పొలంవద్ద సజ్జతోట కోతకు వెళ్లిన సున్నపురాళ్లపల్లె గ్రామానికి చెందిన అలం బుజ్జమ్మ (36) అనే మహిళా రైతు పాము కాటుకు గురై మృతి చెందింది.
సున్నపురాళ్లపల్లె(ఓబులవారిపల్లె): పొలంవద్ద సజ్జతోట కోతకు వెళ్లిన సున్నపురాళ్లపల్లె గ్రామానికి చెందిన అలం బుజ్జమ్మ (36) అనే మహిళా రైతు పాము కాటుకు గురై మృతి చెందింది. బంధువుల కథనం మేరకు.. రెండు రోజుల క్రితం పొలంలో సజ్జపంట కోత కోస్తుండగా రక్తపింజరి పాము కాటు వేయడంతో ప్రథమ చికిత్స చేయించారు. పరిస్థితి విషమించడంతో తిరుపతిలోని ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతూ గురువారం మృతి చెందింది. మృతురాలికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భర్త వెంకటసుబ్బయ్య వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు.