raktapinjari
-
రక్తపింజర పామును మింగేసిన నాగుపాము
సాక్షి, విశాఖపట్నం: సింథియా ప్రాంతంలో ఇటీవల పాములు ఎక్కువగా జనావాసాల మధ్యలోకి వచ్చేస్తున్నాయి. గురువారం తెల్లవారుజామున సింథియా జంక్షన్ వద్ద ఉన్న నేవల్ క్వార్టర్స్ వద్ద 7 అడుగుల నాగుపాము స్థానికులను హడలెత్తించింది. రక్తపింజర పామును అమాంతం మింగేసి, తరువాత జీర్ణించుకోలేక బయటకు విడిచిపెట్టింది. స్థానికులు వెంటనే పాములు పట్టే నేర్పరి నాగరాజుకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. దీంతో నాగరాజు అక్కడికి చేరుకుని నాగుపాము ఎంతో చాకచక్యంతో పట్టుకుని నిర్మానుష్య ప్రదేశంలో విడిచిపెట్టారు. చదవండి: (ఇద్దరితో పెళ్లి.. మరొకరితో సహజీవనం.. చివరకు..) -
పాము కాటుతో మహిళా రైతు మృతి
సున్నపురాళ్లపల్లె(ఓబులవారిపల్లె): పొలంవద్ద సజ్జతోట కోతకు వెళ్లిన సున్నపురాళ్లపల్లె గ్రామానికి చెందిన అలం బుజ్జమ్మ (36) అనే మహిళా రైతు పాము కాటుకు గురై మృతి చెందింది. బంధువుల కథనం మేరకు.. రెండు రోజుల క్రితం పొలంలో సజ్జపంట కోత కోస్తుండగా రక్తపింజరి పాము కాటు వేయడంతో ప్రథమ చికిత్స చేయించారు. పరిస్థితి విషమించడంతో తిరుపతిలోని ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతూ గురువారం మృతి చెందింది. మృతురాలికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భర్త వెంకటసుబ్బయ్య వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు.