
రక్తపింజర పామును మింగేసిన నాగుపాము
సాక్షి, విశాఖపట్నం: సింథియా ప్రాంతంలో ఇటీవల పాములు ఎక్కువగా జనావాసాల మధ్యలోకి వచ్చేస్తున్నాయి. గురువారం తెల్లవారుజామున సింథియా జంక్షన్ వద్ద ఉన్న నేవల్ క్వార్టర్స్ వద్ద 7 అడుగుల నాగుపాము స్థానికులను హడలెత్తించింది. రక్తపింజర పామును అమాంతం మింగేసి, తరువాత జీర్ణించుకోలేక బయటకు విడిచిపెట్టింది. స్థానికులు వెంటనే పాములు పట్టే నేర్పరి నాగరాజుకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. దీంతో నాగరాజు అక్కడికి చేరుకుని నాగుపాము ఎంతో చాకచక్యంతో పట్టుకుని నిర్మానుష్య ప్రదేశంలో విడిచిపెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment