పిల్లలకు కర్రసాము నేర్పించాలనే ఉద్దేశంతో వై.కోట గ్రామానికి చెందిన బాబు అనే గురువును ఏర్పాటు చేశారు. తొలుత పది మంది పిల్లలతో ప్రారంభించారు. అయితే కర్రసాములో యువకులు, పిల్లలు కొద్ది కాలంలోనే బాగా రాణిస్తుండంతో వీరిని చూసి మరికొంత మంది కర్రసాము నేర్చుకొనేందుకు ముందుకు వచ్చారు. ఏది ఎమైనా అంతరించి పోయిన కర్రసాము విద్యను మంగంపేట గ్రామస్తులు నేర్చుకుంటూ పది మందికి మళ్లీ పరిచయం చేస్తున్నారు. కర్ర తిప్పడం అప్పుడు కష్టం... ఇప్పుడు ఇష్టం కర్ర తిప్పడం అంటే సామాన్యమైన విషయం కాదు. గురువు సలహాలు, సూచనలతో వేళ్ల చేతితో కర్రను తిప్పడం సులువు కాదు. సాధన చేయగా తిప్పడం సులువుగా మారింది. తిప్పడంలో కూడా అనేక రకాలు ఉన్నాయి. కట్టె తిప్పుతూ ముందుకు నడుస్తూ, కాళ్ల కింద నుంచి తిప్పడం లాంటి మెలకువలు నేర్చుకున్నాను. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వీలు దొరికినప్పుడల్లా అందరం కలిసి సాధన చేయడం ద్వారా కర్రసాములో ప్రావీణ్యత సాధించాం. – ఎం.రామ్‌చరణ్, 10వ తరగతి, మంగంపేట, అన్నమయ్య జిల్లా వేసవి విడిదిలో పిల్లలకు నేర్పించాలని అనుకొన్నాను నేను గల్ఫ్ దేశం నుంచి స్వదేశానికి వచ్చి ఇంటి వద్ద మా పిల్లలకు కర్రసాము నేర్పించాలని అనుకున్నాను. మరి కొంత మంది పిల్లలు ఆసక్తి చూపడంతో గురువును ఏర్పాటు చేసి ప్రతి రోజూ నేర్పిస్తున్నాను. – బంగారపు నరసింహులు, ఎన్ఆర్ఐ మంగంపేట, ఓబులవారిపల్లె శారీరకంగా, మానసికంగా ఉపయోగకరం దాదాపు నలభై మంది పిల్లలు కర్రసాము నేర్చుకున్నారు. కొద్దిరోజుల్లోనే మెలకువలు తెలుసుకొని బాగా రాణిస్తున్నారు. పిల్లలు నేర్చుకునే సమయంలో చాలా ఆసక్తిగా కనిపించారు. ప్రతి రోజూ సాయంత్రం సమయంలో నేర్చుకోవడంతో శారీరకంగా, మానసికంగా పిల్లలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. – బి.పీరయ్య, మంగంపేట, ఓబులవారిపల్లె. వేసవి సెలవుల్లో నేర్చుకున్నా ! నా పేరు ఎం.సుశాంత్. మంగంపేటలో నివాసముంటున్నాను. మక్కా స్కూలులో ఆరవ తరగతి చదువుతున్నాను. వేసవి సెలవుల్లో ఏదో ఒక విభాగంలో నైపుణ్యం పెంచుకుంటే బాగుంటుందని భావించి కర్రసాము నేర్చుకున్నాను. దాదాపు 45 రోజుల వ్యవధిలో కర్ర బాగా తిప్పుతు న్నాను. చదువుతోపాటు ఆత్మరక్షణకు సంబంధించిన కర్రసాములో నైపుణ్యం సాధించాను. (క్లిక్: అవధాన ఉద్దండుడు.. నరాల రామారెడ్డి) -
కంబళలో మెరుపు వీరుడు
యశవంతపుర: బురద మడిలో దున్నపోతులతో పరిగెత్తే కర్ణాటక గ్రామీణ క్రీడ కంబళలో కొత్త రికార్డులు నమోదవుతున్నాయి. కంబళ పోటీల్లో ఉసేన్ బోల్ట్ కంటే వేగంగా పరుగెత్తాడన్న రికార్డు సొంతం చేసుకున్న కర్ణాటక మంగళూరువాసి శ్రీనివాసగౌడ మరో ఘనతను సృష్టించాడు. మంగళూరు సమీపంలోని బెళ్తంగడి తాలూకా వేణూరు పెర్ముడ సూర్య– చంద్ర జోడు చెరువులో శనివారం జరిగిన కంబళ పోటీలలో గతంలో నమోదైన అన్ని రికార్డులను బద్దలు కొట్టాడు. గతంలో కంబళ పోటీలో 100 మీటర్ల దూరాన్ని 11:21 సెకన్లలో, తర్వాత 9.37 సెకన్లలో అధిగమించినదే అత్యుత్తమ రికార్డులు కాగా, తాజా పోటీలలో ఏకంగా 8.96 సెకన్లలో చేరుకుని నభూతో అనిపించాడు. పాత రికార్డులను శ్రీనివాసగౌడ తుడిచిపెట్టాడు. తాజా పోటీలో సురేశ్ 9.37 సెకన్లు, ఆనంద 9.57 సెకన్లతో రెండు, మూడోస్థానంలో నిలిచారు. -
ఆట మారింది
వ్యాయామాన్ని అందించే గ్రామీణ క్రీడలు కనుమరుగు కూర్చున్న చోటు నుంచి కదలకుండా ఆడే ఆటలపైనే చిన్నారుల ఆసక్తి శారీరక శ్రమకు దూరం చిన్నారులు ఉత్సాహంగా, ఉల్లాసంగా గడిపేది వేసవి సెలవుల్లోనే. అంతకుముందు ఉదయం లేచింది మొదలు, రాత్రి నిద్రపోయే దాకా పుస్తకాలే లోకంగా గడిపే విద్యార్థులకు వ్యాయూమం చేసే అవకాశం లభించదు. ఇక వేసవి సెలవుల్లోనూ వారు ఆడే ఆటలు తగినంత శారీరక వ్యాయూమాన్ని అందించడం లేదు. ఫలితంగా స్థూలకాయం సమస్య బాలల్లో ఎక్కువగా కనిపిస్తోందని వైద్యనిపుణులు పేర్కొంటున్నారు. ఒకప్పుడు ఇందుకు పూర్తి భిన్నమైన పరిస్థితి ఉండేది. కబడ్డీ, చిర్రగోనె, తొక్కుడు బిళ్ల, గోలీల ఆట వంటివి వేసవి క్రీడలుగా ఉండేవి. వాటి వల్ల విద్యార్థులకు తగినంత శారీరక, మానసిక వ్యాయూమం లభించేది. వేసవి సెలవుల్లో ఆడే ఆటల ట్రెండ్ మారడంతో, చిన్నారులపై పడుతున్న ప్రభావాన్ని తెలిపే కథనమిది. - సాక్షి, హన్మకొండ వీడియో గేమ్స్ లోకంగా.. చిన్నారులకు అవసరమైనంత ఆహ్లాదాన్ని అందించేవి వీడియోగేమ్స్. ఒకప్పుడు వీటిని ఆడేందుకు ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్‌ను కలిగిన కేంద్రాలకు వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు అలా కాదు. స్మార్ట్‌ఫోన్ అరుుతే చాలు 3డీ స్థారుు కలిగిన వీడియో గేమ్స్‌ను సైతం డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు ఉంది. తల్లిదండ్రులు తమ ఫోన్లలోనూ చక్కటి గేమ్స్‌ను డౌన్లోడ్ చేసి ఆడుకోండంటూ పిల్లల చేతికిస్తున్నారు. వారు గంటల తరబడి గేమ్స్ ఆడుతూ గడిపేస్తున్నారు. ఫలితంగా బాలల్లో సోమరితనం పెరిగే అవకాశాలు ఉంటారుు. గేమ్స్ ఆడుతున్న తమ పిల్లలకు కూర్చున్న చోటికే అన్నం, పాలు వంటి ఆహార పదార్థాలను అందిస్తూ తల్లిదండ్రులు మురిసిపోతున్నారు. ఇటువంటి గేమ్స్ కారణంగా చిన్నతనంలోనే ఊబకాయం,కంటి సమస్యలు వచ్చే ఆస్కారం ఉంటుంది. టీవీలతో.. గతంలో స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలు క్రికెట్ ఆడటం కానీ, క బడ్డీ, చిర్రగోనె తదితర ఆటలు ఆడేవారు. ఫలితంగా తగినంత శారీరక శ్రమ ఉండటంతో ఆరోగ్యానికి మేలు జరిగేది. టెక్నాలజీ పుణ్యమా అని ప్రతి ఇంట్లోకి