జల్లికట్టు కోసం తమిళనాడు ప్రజానీకం పోరాడిన స్ఫూర్తితో కర్ణాటకలోనూ తమ సంప్రదాయ కంబళ కోసం ప్రముఖులు గళమెత్తుతున్నారు. కర్ణాటకలోని మంగళూరు, ఉడుపి, దక్షిణ కన్నడ తదితర తీరప్రాంత జిల్లాల్లో బురద మడుల్లో ఎద్దులు, ఆంబోతులను కాడెకు కట్టి పరుగులు తీయిస్తారు. నిర్ణీత దూరాన్ని ముందుగా అధిగమించిన పశువులే ఈ పోటీలో విజేతలు. సంక్రాంతి తరువాత ఇది జోరుగా సాగుతుంది.