కర్ణాటక సంప్రదాయ క్రీడ కంబాళలో 30 ఏళ్ల రికార్డు తిరగరాసిన శ్రీనివాస గౌడను ఉసేన్ బోల్ట్‌తో పోల్చాం. మరి శ్రీనివాస గౌడ రికార్డు తిరగరాసిన నిశాంత్ శెట్టీనీ ఏమని పిలవాలో..! అవును, వేనూర్‌లో ఆదివారం జరిగిన కంబాళ క్రీడలో బజగోళి జోగిబెట్టుకు చెందిన ఈ నయా కంబాళ జాకీ 143 మీటర్ల దూరాన్ని కేవలం 13.68 సెకండ్లలో పరుగెత్తాడు. దీనిని 100 మీటర్లకు లెక్కించినపుడు.. ఉసేన్ బోల్ట్ (9.58 సెకండ్లలో 100 మీటర్లు) ప్రపంచ రికార్డు వేగాన్ని మించిన వేగం నమోదైనట్టే. అంటే బోల్ట్ కంటే 0.07 సెకండ్లు వేగంగా నిశాంత్ పరుగు పూర్తి చేశాడు.