టీవీలు,కంప్యూటర్లు ప్రవేశించారుు. టీవీల్లో కార్టూన్, స్పోర్ట్స్ చానెల్స్ చూస్తూ పిల్లలు వాటినే లోకంగా భావిస్తున్నారు. సమ యం ఎంత అవుతోందనేది కూడా పట్టించుకోకుండా కళ్లన్నీ టీవీలకే అప్పగించి కూర్చుంటున్నారు. ఇక కనీసం ఆదివారం కూడా టీవీని వది లే ప్రసక్తి ఉండటం లేదు. ఎందుకంటే ఆ రోజు కూడా పిల్లలకు సంబంధించిన ప్రత్యేక కార్యక్రమాలు ఎన్నెన్నో ప్రస్తారమవుతారుు కాబట్టి. కంటి జబ్బులు వచ్చే అవకాశం సర్వేంద్రియానాం నయనం ప్రధానం అన్నారు పెద్దలు. రోజు లో ఎక్కువ సేపు టీవీలు, కంప్యూటర్ మానిటర్లకు అతుక్కుపోవడం వల్ల పిల్లల క ళ్లపై అధిక భారం పడుతోంది. దానితో కంటి సంబంధిత జబ్బులు, తలనొప్పి వంటి రోగాల బారిన పడుతున్నా రు. ఈ పరిస్థితిలో మార్పు తీసుకురాకపోతే భవిష్యత్తులో ఇబ్బం దులు తప్పవని ఇటు ఉపాధ్యాయులు, అటూ వైద్యరంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. చిన్నవయసులో చూపుపై ప్రభావం పడితే విమానయాన, సైనికరంగాల్లో ఉపాధి,ఉద్యోగ అవకాశాలకు గండిపడే ప్రమాదం ఉంది. ఈతకు వెళ్లే వారిపై తప్పక దృష్టిసారించాలి బయటకు వెళ్లి ఆడుకుంటామనే పిల్లలు తమ స్నేహితులతో కలిసి ఈత కొట్టేందుకు వెళ్తుంటారు. గ్రామీణ ప్రాంతాల్లో పిల్లలు ఈత పేరుతో చెరువులు, కుంటలకు వెళ్తుంటారు. గడిచిన రెండేళ్లుగా ప్రతీ వేసవిలో ఈత సరదాతో పదుల సంఖ్యలో పిల్లలు ప్రాణాలు కోల్పోతున్నారు.మిషన్ కాకతీయ కార్యక్రమంలో భాగంగా చెరువుల్లో పూడిక తీస్తున్నారు. వేసవిలో స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లే పిల్లలపై తల్లిదండ్రులు ఓ క న్నేసి ఉంచడం మంచింది. ఇప్పటికే పోలీసు శాఖ తరఫున పలు చోట్ల చెరువుల్లో ఈత కొట్టరాదంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. పట్టించుకోకుంటే.. చదువులోనూ వెనుకడుగే గేమ్స్ ఆడే క్రమంలో ఎత్తులకు పైఎత్తులు వేస్తూ ఒక్కో స్టేజ్ దాటుకుంటూ ముందుకుపోతుంటారు. ఇలాంటి సందర్భాల్లో శరీరంలో అడ్రినలిన్ హార్మోన్ ఎక్కువగా విడుదల అవుతుంది. అధిక మోతాదులో అడ్రినలిన్ విడుదల కావడం అంత మంచిది కాదు. దీనికితోడు టీవీలు కంప్యూటర్లలో ఆడే వీడియో గేమ్స్‌పై ఆసక్తి ఎక్కువైతే రానురాను తరగతి గదుల్లో చెప్పే పాఠాలు బోర్ కొడతాయి. పాఠాల్లో ఉండే విషయాల కంటే గేమ్స్‌లో ఉండే అడ్వెంచర్స్ వారిని ఎక్కువగా ఆకట్టుకుంటాయి. ఫలితంగా రానురాను చదువులో వెనకబడి పోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పిల్లలు పరిమిత సమయం కంటే ఎక్కువ సేపు వీడియోగేమ్స్ వైపు ఆకర్షితులవుతున్నారో లేదో అనే విషయాన్ని తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. అదే విధంగా నెట్ సర్ఫింగ్‌లో ఎక్కువ సమయం గడిపే అలవాటును కూడా మాన్పిస్తే మంచిది.